జాట్‌ ఉద్యమం మళ్లీ వస్తోంది | Jats planning fresh quota agitation in haryana | Sakshi
Sakshi News home page

జాట్‌ ఉద్యమం మళ్లీ వస్తోంది

Published Mon, Jan 23 2017 8:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

Jats planning fresh quota agitation in haryana

చండీగఢ్‌: రిజర్వేషన్‌పై తమ డిమాండ్లను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విఫలమయినందున మళ్లీ ఆందోళన చేపట్టనున్నామని జాట్ ఉద్యమ నేతలు ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. అయితే, ఆ ఆందోళనను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారనీ, ఇందుకు సంబంధించి మగళవారం మాక్ డ్రిల్ ను కూడా నిర్వహించారని గుర్గావ్ పోలీసు శాఖ పీఆర్వో మనీష్ సెహగల్ తెలిపారు. గతేడాది రాష్ట్రంలోని 19 జిల్లాలో్ తీవ్రస్థాయిలో జాట్‌ ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే.

అలాగే, ఈసారి కూడా హర్యానా, ఢిల్లీల నుంచి వీలైనంత మంది ప్రజల మద్ధతును కూడగట్టుకుని వచ్చేవారం నుంచి ఆందోళన ప్రారంభించాలని జాట్ ఉద్యమ నాయకులు భావిస్తున్నట్లు చెప్పారు. "ఓబీసీ గుర్తింపు పొందేందుకు గత 11 నెలలుగా గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధం.

ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఆందోళన విరమిస్తే మీ డిమాండ్లను పరిశీలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ హామీలిచ్చాయి. అందోళనలో పాల్గొన్న యువకులపై తప్పుడు కేసులు బనాయించాయి. అందుకే యూపీలోని ముజఫర్ నగర్, బారాత్, భాగ్ పాట్ జిల్లాల్లో నివశించే జాట్లు వచ్చే నెల ఆ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నాం' అని అఖిల భారత జాట్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యశ్ పాల్ మాలిక్ మీడియాకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement