ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : భక్తుల చేతిపై ముద్దు పెట్టి కరోనా వైరస్‌ను నయం చేస్తానన్న ఓ బాబా.. వైరస్ బారిన పడి మరణించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భక్తుల చేతులపై ముద్దు పెడితే వారి రోగాలు నయమవుతాయని రత్లామ్ నగరానికి చెందిన అస్లాం బాబాకు పేరుంది. అందుకుని పెద్ద సంఖ్యలో భక్తులు ఆయనను దర్శించుకునే వారు. ఆయన వారి చేతులపై ముద్దపెడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో కరోనా వచ్చినా భక్తులు ఆయన దగ్గరకు వెళ్లేవారు. ఆయన కూడా తాను చేతులపై ముద్దుపెట్టుకుంటే కరోనా నయం అవుతుందని ప్రచారం చేసుకున్నాడు.( కరోనా రోగికి అరుదైన ఆపరేషన్)
దీంతో వైరస్ సోకిన భక్తులు కూడా ఆయన దగ్గరకు వెళ్లారు. బాబా వారి చేతుల్ని ముద్దు పెట్టుకున్నారు. దీంతో ఆయనకు కరోనా సోకింది. అనంతరం బాబా చేత ముద్దు పెట్టించుకున్న 24 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిస్సింగ్ బాబా అస్లాం జూన్ 4న మరణించటం గమనార్హం. కాగా మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా దాదాపు 400 మంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment