మైనర్‌ ఆత్మహత్య.. తండ్రి అత్యాచార ఆరోపణ | 16 Year Old Deceased By Suicide In Rajasthan | Sakshi
Sakshi News home page

మైనర్‌ ఆత్మహత్య.. తండ్రి అత్యాచార ఆరోపణ

Sep 22 2020 11:50 AM | Updated on Sep 22 2020 12:09 PM

16 Year Old Deceased By Suicide In Rajasthan - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న మైనర్‌ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. దారుణాన్ని భరించలేని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం ధోల్‌పూర్‌ జిల్లాలోని ఓ ఇంట్లో 16 ఏళ్ల బాలిక తన తండ్రితో కలిసి ఉంటోంది. శనివారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన బంటి, హర్కేష్‌‌లు తమ ఇంట్లోకి ప్రవేశించి తన కూతురిపై అత్యాచారం చేశారని బాలిక తండ్రి ఆరోపించారు. ఆ అవమానాన్ని భరించలేకే తమ కూతరు ఆత్మహత్యచేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  (ప్రేమించి పెళ్లి చేసుకొని.. నదిలో తోశాడు)

కాగా.. నిందితుల్లో ఒకరైన బంటీ.. బాధిత బాలికకు గతకొంతకాలం నుంచి పరిచయం ఉ‍న్నట్లు తెలుస్తోంది. దీంతో అతను తన స్నేహితుడు హర్కేష్‌తో కలిసి బాలిక ఇంటికి వెళ్లినట్లు' ధోల్పూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ కేసర్‌ సింగ్‌ తెలిపారు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అనేది పోస్టుమార్టం తర్వాత స్పష్టమవుతుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (రూ.కోటి ఇస్తామని నమ్మబలికి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement