హర్యానా: రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. జాట్ల రిజర్వేషన్ అంశంపై శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖట్టర్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక మార్చి 31 వరకు వస్తుందని, అప్పటి వరకు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా అందరూ సహకరించాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం జాట్ కమ్యూనిటీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. గురువారం పలు హింసాత్మక ఘటనలతో రోహ్తక్ ప్రాంతంలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది.