సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా శనివారం ఎన్నికయ్యారు. దీంతో ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది.
10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుంది. దీంతో ఖట్టర్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖట్టర్ ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. వివాదాస్పద స్వతంత్య్ర ఎమ్మెల్యే గోపాల్ కండా మద్దతు తీసుకోవడం లేదని మరో బీజేపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment