నిక్షేపంగా జీన్స్ వేసుకోవచ్చు!
పాఠశాలల్లో టీచర్లు జీన్స్ వేసుకోకూడదని తాము ఎప్పుడూ చెప్పలేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, ఎవరైనా అలా చెప్పి ఉంటే దాన్ని వెనక్కి తీసుకుంటామని... అలా జరగనే జరగదని ఆయన చెప్పారు. అంతకుముందు ప్రాథమిక విద్య డైరెక్టర్ కార్యాలయం నుంచి జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లేటపుడు గానీ, విద్యాశాఖ కార్యాలయానికి వచ్చేటపుడు గానీ జీన్స్ ధరించకూడదని చెప్పారు.
జీన్స్ వేసుకోవడం అంత బాగోదని, అందువల్ల ఫార్మల్స్ మాత్రమే వేసుకోవాలని ఆ నాలుగు లైన్ల ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేతప్ప అందుకు కారణాలు కూడా ఏమీ ప్రస్తావించలేదు. అయితే, సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు కాబట్టి టీచర్లు ఇక నిక్షేపంగా జీన్సు వేసుకుని స్కూలుకు వెళ్లొచ్చన్న మాట.