
జైపూర్: ఓ న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో రాజస్తాన్‌కు చెందిన స్వామి కౌశలేంద్ర ప్రపన్నాచారీ ఫలహరి మహరాజ్(70)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి సెప్టెంబర్ 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఫలహరి మహరాజ్‌ను వైద్య పరీక్షల కోసం ఇక్కడి రాజీవ్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మధుసూదన్ ఆశ్రమాన్ని నడుపుతూ తనను తాను దైవంగా ప్రకటించుకున్న స్వామి ఫలహరి మహారాజ్‌కు బాధితురాలి తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా భక్తులన్నారు.