హరియాణా:సన్‌ఫ్లర్ (పొద్దుతిరుగుడు) పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంపై హరియాణాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీఎం మంజూరు చేసిన రిలీఫ్ ఫండ్ తక్కువగా ఉందని రోడ్లపైకి వచ్చారు. కురుక్షేత్ర జిల్లాలో నిర్వహించిన మహాపంచాయత్ తీర్మాణం మేరకు ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారిపై రైతులు బైటాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు.
హరియాణాలో సన్‌ఫ్లవర్‌కు కనీస మద్దతు లభించడంలేదు. మద్దతు ధర లభించని పంటలకు రాష్ట్రంలో భవంతర్ భర్తీ యోజన(బీబీవై) కింద రిలీఫ్ ఫండ్‌ను ప్రభుత్వం ఇస్తోంది. అయితే. ఈ ఏడాదికి 36,414 ఎకరాల్లో సాగు చేసిన సన్‌ఫ్లవర్ పంటకు రూ.29.13కోట్లను విడుదల చేశారు సీఎం మనోహర్ పారికర్. అయితే.. ఈ ఫండ్‌పై సంతృప్తి చెందని రైతులు ఆందోళనలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్‌ఫ్లవర్ క్వింటాల్‌కు రూ.1000ని నష్టపరిహారంగా ఇస్తోంది. కానీ రూ.6400 కనీస మద్దతు ధర ఇచ్చి సన్‌ఫ్లవర్‌ను కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక ఆరోపణల్లో ఉద్యమించిన రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా ఈ మహాపంచాయత్‌లో పాలుపంచుకున్నారు. రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా ఈ నిరసనల్లో ఉన్నారు. దీనిపై స్పందించిన సీఎం మనోహర్ పారికర్.. రైతు సంఘాలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:'కొవిన్ యాప్‌లో వ్యక్తిగత డేటా లీక్'.. కేంద్రంపై ప్రతిపక్షాలు ఫైర్..
Comments
Please login to add a commentAdd a comment