grounds
-
ఫిట్.. బాడీ సెట్..
కండలు తిరిగే దేహం అంటే యువతకు యమ క్రేజ్ ఉంటుంది. దీనికోసం జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. కొందరు రెగ్యులర్‌గా వెళ్లి సిక్స్ ప్యాక్ వచ్చేంత వరకూ కష్టపడుతుంటారు. కండలు పెరిగేందుకు ప్రొటీన్ పౌడర్ వంటివి తీసుకుంటుంటారు. వీటివల్ల దుష్పరిణామాలు చాలానే ఉంటాయి. అయితే అథ్లెటిక్ బాడీ అంటే గత కొంతకాలంగా యువతలో క్రేజ్ పెరిగిపోతోంది. విల్లులా దేహాన్ని మలుచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ దేహాన్నే మీసోమార్ఫ్ దేహం అని అంటుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రౌండ్స్‌లో పరుగులు పెడుతూ.. వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో ఫిట్నెస్తో పాటు మానసిక ఉల్లాసం, చక్కటి దేహాన్ని సొంతం చేసుకుంటున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లోని గ్రౌండ్స్‌లో యువత ఇటీవల ఫిట్నెస్ కోసం వ్యాయామాలు, కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. దీనికి పోటీ పరీక్షలైన ఆర్మీ, పోలీసులు, ఆరీ్పఎఫ్ వంటి నియామకాలు ఒక కారణమైతే.. స్పోర్ట్స్‌పై ఇంట్రెస్ట్‌తో కొందరు.. ఫిట్నెస్ మీద పెరిగిన అవగాహనతో మరికొందరు వ్యాయామాల భాటపడుతున్నారు. దీంతో ఉదయాన్నే లేచి గ్రౌండ్లో పరుగులు పెడుతున్నారు. అయితే గ్రౌండ్లో కసరత్తుల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలాంటి కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..? ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం..శరీర భాగాలపై సమానంగా.. జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా రోజూ రన్నింగ్ చేయడం వల్ల శరీరం ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో ఒకే శరీర అవయవంపై మాత్రమే వర్క్‌లోడ్ పడుతుంటుంది. అదే గ్రౌండ్లో వర్కవుట్స్ వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ఒకే విధంగా పనిచేస్తుంది. హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల కండరాలకు గాయమయ్యే ప్రమాదం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలూ ఎక్కువే. అయితే గ్రౌండ్లో వర్కవుట్స్ ద్వారా వచ్చిన ఫలితాలు చాలా కాలం వరకూ ఉంటాయి. అంటే కొంత కాలం కసరత్తులు ఆపేసినా కూడా పెద్దగా శరీరంలో మార్పులు రావు. అదే జిమ్ మధ్యలో ఆపేస్తే శరీరం మొత్తం మారిపోతుంది.ట్రైనింగ్ పద్ధతులు.. గ్రౌండ్లో చేసేందుకు సాధారణంగా పలు రకాల ట్రైనింగ్ పద్ధతులు ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, రెప్యుటేషన్ ట్రైనింగ్, క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అనే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా చక్కటి శరీరాకృతి పొందవచ్చు. బర్ఫీ, జంపింగ్ జాక్స్ వంటి ఎక్సర్సైజ్ల ద్వారా శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. వీటి వల్ల కొవ్వు తగ్గి బరువు తగ్గుతుంది. రన్నింగ్‌తో జీవక్రియలు మెరుగుపడటమే కాకుండా, శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్రౌండ్లో వర్కవుట్స్ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం తప్పనిసరి. దీంతో రన్నింగ్ చేసే స్టామినా పెరుగుతుంది.ఎత్తు పెరిగే అవకాశం.. గ్రౌండ్లో కసరత్తులు, రన్నింగ్ చేయడం వల్ల 18 ఏళ్ల లోపు పిల్లల్లో ఎత్తు పెరుగుతారని చెబుతున్నారు. అదే ఆ వయసులో ఉన్న వారు జిమ్ చేస్తే ఎత్తు పెరగడం ఆగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్‌లో ఉండే పరికరాలు అందరూ వాడటం వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూల్‌డౌన్ పద్ధతులు తప్పనిసరి.. గ్రౌండ్లో రన్నింగ్ లేదా కసరత్తులు చేసిన తర్వాత బాడీ కూల్‌డౌన్, స్ట్రెచ్ ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. ఇది అలసిపోయిన కండరాలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు పనికొస్తుంది. 30 ఏళ్లు దాటిన వాళ్లు ఎక్కువ కఠినమైన ఎక్సర్సైజులు చేయకపోవడం మంచిది. కండరాలపై స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. – కె.ధర్మేందర్, ఫిజికల్ డైరెక్టర్డైట్ చాలా ముఖ్యం.. గ్రౌండ్లో వర్కవుట్ చేసే వారికి డైట్ చాలా ముఖ్యం. శరీర తీరు, బరువు, చేసే వర్కవుట్‌ను బట్టి ఆహారం తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ఉన్న ఆహారపదార్థాలు తగ్గించాలి. ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కండరాలు పెరుగుతాయి. ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరిగి, బరువు పెరగదు. నీరు కూడా అధికంగా తీసుకుంటుండాలి. వర్కవుట్ కన్నా ముందు కనీసం ఒక లీటర్ నీళ్లు (గోరు వెచ్చటి నీరు) తాగాలి. – వసుధ, క్లినికల్ న్యూట్రిషనిస్టు -
International Yoga Day 2024: స్పెషల్ ఈవెంట్ ఫోటోలు
-
10న ఆదిలాబాద్‌లో అమిత్ షా సభ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది. 10న రాజేంద్రనగర్ నియోజకవర్గపరిధిలోని శంషాబాద్‌లో అదేరోజు సాయంత్రం అమిత్ షా సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఈ సభ రద్దు అయింది. దీనికి బదులు సికింద్రాబాద్ సిఖ్ విలేజీలోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొనున్నారు. మేధావుల సదస్సు సక్సెస్‌పై ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో లీగల్ సెల్‌తోపాటు ఇతర మేధావులతో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. సదస్సుకు అన్ని వర్గాల మేధావులను ఆహ్వనించి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వారి నుంచి బీజేపీ సలహాలు తీసుకోనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఆదిలాబాద్ సభలో అమిత్ షా వివ రిస్తారని అన్నారు. కేసీఆర్‌కు హఠావో, బీజేపీకో జీతావో.. తెలంగాణకో బచావో... అనేదే బీజేపీ నినాదామని చెప్పారు. ప్రధాని మోదీ దిష్టిబోమ్మలను ఎందుకు దగ్ధం చేస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం రూ.9 లక్షల కోట్లు ఇచ్చినందుకా, ఇటీవల రాష్ట్రానికి పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ వంటివి ప్రకటించినందుకా, కృష్ణానదీలో తెలంగాణ నీటి వాటా ఖరారుకు ట్రిబ్యునల్ వేసినందుకా.. మోదీ దిష్టిబో మ్మలు దగ్ధం చేస్తున్నారు’అని నిలదీశారు. -
ఆటంకాలు
మనజిల్లా అంత విస్తీర్ణం కలిగిన దేశాలు సైతం ఒలంపిక్స్‌లో సత్తాచాటుతున్నాయి.. మనం మాత్రం జాతీయస్థాయిని దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి. 125 కోట్లకు పైగా జనం అందులో 60 శాతం దాకా యువత ఉన్న మనదేశంలో గత ఒలంపిక్స్‌లో వచ్చిన పతకాల సంఖ్య రెండు.. పతకాల పట్టికలో 57వ స్థానం. మన జిల్లాకు సమానంగా ఉండే చిన్న చిన్న దేశాలు సైతం పతకాల పంట పండిస్తుంటే ప్రతిభ ఉన్నా.. ప్రోత్సాహం.. సరైన శిక్షణ, సౌకర్యాలు లేకపోవడంతో మన క్రీడాకారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీడల పరిస్థితులపై ప్రత్యేక కథనం.. కడప స్పోర్ట్స్: రాష్ట్రంలోని ఏకైక క్రీడాపాఠశాల డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాల కడప నగరంలోనే ఉన్నప్పటికీ ఈ పాఠశాల నుంచి ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయస్థాయి పతకం కూడా రాకపోవడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణ, వసతులు, క్రీడాసామగ్రి లేకపోవడంతో ఉన్నంతలోనే కాస్తో కూస్తో రాణిస్తున్నారే తప్ప ఒలంపిక్ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు కనిపించకపోవడం గమనార్హం. క్రీడాపాఠశాల ఏర్పాటై దాదాపు 12 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కనీసం ఒక్క క్రీడాకారుడు కూడా అంతర్జాతీయస్థాయిలో పాల్గొనలేదు. దీనికి తోడు తీరా పతకాలు సాధించే సమయంలో ఇంటర్మీడియట్ గ్రూపును తీసివేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. దీంతో 7 సంవత్సరాల పాటు సాధన చేసినప్పటికీ ఫలితాలు వచ్చే సమయానికి బయటకు పంపేస్తుండటంతో అంతర్జాతీయ పతకాలు కలగానే మిగిలాయి. డీఎస్ఏ మైదానం.. తిరోగమనం కడప నగరంలోని ఏకైక క్రీడామైదానం ప్రకాశం పంతులు జిల్లా క్రీడాప్రాథికార సంస్థ మైదానం. 1963లో దాదాపు 8 ఎకరాల్లో ఏర్పాటైన ఈ మైదానం నేడు తిరోగమనంలో పయనిస్తోంది. వర్షం వస్తే మడుగులా మారడంతో పాటు ఇటీవల మైదానం మధ్యలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయడంతో మైదానం ధ్వంసమైంది. తర్వాత పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అధ్యాన్నస్థితికి చేరుకుంది. వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం ఆవరణం సైతం చినుకు రాలితే.. మడుగులా మారుతోంది. పాఠశాలస్థాయిలో పరిస్థితులు ఇలా.. జిల్లాలో దాదాపు 4376 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం 1,151 పాఠశాలలు అనగా మూడోవంతు పాఠశాలల్లో తప్ప మిగతా పాఠశాలలు మైదానం లేకుండానే నెట్టుకొస్తున్నాయి. ఆటస్థలాలు ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను వేళ్లమీద లెక్కగట్టవచ్చు. పేరుకే వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేపట్టి విద్యార్థులకు ప్రతిరోజూ డ్రిల్, ఆటలు నిర్వహించాలి. ఇది నిబంధన కూడా. కానీ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేరుకే వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఒక్కరోజు కూడా డ్రిల్ చేయించిన పాపాన పోవడం లేదు. రోగాల ఉత్పత్తి కేంద్రాలు చదువు పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చివేస్తున్నారు. పిల్లల ఇష్టాఇష్టాలను పట్టించుకోకుండా తల్లిదండ్రుల అభిప్రాయాలు, ఆశయాలను పిల్లలపై రుద్దేస్తూ ఎప్పుడూ చదువుపైనే ధ్యాస ఉంచు అంటూ ఊదరగొడుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు రోగాల ఉత్పత్తి కేంద్రంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల భారం.. ఆటలకు దూరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించే సత్తా ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చతికిలపడుతోంది. దీంతో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి రాకుండా మరుగున పడిపోతోంది. క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో మైదానాలన్నీ బోసిపోతున్నాయి. జీఓ నెం. 63 ప్రకారం 2012లో అప్పటి ప్రభుత్వం వ్యాయామవిద్యను తప్పనిసరి చేస్తూ జీఓ నెం.63 జారీచేసింది. ఈ ఉత్వర్వు ప్రకారం ప్రభుత్వ, గుర్తింపు పొందిన అన్ని పాఠశాలల్లో వ్యాయామవిద్యను తప్పనిసరిగా నిర్వహించాలి. దీని అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను రూపొం దించి ఒక పీరియడ్‌ను నిర్వహించాలి. ఈ ఉత్వర్వుల ప్రకారం వారంలో 6 పీరియడ్లు అమలుచేయాల్సి ఉన్నా ఎక్కడా అమలుకావడం లేదు. 