
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయమై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 80 నుంచి 90 శాతం రేప్, ఈవిటీజింగ్ కేసుల్లో బాధిత మహిళలు, నిందితులు ఒకరికొకరు తెలిసినవాళ్లే.. పలు కేసుల్లో వారు చాలాకాలంగా తెలిసినవారే. వారి మధ్య ఏదైనా సమస్య వచ్చి వాగ్వాదం జరిగినప్పుడే.. తనపై లైంగిక దాడి చేశారంటూ మహిళలు కేసులు పెడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
‘రేప్‌కేసులు పెరగలేదు. గతంలో జరుగుతూ ఉండేవి. ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఆ ఘటన పట్ల ఆందోళనే ఇప్పుడు పెరిగింది’ ఆయన చాలా తేలిగ్గా వ్యాఖ్యలు చేశారు. పంచకుల జిల్లా కల్కా పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత సెప్టెంబర్‌లో హరియాణ రెవారి జిల్లాలో 19 ఏళ్ల అమ్మాయిని అపహరించి.. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఇదే జిల్లాలో పాఠశాల నుంచి తిరిగొస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో నిత్యం ఇలా అత్యాచారాలు వెలుగుచూస్తున్నా.. ఈ దారుణాలపై సీఎం ఖట్టర్ నిర్లక్ష్య ధోరణిలో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment