ప్రతీకాత్మక చిత్రం
చంఢీఘడ్: నిరుద్యోగులుకి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు హరియాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిరుద్యోగులుకి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లును గురువారం ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, జానాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారు. అయినప్పటికి ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. నెలకు 50,000 రూపాయల కన్నా తక్కువ జీతం ఉన్న ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 75% కొత్త ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ( ఉద్యోగులకు దీపావళి కానుక : ఒక నెల బోనస్ )
ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేటు కంపెనీలు, సంఘాలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు మొదలైన వాటిలో స్థానికులకు ఉపాధి దొరకనుంది. స్థానిక యువతకు ఉపాధి అవకశాలు పెంచేందుకు ఈ బిల్లు తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. దుష్యంత్ చౌతాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. "ఈ రోజు హరియాణలోని లక్షలాది మంది యువతకు ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు లభిస్తాయి" అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment