
మనోహర్‌లాల్ ఖట్టర్
చండీగఢ్ : దేశంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వాల్లో మాత్రం చలనం ఉండటం లేదు. రైతన్నల బాధలు, కష్టాలపై సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ రైతులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఖట్టర్ తీరును నెటిజన్లు తప్పుపడుతూ ట్వీట్లు, కామెంట్‌లు చేస్తున్నారు.
రైతులు దీక్షలు చేయడంపై శుక్రవారం సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవంగా రాష్ట్ర రైతులకు ఎలాంటి సమస్యలు లేవు. వారు అనవసర విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పండించిన పంటను రైతులు అమ్ముకోకపోవడం వల్లే వారికి నష్టాలొస్తున్నాయని చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే రైతులకు ఎప్పటికీ మంచి రోజులు రావంటూ బీజేపీ సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.