డెహ్రాడూన్ : ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డెహ్రాడూన్ మదర్సా కమిటీ తిరస్కరించింది. మతపరమైన కారణాలవల్ల మదర్సా ప్రాంగణంలో మోదీ ఫొటో పెట్టేది లేదని మదర్సా బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం విద్యాసంస్థలైన మదర్సాలు.. ప్రభుత్వ పర్యవేక్షణ, మార్గదర్శకంలో పనిచేయడం లేదని ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ (యూఎంఈబీ) తేల్చిచెప్పింది.
మదర్సా ప్రాంగణంలో ఎటువంటి వ్యక్తుల ఫొటోలు, ఛాయాచిత్రపటాలను పెట్టేందుకు ఇస్లాం సంప్రదాయం అంగీకరించదని బోర్డు తెలిపింది. మత సంప్రదాయం ప్రకారం.. మోదీ ఫొటో సహా ఎవరి ఫొటోను మదర్సాలోకి అనుమతించమని బోర్డు పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు వల్ల విద్యావ్యవస్థకు కూడా మతం రంగు పులముకుంటుందని ఒక మదర్సా టీచర్ అన్నారు. ఇదిలావుండగా.. 2017 స్వతంత్ర దినోత్సం సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని మదర్సాల్లోనూ ప్రధాని ఫొటోను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment