
కర్నాల్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మరోసారి బహిరంగంగా తన కోపాన్ని ప్రదర్శించారు. హరియాణా కర్నాల్‌లో ఆయన గురువారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలపై ఆయన పూలు చల్లుతుండగా.. ఓ కార్యకర్త ఆయన వద్దకు వచ్చి.. పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఫోన్ తీసి.. సీఎం ఎదురుగా పెట్టి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. కార్యకర్త సెల్ఫీయత్నం సీఎం ఖట్టర్‌కు తీవ్ర కోపం తెప్పించింది. అతని సెల్ఫీ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ.. సెల్‌ఫోన్ పట్టుకున్న చేతిని గట్టిగా తోసేసి.. అతనిపై కోపం ప్రదర్శించారు. దీంతో ఆ యువకుడు నిరాశగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అనంతరం సీఎం కట్టర్ యధావిధిగా ప్రజలపై పూలు చల్లుకుంటూ వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.