51వ జీఓ ప్రకారం 2003 మే 7వ తేదీన అప్పటి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు జీఓ నెంబర్ 51 జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం. జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధిస్తే రూ. 4.5 లక్షలు, రజతం సాధిస్తే 3 లక్షలు, కాంస్యపతకం సాధిస్తే 1.5లక్షలు నగదు బహుమతిగా ఇవ్వాల్సి ఉంది. పాఠశాల స్థాయి నుంచే ఈ ప్రోత్సాహకాలు అమలుకావాలి. కానీ ఎక్కడా ఇటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. అమలు కాని క్రీడా సమయం చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించాలన్న ప్రతిపాదన కేవలం నీటిమీద రాతల్లాగా మారింది. ఆటలను చుట్టేసి.. చదువు, ర్యాంకులు, జీపీఏలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం తగ్గి మరమనుషుల్లా మారుతున్నట్లు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. 45 నిమిషాల పాటు ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గి చలాకీగా ఉంటారని.. శారీరకంగా ఎదుగుదల సక్రమంగా జరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏ ఒక్క పాఠశాలల్లోను క్రీడలకంటూ ప్రత్యేక సమయం కేటాయించడం లేదు. 9, 10 తరగతుల విద్యార్థులైతే మైదానం వైపు చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. స్పెషల్‌క్లాసులు, ఐఐటీ ఫౌండేషన్ ఇలా చదువులకే పరిమితం చేస్తున్నారు. ఇరుకైన మైదానాల్లోనే.. జిల్లాలో ఆటస్థలాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల్లో మైదానాలు ఉండాలన్న నిబంధనలు చాలాచోట్ల కనిపంచడం లేదు. దీంతో ఇరుకైన మైదానంలోనే విద్యార్థులు ఆటలు ఆడాల్సి వస్తోంది. రోజురోజుకు విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదనపు తరగతుల నిర్మాణం చేపడుతుండటంతో ఉన్న స్థలం కాస్తా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా స్థలం సరిపోవడం లేదు. ఇక పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఎక్కడ ఉంటుంది. మరిక్నొ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక పిల్లలు క్రీడల్లో వెనుకబడుతున్నారు. -
ప్రధాని మోదీ ఫొటో పెట్టం!
డెహ్రాడూన్ : ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డెహ్రాడూన్ మదర్సా కమిటీ తిరస్కరించింది. మతపరమైన కారణాలవల్ల మదర్సా ప్రాంగణంలో మోదీ ఫొటో పెట్టేది లేదని మదర్సా బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం విద్యాసంస్థలైన మదర్సాలు.. ప్రభుత్వ పర్యవేక్షణ, మార్గదర్శకంలో పనిచేయడం లేదని ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ (యూఎంఈబీ) తేల్చిచెప్పింది. మదర్సా ప్రాంగణంలో ఎటువంటి వ్యక్తుల ఫొటోలు, ఛాయాచిత్రపటాలను పెట్టేందుకు ఇస్లాం సంప్రదాయం అంగీకరించదని బోర్డు తెలిపింది. మత సంప్రదాయం ప్రకారం.. మోదీ ఫొటో సహా ఎవరి ఫొటోను మదర్సాలోకి అనుమతించమని బోర్డు పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు వల్ల విద్యావ్యవస్థకు కూడా మతం రంగు పులముకుంటుందని ఒక మదర్సా టీచర్ అన్నారు. ఇదిలావుండగా.. 2017 స్వతంత్ర దినోత్సం సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని మదర్సాల్లోనూ ప్రధాని ఫొటోను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
కాఫీపొడితో ఎకోఫ్రెండ్లీ కప్పులు!
-
కాఫీపొడితో ఎకోఫ్రెండ్లీ కప్పులు!
