
గంటకు 500 ఫిర్యాదులు అందుకుంటున్న సీఎం
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ప్రజల నుంచి ప్రతి గంటకు 500కు పైగా ఫిర్యాదులు అందుతున్నాయి.
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ప్రజల నుంచి ప్రతి గంటకు 500కు పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విషయం ఆయనే స్వయంగా ఈరోజు సోనిపట్‌లో మీడియాకు తెలిపారు. దీర్ఘకాల సమస్యలతోపాటు తాజా సమస్యలపై ఈ ఫిర్యాదులు ఉన్నట్లు ఆయన వివరించారు. నిర్ణీత కాలవ్యవధిలోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని మెరుగుపరిచామని, నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించేలా అధికారులపై బాధ్యత పెట్టినట్లు చెప్పారు. ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం నేరుగా ముఖ్యమంత్రిని సంప్రదించేలా ఈ నెల 25న హర్యానా ప్రభుత్వం సీఎం విండో పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది.