jat
-
ఆ ఆరుగురు మంత్రుల్లో టెన్షన్ టెన్షన్
UP Assembly Elections 2022: 2013 ముజఫర్‌నగర్ హింసాత్మక ఘటనలతో జాట్లు, మైనార్టీల మధ్య చీలిక ఏర్పడి.. 2017 ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. మెజార్టీ సీట్లతో బంపర్ విక్టరీ సాధించింది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి దశలో పశ్చిమ యూపీలో ప్రధానంగా వార్తల్లో ఉన్న నియోజకవర్గాలైన కైరానా, థాన్‌భవన్, సర్దానా, ఆగ్రా రూరల్, మథుర, నొయిడా, హస్తినాపూర్ పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో యోగి క్యాబినెట్‌లోని మంత్రులు బరిలో ఉన్నారు. మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌లు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్లలో ఇప్పుడు టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఓటమి ఆందోళనకు కారణాలు.. ►పశ్చిమ యూపీ రీజియన్.. చెరుకు పంటకు ఫేమస్. అయితే ఈ ప్రాంతంలోని రైతులకు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ, ఈ విషయంలో రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ►జాట్ ఓటర్లు.. తొలి దశ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ముందుండి నడిపించింది. ►జాట్లలో పట్టున్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం మరో కీలక పరిణామం. ►గత ఎన్నికల్లో 58 సీట్లకుగానూ బీజేపీ 53 సీట్లను గెలుచుకుంది. 2017 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆర్ఎల్డీ.. ఈసారి ఎస్పీ వెంటనడుస్తోంది. ►కరోనా సమయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరుపైనా నిరసనలు వెల్లువెత్తాయి. ►సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో పశ్చిమ యూపీ కీలక పాత్ర పోషించింది. దీంతో బీజేపీపై ఇది కొంత ప్రతికూలాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖద్వారమైన ఢిల్లీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్పత్, మేరఠ్, గాజియాబాద్, హాపుఢ్, గౌతమబుద్ధనగర్, బులంద్‌షెహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్-19 నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 623 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సంబంధిత వార్త: నామినేషన్లో రెండో భార్య పేరు.. మొదటి భార్య అలక, ఆపై.. -
Ground Report: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పరిస్థితి ఏమిటి?
కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: గౌతమబుద్ధనగర్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు ఓటు బ్యాంక్‌లో తేడాలు వస్తే లాభపడేదెవరు? నష్టపోయేదెవరు? ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన పశ్చిమ ప్రాంతంపైనే ఈసారి అన్ని పార్టీల గురి... మతకల్లోలాలు, ఉద్రిక్తతలే ఆసరాగా ఆ ప్రాంతంలో ఓటు బ్యాంకు పెంచుకున్న కమలనాథులు హిందువులతో పాటు ఓబీసీలు, దళితులు కూడా బీజేపీ వైపు మళ్లించుకొని 2017లో అధికారపీఠాన్ని అందుకున్నారు. ఈసారి బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం.. క్షేత్రస్థాయిలో బీజేపీ వ్యూహాలు ఫలించడం లేదనే అభిప్రాయం హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య వాతావరణం... దారి చూపిన రైతు పోరుబాట ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి గణనీయంగా ఓట్ల బదిలీ జరుగుతుందంటున్న విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఇక్కడ నామమాత్రమే.. ఈ నేపథ్యంలో యూపీకి దిక్సూచిగా నిలిచే పశ్చిమాన ఎవరికి మెజారిటీ వస్తే... వారికే లక్నో పీఠం దక్కేది! ఉత్తరప్రదేశ్‌లో పార్టీల గెలుపోటములను నిర్ణయించే జాట్లు, ముస్లింలు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గడచిన శాననసభ ఎన్నికల్లో మెజారిటీ జాట్ కులస్తులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు పలికారు. ముస్లింల ఓట్లను సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పంచుకున్నాయి. మొదటి రెండు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో జాట్లు, ముస్లింలదే నిర్ణయాత్మక పాత్ర. గడచిన ఎన్నికల్లో 50 శాతంకు పైగా జాట్లు బీజేపీకి మద్దతు పలికితే, మిగిలిన 50 శాతం ఓట్లు అన్ని పార్టీలు పంచుకున్నాయి. ఇక ముస్లిం ఓటర్లలో 60 శాతం మంది ఎస్పీకి, 30 శాతం మంది బీఎస్పీకి ఓటేయగా మిగిలిన 10 శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు పలికారు. జరగబోయే ఎన్నికల్లో ఈ పరిస్థితి తారుమారవుతుందని ప్రముఖ సర్వే సంస్థలతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఓట్లేసిన జాట్లలో 25 శాతం మంది ఈసారి ఓటేయకపోతే బీజేపీకి మొత్తం ఐదు శాతం మేర ఓట్లు తగ్గుతాయి. గతంలో బీఎప్పీకి ఓట్లేసిన ముస్లింలలో 15 శాతం మంది ఈసారి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ మేరకు ఆ ఓట్లు ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి బదిలీ అయితే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెండు విశ్లేషణలను పరిశీలిస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాంప్రదాయ ఓటుకు ఈ ఎన్నికలలో గండి పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుల మతాలతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులు ఆ పార్టీకి దూరమైన కారణంగా ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కోనున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ యూపీలో ఎస్పీ, బీఎస్పీల కంటే బీజేపీ సాంప్రదాయ ఓటు ఎక్కువ. 1991 నుంచి గణాంకాలను పరిశీలిస్తే బీజేపీకి సగటున 34, ఎస్పీకి 29, బీఎస్పీకి 21 శాతం ఓట్లు లభిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 42.6 శాతం ఓట్లతో ఏకంగా 71 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్ దీనికి గణనీయంగా దోహదపడింది. ఆగ్రా, అలీఘర్, మీరట్, ముజఫర్‌నగర్, ఫిరోజాబాద్, ఘజియాబాద్, మీరట్ తదితర ప్రాంతాల్లోని 20 లోక్‌సభ స్థానాలు కమలదళం గెలుచుకుంది. గడచిన శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈ ప్రాంతంలో 83 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి పరిస్థితి ఏమిటి? మొదటి రెండు దశల్లోనే పశ్చిమ యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి ఇక్కడ మొత్తం ఉన్నవి 78 సీట్లే. అయితే తొలి రెండు విడతల్లో కలిపితే... 113 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల విజయంపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న బిజ్నౌర్ ప్రాంతంతో కలుపుకుంటే మొత్తం 113 స్థానాలకు గాను 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 91 చోట్ల బీజేపీ, 17 స్థానాల్లో ఎస్పీ విజయం సాధింంచగా, బీఎస్పీ, కాంగ్రెస్‌లు రెండు స్థానాల చొప్పున, ఆర్ఎల్డీ ఒక చోట గెలుపొందాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి 5, బీఎస్పీ నుంచి 10 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే పశ్చిమ యుపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి 60 నుంచి 70 శాతం సీట్లు సాధించే అవకాశం ఉన్నదని సీఎస్డీఎస్ సర్వే నిపుణుడు ప్రభాత్ కుమార్ అంచనా వేశారు. (క్లిక్: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం) గత ఎన్నికల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన 50 శాతం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. మిగిలిన 50 శాతం మంది జాట్లు అన్ని పార్టీలకు మద్దతిచ్చారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కారణంగా 25 శాతం మంది జాట్లు బీజేపీకి దూరమైనా ఆ పార్టీ ఓటు బ్యాంకులో కనీసం 5 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయి. అదే జరిగితే కనీసం 25 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అక్కడ కోల్పోనుంది. అదే సమయంలో ఎస్పీ కూటమికి 29 సీట్లు పెరగనున్నాయి. ఇక, బీఎస్పీ ఓటు బ్యాంకుగా చెప్పుకునే 21 శాతం ఓట్లలో బీజేపీ, ఎస్పీ కూటమికి ఎంత బదిలీ అవుతుందన్నది కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. బీఎస్పీ ఓటు బ్యాంకు 5–10 శాతం ఎస్పీ కూటమికి బదిలీ అవుతుందనే అంచనా మేరకు ఎస్పీ కూటమి భారీగా లాభపడనుందని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. ఇక, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పేరిట కూడా అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఇవి కూడా యోగి నేతృత్వంలోని బీజేపీ, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ కూటముల మధ్య పెద్ద అంతరం లేదని, ఈసారి తీవ్ర పోటీ తప్పదని అంచనా వేస్తున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య లాంటి కీలక ఓబీసీ నేతల రాక కూడా సమాజ్‌వాదీ శిబిరానికి అదనపు బలం కానుంది. రైతాంగ పోరాటంతో ఏకతాటిపైకి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు జరిగిన రైతాంగ ఉద్యమం బీజేపీ రాజకీయ వ్యూహాలను కుదిపేస్తోంది. కుల, మతాలలో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులను ఈ ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ‘హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని కూడా ఈ ఉద్యమం తీసుకు రాగలిగింది’ అని మీరట్ కు చెందిన హిందూ–ముస్లిం సమభావన సమితి కార్యదర్శి మహమ్మద్ అలియా భట్ అన్నారు. దీనికి తోడు పశ్చిమ యూపీలో శాంతియుత వాతావరణం కోసం ఆర్ ఎల్డీ నిర్వహించే ‘భాయ్ చరా’ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత దివంగత అజిత్ సింగ్ ఇలాంటి సమావేశాలు ఎన్నో నిర్వహించారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణానంతరం సమాజ్ వాదీ నాయకురాలు తబస్సుమ్ బేగంను ఆర్ఎల్డీ అభ్యర్థిగా కైరానా లోక్ సభ నుంచి బరిలో దింపి విజయ తీరాన్ని చేర్చింది కూడా ఈ సమావేశాలతోనే. అజిత్ సింగ్ మరణానంతరం ఆయన కుమారుడు జయంత్ కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) హిందూ ఓటు బ్యాంక్ తమదేనన్న ధీమా! కానీ, కమలదళం మాత్రం హిందువుల ఓటు బ్యాంకు తమదేనన్న ధీమాతో ఉంది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూనే ఆ చట్టాలు రద్దు చేసినందున వ్యతిరేకత తగ్గిపోయిందని ప్రచారం చేస్తోంది. యుపీలో రైతాంగానికి 50 శాతం విద్యుత్ బిల్లుల తగ్గింపు తమకు మేలు చేస్తుందని, ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటామని కేంద్ర మంత్రి సంజీవ్ ధీమా వ్యక్తం చేశారు. ముజఫర్ నగర్లో ప్రచారం చేస్తున్న ఆయన సాక్షి ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని నీటి బుడగగా అభివర్ణించారు. అంతే కాదు బీజేపీ ఈసారి కూడా హిందూ ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే వ్యూహానికే పదును పెడుతోంది. అందులో భాగంగానే కైరానా నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా ’పలాయన్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ముజఫర్ నగర్ ఘర్షణల్లో వలస వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబాలను కలిసి పరామర్శించారు. అంతే కాదు యోగి పాలనలో శాంతి భద్రతలు మెరుగు పడినందునే ఈ ప్రాంత ప్రజలు శాంతి యుతంగా జీవించగలుగుతున్నారని కితాబునిచ్చారు కూడా. అయితే, ఈ కితాబులు, కమల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి..? గత రెండు, మూడు ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలుస్తున్న పశ్చిమ యూపీ గ్రామీణ, సెమీ అర్బన్ ఓటరు ఈసారి ఏం చేస్తాడు? కమల వికాసానికి తోడ్పడుతాడా? ఏనుగు దిగి, హ్యాండిచ్చి మరీ సైకిల్ ఎక్కుతాడా? ముజఫర్‌నగర్ నుంచి మీరట్ వరకు ఓటరన్న ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతాడన్నది ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు దేశ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) క్షేత్రస్థాయిలో పని చేయని బీజేపీ వ్యూహాలు ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నట్టు కనిపించడం లేదు. విభజన రాజకీయాలను తాము గ్రహించగలిగామని, మళ్లీ ఆ ఉచ్చులో పడబోమనే నినాదం ఇక్కడి స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఈ అంశంలో తమ పాచికలు పారడం లేదని గ్రహించిన కేంద్ర మంత్రి, కైరానా ఎంపీ సంజీవ్ బలియాన్ ఇప్పుడు ముస్లిం సానుభూతిపరుడిగా మారిపోయారు. ముజఫర్ నగర్ లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క చోట కూడా ఎస్పీ, ఆర్ఎల్డీలు ముస్లిం అభ్యర్థులను ఎందుకు నిలబెట్టడం లేదంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాజకీయ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు స్థానిక ముస్లింలు సహన పరీక్ష ఎదుర్కొనవలసి వస్తోందని ఇమామ్‌ల సంఘం నేతలంటున్నారంటే పశ్చిమ యూపీలో మారిన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. రైతు ఉద్యమకారుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఏర్పాటు చేసిన బీకేయూ కూడా మత సామరస్యం కోసం పని చేస్తూ గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చింది. ‘ఈసారి గతంలో మాదిరి తప్పులు చేయం. మా భవిష్యత్ ఏమిటో మాకు తెలిసివచ్చింది’ అని మహేంద్ర సింగ్ కుమారులు రాకేశ్, నరేశ్ తికాయత్‌లు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. (క్లిక్: యోగీకి కలిసొచ్చే, సవాల్ విసిరే అంశాలివే!) -
హనుమాన్ జాట్ కులస్తుడే: యూపీ మంత్రి
లక్నో: ఆంజనేయుడు తమ జాట్ కులస్తుడేనని ఉత్తరప్రదేశ్ మత వ్యవహారాల శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌధరి వ్యాఖ్యానించారు. ‘శ్రీరాముడి అర్ధాంగి సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్లాడు. హనుమంతుడు వెళ్లి లంకాదహనం చేశాడు. శ్రీరాముడికి అపకారం తలపెట్టింది రావణుడు. అసలు సీతారాములు ఎవరో, రావణుడు ఎవరో హనుమంతుడికి తెలియదు. కానీ, ఆయన అన్యాయం జరుగుతుంటే సహించలేకపోయాడు. ఇదే జాట్ల వ్యక్తిత్వం. అన్యాయం ఎక్కడ, ఎవరికి జరిగినా జాట్లు సహించలేరు’ అంటూ తన వాదనను సమర్థించుకున్నారు. -
సం‘కుల’ సమరం.. ఎవరిదో విజయం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రతిపాదికన ఓట్ల సమరం సాగుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కులం కార్డును బలంగా వాడుకుంటున్నాయి. ఒక కులానికి చెందిన వారిపై అదే కులానికి చెందిన వారికి పోటీ దించాయి ప్రధాన పార్టీలు. దాదాపు 31 నియోజకవర్గాల్లో ఇదే రకమైన పోటీ నెలకొంది. డిసెంబర్ 7న ఎన్నికలకు జాట్ సామాజిక వర్గానికి బీజేపీ, కాంగ్రెస్ 33 సీట్ల చొప్పున కేటాయించాయి. బీజేపీ 26, కాంగ్రెస్15 స్థానాల్లో రాజ్‌పుత్‌లను పోటీకి దించాయి. ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తం 60 సీట్లుపైగా దక్కాయి. బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వెనుక బడిన కులాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 మంది ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వగా, అధికార బీజేపీ కేవలం ఒఏ ఒక్క టికెట్ కేటాయించింది. 15 నియోజకవర్గాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన వారినే బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోటీకి నిలిపాయి. బ్రాహ్మణులు ఏడు చోట్ల, రాజ్‌పుత్‌లు నాలుగు స్థానాల్లో, గుజ్జర్లు, యాదవులు రెండు చోట్ల ముఖాముఖి తలపడుతున్నారు. రాజస్థాన్‌లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించేప్పుడు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కులాన్ని దృష్టిలో పెట్టుకుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా రాజ్‌పుత్‌ల మద్దతుతో బీజేపీ ముందుకు సాగుతోందని, ఈసారి పరిస్థితి మారే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే కాంగ్రెస్‌కు లాభించనుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 46.05 శాతం, కాంగ్రెస్‌కు 33.7 శాతం ఓట్లు వచ్చాయి. 2008 శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ 34.27 శాతం, హస్తం పార్టీ 36.82 శాతం ఓట్లు దక్కించుకున్నాట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి సం‘కుల’ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో డిసెంబర్ 11న తేలనుంది. -
జాట్ ఉద్యమం మళ్లీ వస్తోంది
చండీగఢ్: రిజర్వేషన్‌పై తమ డిమాండ్లను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విఫలమయినందున మళ్లీ ఆందోళన చేపట్టనున్నామని జాట్ ఉద్యమ నేతలు ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. అయితే, ఆ ఆందోళనను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారనీ, ఇందుకు సంబంధించి మగళవారం మాక్ డ్రిల్ ను కూడా నిర్వహించారని గుర్గావ్ పోలీసు శాఖ పీఆర్వో మనీష్ సెహగల్ తెలిపారు. గతేడాది రాష్ట్రంలోని 19 జిల్లాలో్ తీవ్రస్థాయిలో జాట్ ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. అలాగే, ఈసారి కూడా హర్యానా, ఢిల్లీల నుంచి వీలైనంత మంది ప్రజల మద్ధతును కూడగట్టుకుని వచ్చేవారం నుంచి ఆందోళన ప్రారంభించాలని జాట్ ఉద్యమ నాయకులు భావిస్తున్నట్లు చెప్పారు. "ఓబీసీ గుర్తింపు పొందేందుకు గత 11 నెలలుగా గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధం. ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఆందోళన విరమిస్తే మీ డిమాండ్లను పరిశీలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ హామీలిచ్చాయి. అందోళనలో పాల్గొన్న యువకులపై తప్పుడు కేసులు బనాయించాయి. అందుకే యూపీలోని ముజఫర్ నగర్, బారాత్, భాగ్ పాట్ జిల్లాల్లో నివశించే జాట్లు వచ్చే నెల ఆ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నాం' అని అఖిల భారత జాట్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యశ్ పాల్ మాలిక్ మీడియాకు చెప్పారు. -
మరోసారి జాట్ల జగడం
చండీగఢ్: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ జాట్ కులస్తులు ఆదివారం నుంచి మరోసారి భారీ ఉద్యమబాట పట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని హరియాణా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భద్రత కోసం 20 వేల మంది జవాన్లను మోహరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాట్ల ఉద్యమం సందర్భంగా హరియాణాలో పెద్ద ఎత్తున విధ్వంసం, ప్రాణనష్టం జరిగింది. ఉద్యమానికి కేంద్రమైన రోహ్తక్ జిల్లాలోని జస్సియా గ్రామంలో ఆదివారం హవనం నిర్వహించడం ద్వారా జాట్లు మరోసారి ఆందోళనలను మొదలుపెట్టారు. అఖిల భారత జాట్ రిజర్వేషన్ సంఘర్షణ సమితి (ఏఐజేఏఎస్ఎస్) నేతృత్వంలో వందలాది మంది రోహతక్-పానిపట్ హైవేపై టెంట్లు వేసుకొని నిరసన తెలుపుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సెలవులను రద్దు చేసింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, సున్నిత ప్రాంతాల్లో సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు విధించామని అధికారులు ప్రకటించారు. పుకార్ల వ్యాప్తిని నిరోధించడానికి కొన్ని జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లను నిషేధించారు. తొలి రోజు చాలా చోట్ల జాట్ల కార్యక్రమాలు జరిగినప్పటికీ తొలిరోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదని పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాలు ఉండగా, 15 జిల్లాల్లో తమ ఉద్యమాలు కొనసాగుతున్నాయని జాట్లు ప్రకటించారు. ‘మేం శాంతియుతంగా ధర్నాలు చేస్తాం. జాట్లకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఇది వరకు ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలి. ఆందోళనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం అందజేయాలి’ అని ఉద్యమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రోహ్తక్, సోనెపట్, భివానీ, హిస్సార్, జింద్, కైతాల్, ఝజ్జర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలు, పోలీసులు కవాతులు నిర్వహిస్తున్నారు. హైవేలు, రైలుపట్టాలను జాట్లు ధ్వంసం చేసే అవకాశాలు ఉండడంతో పటిష్ట నిఘా ఉంచారు. ఫిబ్రవరిలో జరిగిన ఆందోళనల్లోనూ జాట్లు హైవేలు, రైల్వేమార్గాలను మూసివేయడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. ఢిల్లీకి నీటి సరఫరా చేసే మునాక్ కాలువను మూసివేశారు. ఈసారి అటువంటి పరిస్థితిని నివారించడానికి కాలువ వెంట పెద్ద ఎత్తున పారామిలిటరీ దళాలను మోహరించారు. జాట్లు ధర్నాలు చేసుకోవడానికి స్థలాలను ఏర్పాటుచేశామని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హోంశాఖ అదనపు కార్యదర్శి రామ్ నివాస్ ప్రకటించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి చండీగఢ్ లో కంట్రోల్ రూముల్ని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తామని జాట్లు తనకు హామీ ఇచ్చారని ప్రకటించారు. ఫిబ్రవరిలో జాట్ల ఆందోళనల సందర్భంగా పలు చోట్ల హింస, దోపిడీలు జరగడమేగాక, 30 మంది మరణించారు. -
జాట్ల రిజర్వేషన్‌పై స్టే
పంజాబ్, హర్యానా హైకోర్టు ఉత్తర్వులు చండీగఢ్: జాట్లతోపాటు మరో ఐదు వర్గాలకు బీసీ (సీ) కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తెచ్చిన చట్టంపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించింది. హర్యానా వెనుకబడిన తరగతుల (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్) చట్టం-2016ను హర్యానా అసెంబ్లీ గత మార్చి 29న ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.. దీని చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్ఎస్ సరోన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దీనిపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మురారిలాల్ గుప్తా అనే వ్యక్తి కొత్తగా తెచ్చిన బీసీ (సీ) కేటగిరీని సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ నివేదిక మేరకు ప్రభుత్వం జాట్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించిందని, అయితే ఈ కమిషన్ నివేదికను అప్పటికే సుప్రీంకోర్టు తిరస్కరించిందని పిటిషనర్ చెప్పారు. న్యాయ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ రిజర్వేషన్ చెల్లుబాటుకాదన్నారు. ఈ కమిషన్ నివేదికలోని అంశాలపై సవరణలు చేసే అధికారం కేవలం న్యాయవ్యవస్థకే ఉందని, దీనిపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని చెప్పారు. -
హరియానా ప్రభుత్వానికి జాట్ల డెడ్‌లైన్!
