Haryana Chief Minister
-
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్‌లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
సన్‌ఫ్లవర్ ధరపై సమస్య..జాతీయ రహదారిని నిర్బంధించిన రైతులు
హరియాణా:సన్ఫ్లర్ (పొద్దుతిరుగుడు) పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంపై హరియాణాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీఎం మంజూరు చేసిన రిలీఫ్ ఫండ్ తక్కువగా ఉందని రోడ్లపైకి వచ్చారు. కురుక్షేత్ర జిల్లాలో నిర్వహించిన మహాపంచాయత్ తీర్మాణం మేరకు ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారిపై రైతులు బైటాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. హరియాణాలో సన్‌ఫ్లవర్‌కు కనీస మద్దతు లభించడంలేదు. మద్దతు ధర లభించని పంటలకు రాష్ట్రంలో భవంతర్ భర్తీ యోజన(బీబీవై) కింద రిలీఫ్ ఫండ్‌ను ప్రభుత్వం ఇస్తోంది. అయితే. ఈ ఏడాదికి 36,414 ఎకరాల్లో సాగు చేసిన సన్‌ఫ్లవర్ పంటకు రూ.29.13కోట్లను విడుదల చేశారు సీఎం మనోహర్ పారికర్. అయితే.. ఈ ఫండ్‌పై సంతృప్తి చెందని రైతులు ఆందోళనలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్‌ఫ్లవర్ క్వింటాల్‌కు రూ.1000ని నష్టపరిహారంగా ఇస్తోంది. కానీ రూ.6400 కనీస మద్దతు ధర ఇచ్చి సన్ఫ్లవర్ను కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక ఆరోపణల్లో ఉద్యమించిన రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా ఈ మహాపంచాయత్‌లో పాలుపంచుకున్నారు. రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా ఈ నిరసనల్లో ఉన్నారు. దీనిపై స్పందించిన సీఎం మనోహర్ పారికర్.. రైతు సంఘాలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి:'కొవిన్ యాప్‌లో వ్యక్తిగత డేటా లీక్'.. కేంద్రంపై ప్రతిపక్షాలు ఫైర్.. -
ఇక కశ్మీర్ వధువులను తెచ్చుకోవచ్చు
చండీగఢ్: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు పరిణామాలపై స్పందిస్తూ ‘గతంలో బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకునేవారమని, ఇకపై కశ్మీర్ నుంచి అందమైన వధువులను తెచ్చుకోవచ్చు’అంటూ వ్యాఖ్యానించారు. ఫతేబాద్‌లో శనివారం లింగ నిష్పత్తిపై జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదం కావడంతో, మీడియా తనను అపార్థం చేసుకుందంటూ తను అన్న మాటలను వీడియో ఆధారాలతో ట్విట్టర్లో పోస్టు చేశారు. కాగా, హరియాణా ముఖ్యమంత్రివి హేయమైన మాటలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కఠోరమైన ఆర్ఎస్ఎస్ శిక్షణ కూడా ఆ బలహీన మనస్తత్వం ఉన్న మనిషిపై ప్రభావితం చూపలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, ‘ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు కూడా అవమానంగా భావించాలి’అని అన్నారు. -
సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం
-
సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం
పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా.. తెలంగాణ అమ్మాయా అన్న అనుమానం అక్కర్లేదు. ఆమె కర్ణాటక అమ్మాయి అని హరియాణా సీఎం తేల్చేశారు. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించి రియోలో భారతదేశానికి తొలి పతకం అందించిన సాక్షి మాలిక్‌ను ఆమె సొంత రాష్ట్రం హరియాణాలో ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆమెకు రూ. 2.5 కోట్ల పురస్కారం అందించారు. అయితే.. అదే సందర్భంలో పీవీ సింధు విషయంలో మాత్రం ఆయన మాట తడబడ్డారు. సింధును కర్ణాటకకు చెందిన అమ్మాయి అని చెప్పారు. చివరకు ఆమె పేరు కూడా సరిగా పలకలేదు. వరుసపెట్టి టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్.. ఇలా చాలా క్రీడల్లో ఒక్క పతకం కూడా రాక భారతీయులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయిన తరుణంలో సాక్షి మాలిక్ దేశానికి మొట్టమొదటి పతకం అందించింది. రియో నుంచి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీలోను, తర్వాత హరియాణాలోను కూడా ఘన స్వాగతం లభించింది. అయితే.. సాక్షిమాలిక్‌ను సత్కరించే సందర్భంలో హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సింధు పేరేంటో మర్చిపోయారు. అంతేకాక, ఆమెను కన్నడ అమ్మాయి అని చెప్పారు. నిజానికి మంత్రులు ఒలింపిక్ క్రీడాకారులను మర్చిపోవడం ఇది మొదటిసారి ఏమీ కాదు. దీపా కర్మాకర్ పేరును సాక్షాత్తు కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ తప్పుగా చెప్పారు. -
ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న సీఎం.. పర్యటన వాయిదా
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా గుర్గావ్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారట. గత గురువారం దాదాపు 12 గంటలకు పైగా వేలాదిమంది ప్రయాణికులు గుర్గావ్ నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అలాంటి జామ్ పరిస్థితే మళ్లీ ఏర్పడింది. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అందులో చిక్కుకున్నారు. ఢిల్లీ-గుర్గావ్-జైపూర్ మార్గంలోని ౮వ నెంబరు జాతీయ రహదారిపై రాజోకరి ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా జామ్ అవడంతో ఆయన తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దుచేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది. న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్ ప్రాంతంలో గల హర్యానా భవన్‌కు సీఎం వెళ్లాల్సి ఉంది. అయితే గుర్గావ్ సహా జాతీయ రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. కశ్మీర్ గేట్, ఘాజీపూర్, ధౌలా కౌన్, ఢిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా గ్రాఫిక్ జామ్ అయింది. రాజోకరి ప్రాంతం దేశ రాజధానిలోకి రావడానికి ఉన్న కీలక జంక్షన్లలో ఒకటి. గత గురువారం ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఢిల్లీ, హరియాణా ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. దానికి బాధ్యులు మీరంటే మీరంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ట్రాఫిక్ జామ్ ఫలితంగా గుర్గావ్ పోలీసు కమిషనర్ విర్క్ మీద బదిలీవేటు కూడా పడింది. -
నిక్షేపంగా జీన్స్ వేసుకోవచ్చు!
పాఠశాలల్లో టీచర్లు జీన్స్ వేసుకోకూడదని తాము ఎప్పుడూ చెప్పలేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, ఎవరైనా అలా చెప్పి ఉంటే దాన్ని వెనక్కి తీసుకుంటామని... అలా జరగనే జరగదని ఆయన చెప్పారు. అంతకుముందు ప్రాథమిక విద్య డైరెక్టర్ కార్యాలయం నుంచి జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లేటపుడు గానీ, విద్యాశాఖ కార్యాలయానికి వచ్చేటపుడు గానీ జీన్స్ ధరించకూడదని చెప్పారు. జీన్స్ వేసుకోవడం అంత బాగోదని, అందువల్ల ఫార్మల్స్ మాత్రమే వేసుకోవాలని ఆ నాలుగు లైన్ల ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేతప్ప అందుకు కారణాలు కూడా ఏమీ ప్రస్తావించలేదు. అయితే, సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు కాబట్టి టీచర్లు ఇక నిక్షేపంగా జీన్సు వేసుకుని స్కూలుకు వెళ్లొచ్చన్న మాట. -
'ముస్లింలను పాకిస్థాన్ పొమ్మనలేదు'
'ముస్లింలు ఈ దేశంలో ఉండాలంటే ఆవు మాంసం తినడం మానుకోవాల్సిందే. ఆవు ఇక్కడ విశ్వాసానికి ప్రతీక' అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెనుకకు తగ్గారు. ముస్లింల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించారని పేర్కొన్నారు. అయినా, తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన గాయపడితే.. చింతిస్తున్నానని అన్నారు. ముస్లింలు భారత్‌లో ఉండొద్దని, వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని తాను వ్యాఖ్యలు చేసినట్టు ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని వివరణ ఇచ్చారు. ముస్లింలు భారత్‌లో ఉండాలంటే బీఫ్ తినొద్దంటూ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆయన వ్యాఖ్యలకు సొంత పార్టీ బీజేపీ కూడా దూరం జరిగింది. బీఫ్ విషయమై దాద్రిలో ముస్లిం వ్యక్తి హత్య నేపథ్యంలో ఈ విషయమై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కమలం అధినాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ ఖట్టర్ అభిప్రాయాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆహార అలవాట్లు ప్రజల వ్యక్తిగతమని, దీనిని మతానికి ముడిపెట్టి చూడటం సరికాదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నేతలు వ్యాఖ్యలు చేయాలని పేర్కొన్నారు. -
మాజీ సీఎం పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: హర్యానా టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. చౌతాలా, మరో తొమ్మిది మంది దాఖలు చేసిన పిటిషన్‌ను.. సోమవారం జస్టిస్ కలిఫుల్లా సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. 1999 టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు వీరిని దోషులుగా ప్రకటిస్తూ పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను రద్దు చేయాలంటూ చౌతాలా సుప్రీం కోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. -
33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారుల బదిలీ
హర్యానా: రాష్ట్రంలో 128 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తు హర్యానా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులంతా హర్యానా సివిల్ సర్వీసెస్ (హెచ్‌సీఎస్) అధికారులే. ఇటీవల హర్యానా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు మనోహర్ లాల్ కట్టర్ సీఎంగా అక్టోబర్ 26న పదవి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ఇటీవల వరకు దాదాపు 100 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా శనివారం 128 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసే ఫైల్‌పై సీఎం మనోహర్ లాల్ సంతకం చేశారు. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన 33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారులను బదిలీ చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
ఖట్టర్ వార్షికాదాయం రూ. 2.73 లక్షలే!
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా ఎన్నికైన బీజేపీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్(60) తన వృత్తి వ్యవసాయమని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు ట్యూషన్ కూడా చెప్పానని తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ఆదాయం 2.73 లక్షలు. రోహతక్ జిల్లాలోని బిన్యాయి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీని విలువ రూ. 50 లక్షలు. బిన్యాయిలో రూ. 3లక్షల ఖరీదు చేసే ఇల్లు కూడా ఉంది. బ్యాంకులో రూ. 2.29 లక్షలు సహా రూ. 8.29 లక్షల చరాస్తులు, రూ. 53 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. 5 లక్షల రుణం కూడా ఉంది. ఎలాంటి వాహనం కాని, వ్యవసాయేతర భూములు కానీ లేవు. క్రిమినల్ కేసు కూడా లేదు. -
ధరల పెరుగుదలకు కేంద్రానిదే బాధ్యత
గుర్గావ్: ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హూడా ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ హామీ ఇచ్చిన విధంగా మంచి రోజులొచ్చాయో లేదో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ‘రైలు ప్రయాణం భారమయింది. చక్కెర, డీజిల్ ధరలు పెరిగాయి. వీటిని మంచి రోజులు అంటారా?’ అని ఆయన ప్రశ్నించారు. గుర్గావ్లోని కమాన్ సరాయిలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. పేదల సంక్షేమంపై బీజేపీకి ఒక్క విధానమూ లేదని, వంటగ్యాస్ ధరను ప్రతి నెలా రూ.10 చొప్పున పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎల్పీజీ ధరలు పెంచుతారని స్పష్టం చేశారు. మెట్రోరైలు మార్గాన్ని మనేసర్ వరకు పొడగిస్తున్నామని, ఇందుకోసం సవివర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన విలేకరులతో అన్నారు. 108 కిలోమీటర్ల పొడవైన గుర్గావ్-మనేసర్-బవాల్ రోడ్డు ప్రాజెక్టును జపనీస్ కంపెనీ, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, హర్యానా మాస్ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సహకారంతో రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని హూడా ఈ సందర్భంగా ప్రకటించారు. దీనికి రూ.27 వేల కోట్ల వ్యయమవుతుందని, జపాన్ సంస్థ రుణం రూపంలో కొంత మొత్తం ఇస్తుందని తెలిపారు. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు తమవైపు రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపైనా హూడా స్పందించారు. బీజేపీ నాయకులవన్నీ వ్యర్థ ప్రేలాపనలని ముఖ్యమంత్రి విమర్శించారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టీకరించారు. -
హర్యానా ముఖ్యమంత్రి హుడాకు చెంపదెబ్బ
-
హర్యానా ముఖ్యమంత్రి హుడాకు చెంపదెబ్బ
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు అనూహ్య, చేదు అనుభవం ఎదురైంది. జెడ్ కేటగిరి భద్రత.. చుట్టూ సాయుధ బలగాలు.. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఇంతమంది ఉన్నా ఓ యువకుడు హుడాపై దాడి చేసి చెంప దెబ్బ కొట్టాడు. రాష్ట్ర పారిశ్రామిక నగరం పానిపట్‌లో ఆదివారం హుడా ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. పానిపట్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో ఏర్పాటు చేశారు. ఓపెన్ టాప్ జీపులో ముందు బాగాన నిల్చున్న హుడా ర్యాలీ వేదిక వద్దకు బయల్దేరుతుండగా దాడి జరిగింది. హర్యానా పోలీసులు వెంటనే హుడా చుట్టూ రక్షణగా నిలిచి అగంతకుడిని దూరంగా లాక్కెల్లారు. కోపోద్రిక్తుడైన ముఖ్యమంత్రి అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. కాగా దాడిని చేసిన వ్యక్తి ఎవరన్నది గుర్తించాల్సివుంది. భారీ భద్రత వలయాన్ని దాటుకుని అగంతకుడు ముఖ్యమంత్రి దాడికి పాల్పడటం భద్రత చర్యల్లోని లోపాల్ని బయటపెట్టాయి.