జర్మనీః వ్యర్థాలనుంచీ ఉపయోగాలను సృష్టించడం ఆధునిక కాలంలో అత్యవసరంగా మారింది. పనికిరాని పదార్థాలనుంచీ విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాహనాలు, ఇతర వస్తువులు తయారు చేయడం చూస్తూనే ఉన్నాం. వాతావరణానికి హాని కలిగించేవే కాక, ఇతర వస్తువులను సైతం రీ సైకిల్ చేసి ఉపయోగించడంవల్ల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, వస్తు ఉత్పత్తిలో పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాడేసిన కాఫీ పొడితో అందమైన కాఫీ కప్పు, సాసర్లను తయారు చేసి పర్యావరణానికి మరింత సహకరించవచ్చంటున్నారు జర్మనీ ఉత్పత్తిదారులు. తమ ఉత్పత్తులు పగిలిపోకుండా ధృఢంగా ఉండటంతోపాటు, కొద్దిపాటి తాజా కాఫీ పరిమళంతోపాటు మంచి అనుభవాలను అందిస్తాయంటున్నారు. వాడిన కాఫీ పొడిని సౌందర్య సాధనంగానూ, వస్తువులను శుభ్రపరిచేందుకు, మొక్కల్లో ఎరువుగా వేసేందుకు వినియోగించడం తెలుసు. కానీ జర్మన్ కంపెనీ 'కాఫీఫామ్'.. కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాడేసి, ఎండిన కాఫీపొడిని బయోపాలిమర్ తో కలపి అందమైన కప్పులు, సాసర్ల తయారీ చేపడుతోంది. మనం తాగే ప్రతి కప్పు కాఫీకి సుమారు రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని వాడుతుంటాం. అలా ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది అలవాటుగా తాగే కాఫీ తయారీ అనంతరం.. పొడి వృధాగా పోతోందన్న జర్మనీ డిజైనర్ జూలియన్ లేచ్నర్ ఆలోచనలే కప్పు, సాసర్ల రూపం దాల్చాయి. ఇటలీ నగరం బొల్జానా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో లేచ్చర్ కు ఈ కొత్త ఆలోచన వచ్చింది. యూనివర్శిటీ విద్యార్థులు, స్నేహితులు ప్రతి తరగతి ముందు, తర్వాత, మీటింగ్ సమయాల్లో, ఒత్తడి కలిగినపుడు ఇలా తరచుగా కాఫీ తాగే అలవాటు లేచ్చర్ దృష్టిలో పడింది. అలా వాడిన కాఫీ పొడి అంతా ఏమైపోతోంది అన్న కోణంలో ఆలోచన కలిగిందే తడవుగా అతడి ప్రయత్నం ప్రారంభమైంది. కాఫీ పొడితో ఘన పదార్థాలను ఎలా తయారు చేయవచ్చు అన్న దిశగా ప్రొఫెసర్లతో చర్చించిన లేచ్చర్ సృష్టి.. పర్యావరణ అనుకూలమైన కప్పు సాసర్ల తయారీ దిశాగా కార్యరూపం దాల్చింది. అయితే ఈ ప్రయోగం ఫలించడానికి అతడికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రాధమికంగా కాఫీ పొడితో పంచదారను మిళితం చేసి ఘనపదార్థంగా తయారు చేసేందుకు ప్రయత్నించానని, అయితే అలా తయారైన కప్పులు కేవలం మూడుసార్లు ఉపయోగించిన తర్వాత పడేయాల్సిన పరిస్థితి ఉందని, దాంతో మన్నికైన కప్పుల తయారీ దిశగా జర్మన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుల సహకారంతో అనేక ప్రయోగాలు చేసిన అనంతరం చివరికి బయోపాలిమర్ల మిళితంతో దృఢమైన కప్పుల తయారీ సాధ్యమైందని లేచ్చర్ వెల్లడించాడు. వాణిజ్యపరంగా విజయవంతమవ్వడంతో ప్రస్తుతం ఈ కొత్త 'కాఫీఫామ్' కప్పుసాసర్లను యూరప్ లోని పది దుకాణాలతోపాటు, కంపెనీ ఆన్ లైన్ విక్రయాలు కూడా జరుపుతోంది. ఇప్పుడు ఆన్లైన్ లో వ్యక్తిగత ఆర్డర్లతోపాటు, సౌదీ అరేబియాలోని ఓ కేఫ్, టొరొంటోతోపాటు ఓస్లో నోబెల్ శాంతి బహుమతి మ్యూజియం వారి దుకాణాల్లో అమ్మేందుకు సైతం ఆర్డర్లు రావడం ఎంతో ఆనందాన్ని నింపిందని లేచ్చర్ తన కంపెనీ విజయాలను వివరించాడు. ప్రస్తుతం చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో కప్పుల తయారీకోసం ప్రత్యేకంగా వికలాంగులకు అవకాశం ఇస్తున్నామని, త్వరలో కాఫీఫామ్ పెద్ద ఎత్తున ఉత్పత్తులు ప్రారంభించి ట్రావెల్ మగ్గులను కూడ ఉత్పత్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపాడు. -
నలుపు తగ్గడానికి...
బ్యూటిప్స్ ఒక చిన్న గిన్నెలోనాలుగు టేబుల్ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగ ంట తర్వాత దూది ఉండను ఆ చల్లటి టీ డికాషన్‌లో ముంచి, ఆ ఉండను కనురెప్పల మీద పెట్టి, ఇరవై నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి. అలసిన కళ్లకు మంచి సాంత్వన లభిస్తుంది. ఇలా రోజూ చేస్తుంటే కళ్లకింద వలయాలూ తగ్గుతాయి. టీ స్పూన్ దోస రసం, టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే మోచేతుల నలుపుదనం తగ్గుతుంది. పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, వీపుకి పట్టించి, స్క్రబ్ చేసి పది నిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది. -
అందమె ఆనందం
రెండు టేబుల్ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగ ంట తర్వాత దూది ఉండను ఆ చల్లటి టీ డికాషన్‌లో ముంచి, కనురెప్పల మీద పెట్టి, ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అలసిన కళ్లకు మంచి సాంత్వన లభిస్తుంది. కళ్లకింద వలయాలూ తగ్గుతాయి. -
హాయిగా ఆడుకోనివ్వండి
మైదానాలు లేక, పార్కుల్లో చోటు లేక పిల్లలు ఏం కావాలని హైకోర్టు ఆవేదన 14వేలల్లో పిల్లలకు 126 మాత్రమేనా? మున్సిపాలిటీలకు సూటిప్రశ్న రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ఆటస్థలాలు లేవు. వీధుల్లో ఆడుకునే పరిస్థితి లేదు. పార్కులు పెద్దవారికే పరిమితమవుతున్నాయి. పిల్లలను ఓ మూలకు నెడుతుండడంతో వారు ఆడుకోలేని పరిస్థితి. దీంతో శారీరక వ్యాయామం లేక పిల్లలు అధిక బరువుతోనో, మరే ఇతర రుగ్మతలతోనో బాధపడుతున్నారు. న్యూఢిల్లీ : నగరంలోని మూడు కార్పొరేషన్స్‌లో 14వేల పార్కులున్నాయి. కానీ అందులో కేవలం 126 మాత్రమే పిల్లలవి. సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్నుండి వచ్చిన లేఖకు స్పందించిన ఢిల్లీ హైకోర్టు... నగరంలోని పార్కుల పరిస్థితిని, వాటి నిర్వహణ వివరాలను రెండు వారాల్లోగా తమకు నివేదించాలని అన్ని సంస్థలను ఆదేశించింది. పిల్లలు ఆడుకోకుండా ఆభరణాలుగా ఉన్న పార్కులు అంతరించి పోతాయని తెలిపింది. పిల్లలకు పార్కులు సరిగా లేకపోవడం, ఉన్న పార్కుల్లో ఆడుకునే స్థలం ఎక్కువగా లేకపోవడానికి ఒక్క ప్రభుత్వ సంస్థలనే దూషించాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆటలాడి ఇళ్ల అద్దాలు పగలగొడతారేమో, ప్రజలను గాయపరుస్తారేమో, గడ్డి పాడవుతుందనో పార్కుల్లో పిల్లలను ఆడుకోనియకుండా పెద్దలే ప్రధాన శత్రువులవుతున్నారు. పార్కుల్లో ‘పిల్లలు ప్రవేశించరాదు, ఇది తాకరాదు, అది తాకరాదు’ అంటూ బోర్డులు పెడతారు. చివరకు పోలీసులు కూడా ఆడుకోనివ్వకుండా పిల్లలను పార్కులనుంచి వెళ్లగొడుతున్నారు. క్రీడా మైదానాలుండవు. వీధుల్లో మొత్తం వాహనాలే ఉంటాయి? మరి పిల్లలెక్కడికి వెళ్లాలి? ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. చిత్తరంజన్ పార్కులో ఒకటో బ్లాకు చాలా అందంగా ఉంటుంది. అక్కడి వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి కిటికీకి తగిలి గాజు కిటికీ పగిలిపోయింది. దాంతో వీధుల్లో వారిని ఆడుకోనివ్వడం లేదు. ‘‘పార్కులోకి గార్డు మమ్మల్ని అనుమతించడు. బ్యాడ్మింటన్ గ్రౌండ్ ఉన్నా అది ఎప్పుడూ పెద్దవాళ్లతో నిండిపోయి ఉంటుంది. వాళ్లు మమ్మల్ని వేరే పార్కుకు వెళ్లి ఆడుకోమంటారు. ఇంకో పార్కుకు వెళ్లి ఆడుకోమంటారు. కానీ అది మా ఇంటికి చాలా దూరం కావడంతో మా అమ్మానాన్న అక్కడికి పోనివ్వరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చిన్నారి శుభం. ఇదిలా ఉంటే.. ఆ పార్కును ఓ టెంట్ హౌజ్ ఉపయోగించుకుంటోంది. ప్రతిచోటా ఏదో ఒక అడ్డంకి. మరి పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడికి పోవాలి? ‘‘పార్కుల్లో పిల్లలు ఆడుకోవడం వల్ల అక్కడే వాకింగ్ చేస్తున్న మాలాంటివాళ్లకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అందుకే బాల్వంటివి లేకుండా ఇతర ఆటలు ఆడుకొమ్మని చెబుతున్నాం’’ అన్నాడు భార్యతో కలిసి వాకింగ్‌కు వచ్చిన స్థానిక వాసి గోపాల్పాండే. అయితే దీన్ని అందరూ అంగీకరించడం లేదు. ఆడుకోవడానికి మైదానాలు లేక పిల్లలు అధిక బరువు పెరుగుతున్నారు. ప్రతిచోటా పిల్లలకోసం స్థలం కేటాయించాలని ఎంపీడీ-2021 చెప్పినా... అవి చెట్ల పెంపకానికే పరిమితమై చూడటానికే ఉన్నాయి తప్ప పిల్లలు ఆడుకోవడానికి లేదని, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో సభ్యత్వం తీసుకునే స్తోమత ప్రతి ఒక్కరికీ ఉండదు కదా అంటున్నారు స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అశోక్ బోస్. అయితే పిల్లల కోసం ప్రతి వార్డులో పార్కు, స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కార్పొరేషన్ ప్రణాళిక కాగితాలకే పరిమితమైపోయింది. కొన్ని అకాడమీలతో తాము మాట్లాడామని, త్వరలోనే అవి ఓ రూపుదాల్చుతాయని అంటున్నారు దక్షిణ ఢిల్లీ మేయర్ సరితా చౌదరి. పిల్లలను ఆడుకోవడానికి పార్కుల్లోకి అనుమతించినా పిల్లల భద్రత కోసం ప్రతి పార్కులో సిబ్బందిని ఏర్పాటు చేయలేమన్నది అధికారుల వాదన. ఇదిలా ఉంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ప్రతి ఏటా 300 కోట ్ల రూపాయలను పార్కుల మీద ఖర్చు చేస్తోంది. కానీ ఆ పార్కుల్లో పిల్లలను ఓ మూలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.కేవలం పిల్లలు మాత్రమే ఆడుకుంటున్న ఒకే ఒక్కటి ద్వారకా సెక్టార్ 11లోని పార్కు . ఇది పిల్లల కోసమేనని రెండేళ్ల కిందటే ప్రకటించారు. మానసిక, శారీరక వైకల్యంతో ఉన్న పిల్లలు ఆడుకోవడానికి అందులో ఏర్పాట్లు చేశారు.