చండీగఢ్: రిజర్వేషన్ల కోసం మరోసారి ఉద్యమబాట పట్టనున్నట్లు ప్రకటించిన జాట్ నేతలతో శుక్రవారం హరియాణా ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే.. మార్చి 31వ తేదీ వరకు ఆందోళనలకు దూరంగా ఉంటామని జాట్ నేతలు హామీ ఇచ్చారు. దీంతో హరియానా రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇటీవల జాట్ల ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆందోళన బాట పట్టనున్నారన్న వార్తలతో.. హరియాణాలో ఇప్పటికే భారీగా పారామిలటరీ బలగాలను మోహరించారు. రోహ్తక్, జజ్జర్, సోనిపట్ జిల్లాలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేసినట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్.. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌తో శాంతిభద్రతలపై సమీక్ష జరిపారు. ఇవాళ జరిగిన చర్చల్లో తమ ప్రధానమైన ఏడు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకు ఎలాంటి ఆందోళనలు చేపట్టబోమని జాట్ నేతలు తెలిపారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తమకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు వెల్లడించారు. మార్చి 31 తరువాత తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, రైళ్ళ పునరుద్ధరణ
ఎట్టకేలకు జాట్ల ఆందోళన ముగిసింది. హరియాణాలో వాతావరణం చల్లబడింది. రిజర్వేషన్లకోసం జాట్లు చేపట్టిన ఆందోళనలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్బంధం తొలగింది. నాలుగు రోజులపాటు నిర్బంధంలో ఉన్న ఢిల్లీ అంబాలా నేషనల్ హైవే ను మంగళవారం సాయంత్రంనుంచీ తెరిచారు. నిరసనకారులు ఆందోళన విరమించడంతో రైలు రోడ్డు మార్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ కు అంతరాయం తొలగినట్లు అధికారులు వెల్లడించారు. అంబాల ఢిల్లీ మార్గాల్లో రైల్వే ట్రాక్ ల తనిఖీలు, మరమ్మత్తులు నిర్వహించామని రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ అంబాల ఛండీగర్ మార్గాల్లో రైలు సర్వీసులను బుధవారం సాయంత్రంనుంచీ యధావిధిగా పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆందోళనలో దెబ్బతిన్న ట్రాక్ లపై అడ్డంకులు తొలగించి, మరమ్మత్తులు నిర్వహించామని చెప్పారు. ఢిల్లీనుంచి మొదలయ్యే అన్ని మార్గాల్లో భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టామని రైల్వే అధికారులు చెప్తున్నారు. హిసార్ నుంచి ఢిల్లీ సహా భివాని, రెవారి, జైపూర్, సదుల్ పూర్, గంగానగర్లకు రైళ్ళను పునరుద్ధరిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే హిసార్ నుంచి చండీగర్, ఢిల్లీ, రోటాక్ లకు బస్ సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు హర్యానా రోడ్ వేస్ హిసార్ జనరల్ మేనేజర్ రామ్ కుమార్ తెలిపారు. బుధవారం నుంచి హరియాణాలో పూర్తిశాతం కర్ఫ్యూ ను ఎత్తివేశారు. రోటాక్ నరంలో పరిస్థితి ప్రశాతంగా మారింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా మంగళవారం సాయంత్రం రోటాక్ లో పర్యటించి స్థానికుల సమస్యలను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు, షాప్ కీపర్లకు జరిగిన భారీ నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై నగరంలో నివాసాలపై ఎక్కడైనా నల్లజెండాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్య, ఉద్యోగాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలంటూ ఫిబ్రవరి 14న హరియాణాలో మొదలైన జాట్ల ఆందోళన తీవ్ర స్థాయికి చేరి సుమారు 200 మందిదాకా గాయపడగా... 19 మంది ప్రాణాలను కూడ పోగొట్టుకున్నారు. ఆందోళనలపై స్పందించిన కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ.. లిఖిత పూర్వక హామీని కోరుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. చివరికి రిజర్వేషన్లు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటికి నాయకత్వం వహిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం హరియాణా ముఖ్యమంత్రి ఖత్తర్ సహా ఇద్దరు హౌస్ సభ్యులను పిలిపించి చర్చలు జరిపిన అనంతరం హరియాణాలో పూర్తిశాతం అల్లర్లు చల్లబడి, వాతావరణం సాధారణ స్థాయికి చేరింది. -
అదుపులోకి హరియాణా
జింద్‌లో కర్ఫ్యూ ఎత్తివేత, రోహ్తక్లో 4 గంటల పాటు పలు ప్రాంతాల్లో తగ్గని ఉద్రిక్తత.. రాస్తారోకోలు, ఆందోళనలు రోహ్తక్లో సీఎం ఖట్టర్ పర్యటన.. కాన్వాయ్‌ను ముట్టడించిన స్థానికులు చండీగఢ్: జాట్ల రిజర్వేషన్ పోరాటంతో అట్టుడుకుతున్న హరియాణాలో పరిస్థితి కాస్త తెరిపిచ్చింది. ఉద్రిక్తతలు తగ్గినా పలుచోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలి స్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో పలు చోట్ల ఆందోళనలను విరమించగా.. మరికొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజలు అత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు రోహ్తక్ ప్రాంతంలో 4 గంటలపాటు కర్ఫ్యూను సడలించి.. తిరిగి విధించారు. జింద్ జిల్లాలో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. హిస్సార్, హన్సి, భివానిలలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. కాగా, సీఎం ఖట్టర్ రోహ్తక్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు సీఎం కాన్వాయ్‌ను ముట్టడించారు. పట్టణంలో విధ్వంసం సృష్టించినవారిని, లూటీలకు పాల్పడినవారిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. తొలగిన అడ్డంకులు.. రహదారుల దిగ్బంధాన్ని ఆందోళనకారులు విరమించుకోవటంతో.. ప్రయాణికులు, నిత్యావసర వస్తువుల రవాణాకు కాస్తంత ఉపశమనం లభించింది. అంబాలా-ఢిల్లీ హైవేపై పానిపట్ వరకూ మార్గంపై అడ్డంకులు తొలగిపోయాయి. రైలు మార్గాలపై ధర్నాలను కూడా ఆందోళనకారులు విరమించారు. రిజర్వేషన్‌పై కమిటీ భేటీ జాట్ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ.. మంగళవారం హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమైంది. కోటా అమలుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. మరోవైపు, పంజాబ్-హరియాణా హైకోర్టు కూడా జాట్ల ఆందోళనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని వచ్చే సోమవారంలోగా వివరించాలని హరియాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఢిల్లీ పెద్దల పిలుపు.. బయల్దేరిన సీఎం, మంత్రులు
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తన ఇద్దరు మంత్రులతో కలిసి మంగళవారం ఉదయం రాజధాని ఢిల్లీకి బయల్దేరారు. జాట్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించటానికి ఏర్పాటుచేసిన కమిటీకి నాయకత్వం వహిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దానికి సంబంధించిన విషయాలను చర్చించేందుకు రమ్మని కబురుపెట్టడంతో హరియాణా పెద్దలు ఢిల్లీకి బయల్దేరారు. జాట్ల రిజర్వేషన్లపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ... ముందుగా హరియాణా ప్రభుత్వ అభిప్రాయాలను సేకరించనుంది. రిజర్వేషన్లు కోరుతూ హరియాణాలో జాట్లు ఫిబ్రవరి 14న ఆందోళన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 18 మంది చనిపోగా, 200 మంది గాయపడ్డారు. హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి ఓపి ధనకర్, ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యుల ఇళ్లకు నిరసనకారులు నిప్పంటించారు. వీరిద్దరూ కూడా సీఎంతో కలిసి వెంకయ్యనాయుడును కలసేందుకు ఢిల్లీ వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వ హామీతో జాట్లు ఆందోళన విరమించినా... కొన్నిచోట్ల ఇంకా రోడ్ల నిర్బంధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ కావాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. ఢిల్లీనుంచి అంబాలా వెళ్లే జాతీయ రహదారి1, ఢిల్లీ నుంచి హరియాణా వెళ్లే నేషనల్ హైవే 10, పంజాబ్ నుంచి రాజస్థాన్ వెళ్లే దారులను సోమవారం కూడా నిరసనకారులు దిగ్బంధించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నారు. ఢిల్లీ రివారి జఝర్ రోడ్, నేషనల్ హైవే 1 లకు పారామిలటరీ బలగాలు మరమ్మత్తులు నిర్వహించాయి. -
'జాట్లు పెద్ద వ్యూహమే పన్నారు'
ఝాజర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాట్ల ఉద్యమం పేరుకే రిజర్వేషన్ల డిమాండ్ ఉద్యమం అని దాని వెనుక భారీ వ్యూహం ఉందని తెలుస్తోంది. తమ జాతికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించాలనేది వారి తదుపరి డిమాండ్ అని, దానికి ముందస్తు కసరత్తుగానే ఈ ఉద్యమం చేస్తున్నారని తెలిసింది. ఝాజర్ టౌన్లో ఆందోళనలు చేస్తున్న జాట్లు 'రావ్ తులా రామ్' విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆ గొడవ కాస్త జాట్ వర్సెస్ జాట్ లేతరుల మధ్యకు మళ్లింది. ఎందుకంటే రామ్ తులా రామ్ యాదవులకు చెందిన శక్తిమంతమైన తిరుగులేని నేత. పైగా యాదవులను అక్కడ ఓబీసీలుగా గుర్తించారు. ఇలా చేయడం జాట్ లకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ముందు రిజర్వేషన్ల పేరుతో ఉద్యమాన్ని లేవదీసి.. తర్వాత ముఖ్యమంత్రి స్థానం కోసం మరోసారి రోడ్లెక్కాలన్నది వారి అసలైన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే అంశాన్ని కొందరు యాదవులు స్వయంగా చర్చించుకుంటున్నారు. జాట్ ల వ్యూహాన్ని వారు పసిగట్టారు. ఒక వేళ నిజంగా అదే అంశం తెరపైకి వస్తే ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో ఎదురుచూడాల్సిందే. -
జాట్ల రిజర్వేషన్లపై దిగొచ్చిన సర్కార్!
ఢిల్లీ: జాట్ల రిజర్వేషన్ విషయంలో సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జాట్లకు రిజర్వేషన్ కల్పించే అంశంపై బిల్లు ప్రవేశపెట్టడానికి హర్యానా ప్రభుత్వం అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుందని, జాట్ నాయకులతో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ప్రకటన చేయనున్నట్లు మంత్రి ఓపీ ధన్కర్ ఆదివారం తెలిపారు. ఎనిమిది రోజులుగా జాట్లు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడంతో మృతుల సంఖ్య 12 కు చేరింది. ఉద్యమం రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో సైతం ఉద్రిక్తతలకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ ఆదివారం హర్యానా మంత్రి ధన్కర్, ఢిల్లీ పోలీస్ చీఫ్ బీఎస్ బస్సీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్‌తో సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ.. జాట్ ల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపిన ఆయన జాట్ లను ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. -
జాట్ల ఆందోళనతో 20 వేల కోట్లు నష్టం
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జాట్ల ఆందోళనల మూలంగా హర్యానా రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు పారిశ్రామిక సంస్థ అసోచామ్ తన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాష్ట్రంలో స్తంభించిపోయిన పారిశ్రామిక ఉత్పత్తుల మూలంగా ఈ నష్టం వాటిల్లినట్లు అసోచామ్ తెలిపింది. జాట్ల ఉద్యమం హర్యానాతో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లపై కూడా ఆర్ధికంగా ప్రభావం చూపుతోందని ఈ నివేదిక తెలిపింది. పలు ముఖ్యమైన జాతీయ రహదారులు హర్యానా రాష్ట్రం గుండా వెళ్తుండటంతో ఆ ప్రాంతంలోని రవాణా అనుబంధ రంగాలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు వెల్లడించింది. ఆదివారం కూడా హర్యానాలో జాట్ల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. -
సంయమనం పాటించండి: సీఎం
హర్యానా: రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. జాట్ల రిజర్వేషన్ అంశంపై శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖట్టర్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక మార్చి 31 వరకు వస్తుందని, అప్పటి వరకు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం జాట్ కమ్యూనిటీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. గురువారం పలు హింసాత్మక ఘటనలతో రోహ్తక్ ప్రాంతంలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది.