గుర్గావ్‌ ఇక గురుగ్రామ్‌ | It is official, Gurgaon is Gurugram | Sakshi
Sakshi News home page

గుర్గావ్‌ ఇక గురుగ్రామ్‌

Published Wed, Sep 28 2016 5:45 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

It is official, Gurgaon is Gurugram

చండీగఢ్‌: హరియాణాలోని గుర్గావ్ నగరాన్ని ఇకపై గురుగ్రామ్‌గా పిలువనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. రాష్ట్రస్థాయి స్వర్ణ జయంతి వేడుకల కమిటీ తొలి సమావేశం సందర్భంగా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఈ వివరాలు వెల్లడించారు.

గుర్గావ్‌ నగరాన్ని, గుర్గావ్‌ జిల్లాను ఇకపై గురుగ్రామ్‌ పేరుతో వ్యవహరించనున్నట్లు తెలిపారు. భారతంలోని పాండవులు, కౌరవులకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యకు ఈ నగరాన్ని పాండవులు దక్షిణగా ఇచ్చారని, గురుగ్రామమనే పేరు తర్వాత గుర్గావ్‌గా మారిందని ప్రతీతి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement