highway blockade
-
సన్‌ఫ్లవర్ ధరపై సమస్య..జాతీయ రహదారిని నిర్బంధించిన రైతులు
హరియాణా:సన్ఫ్లర్ (పొద్దుతిరుగుడు) పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంపై హరియాణాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీఎం మంజూరు చేసిన రిలీఫ్ ఫండ్ తక్కువగా ఉందని రోడ్లపైకి వచ్చారు. కురుక్షేత్ర జిల్లాలో నిర్వహించిన మహాపంచాయత్ తీర్మాణం మేరకు ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారిపై రైతులు బైటాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. హరియాణాలో సన్‌ఫ్లవర్‌కు కనీస మద్దతు లభించడంలేదు. మద్దతు ధర లభించని పంటలకు రాష్ట్రంలో భవంతర్ భర్తీ యోజన(బీబీవై) కింద రిలీఫ్ ఫండ్‌ను ప్రభుత్వం ఇస్తోంది. అయితే. ఈ ఏడాదికి 36,414 ఎకరాల్లో సాగు చేసిన సన్‌ఫ్లవర్ పంటకు రూ.29.13కోట్లను విడుదల చేశారు సీఎం మనోహర్ పారికర్. అయితే.. ఈ ఫండ్‌పై సంతృప్తి చెందని రైతులు ఆందోళనలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్‌ఫ్లవర్ క్వింటాల్‌కు రూ.1000ని నష్టపరిహారంగా ఇస్తోంది. కానీ రూ.6400 కనీస మద్దతు ధర ఇచ్చి సన్ఫ్లవర్ను కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక ఆరోపణల్లో ఉద్యమించిన రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా ఈ మహాపంచాయత్‌లో పాలుపంచుకున్నారు. రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా ఈ నిరసనల్లో ఉన్నారు. దీనిపై స్పందించిన సీఎం మనోహర్ పారికర్.. రైతు సంఘాలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి:'కొవిన్ యాప్‌లో వ్యక్తిగత డేటా లీక్'.. కేంద్రంపై ప్రతిపక్షాలు ఫైర్.. -
అమరాయవలసలో హైవేకు అడ్డంగా కంచె
మెంటాడ (విజయనగరం జిల్లా): విశాఖపట్నం– రాయపూర్ హరిత రహదారి పనులను విజయనగరం హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అడ్డుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం తమ నుంచి సేకరించిన నాలుగు ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ మెంటాడ మండలం అమరాయవలస వద్ద మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి కంచె నిర్మించింది. పరిహారం అందించే వరకు కంచె తొలగించేది లేదని హెచరీస్ యాజమాన్య ప్రతినిధులు స్థానిక విలేకరులకు తెలిపారు. రోడ్డు పనులు పూర్తవుతున్నా జాతీయ రహ దారి అధికారులు పరిహారం చెల్లించేందుకు చొరవ చూపడంలేదని ఆరోపించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం హైవే అధికారులకు తెలియనట్టు సమాచారం. (క్లిక్: హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు) -
నీటి కోసం హైవే ముట్టడి
సాక్షి, న్యూఢిల్లీ : సిమ్లాలో తీవ్ర నీటిఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న క్రమంలో గురువారం జాతీయ రహదారిపై కచి ఘటి ప్రాంతంలో భారీ నిరసనకు దిగారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైవేను దిగ్భందించారు. నీటి సంక్షోభానికి నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. తమకు కుళాయిల నుంచి నీళ్లు రావడం లేదని, పైప్లైన్ల ద్వారా నీటి సరఫరా చాలారోజుల నుంచి నిలిచిపోయిందని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్లు సైతం నివాస ప్రాంతాలకు రాకుండా, వీఐపీ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సిమ్లాలో పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్ధితి దయనీయంగా ఉంది. తాగునీటి కోసం సిమ్లా పట్టణం సహా పరిసర ప్రాంతాల ప్రజలు వారం రోజులు పైగా వేచిచూస్తున్నారు. నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో వీఐపీ ప్రాంతాలకు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టూరిస్టులు సైతం కొద్దిరోజులు హిల్స్టేషన్కు దూరంగా ఉండాలని, నిర్మాణ కార్యకలాపాలను కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. -
ప్రత్యేక హోదా కోసం.. రేపు జాతీయ రహదారుల దిగ్బంధం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన రాష్ట్రంలోని జాతీయ రహదారులు అన్నింటినీ దిగ్బంధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. హోదా సాధన కోసం చేసే ఏ పోరాటానికైనా, ఆందోళనకైనా మద్దతిస్తామని వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి చేయనున్న ఆందోళనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గురువారం ఉదయం 10.00 గంటలకు ప్రారంభమయ్యే జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో కోరింది. ఇతర పార్టీలను, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొంది. ముఖ్య నాయకులతో బుధవారం జిల్లాస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించింది. -
రహదారులపై..రణభేరి
సాక్షి, కాకినాడ :దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులే కాదు, జిల్లా పరిధిలో నడిచే బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులే కాదు.. భారీ వాహనాలు.. ఆటోలు.. కార్లతో పాటు చివరకు ద్విచక్ర వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కొన్నిచోట్ల పాదచారులు కూడా అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అయినా ఎక్కడా ఏ ఒక్కరూ చిన్నపాటి అసహనానికి గురి కాలేదు. సామాన్య ప్రజలు సైతం తమ ఇబ్బందులను సుతరాము ఖాతరు చేయక సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రహదారుల దిగ్బంధానికి మనస్ఫూర్తిగా మద్దతునిచ్చారు.సమైక్యాంధ్ర పరిరణే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా చేపట్టిన జాతీయ రహదారుల రెండు రోజు ల దిగ్బంధం కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పం దన లభించింది. కనీవినీ ఎరుగని రీతిలో 48 గంటల పాటు జరిగి న ఆందోళన కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా కదం తొక్కిన పార్టీ శ్రేణులు రహదారులను దిగ్బంధం చేశారు. అక్కడూ వంటావార్పులు..సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులు-16, 216తో పాటు అన్ని రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ఉద్యోగులు కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. ప్రయాణికులు గమ్యానికి చేరుకోవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులు కొన్ని చోట్ల మండుటెండలోనే రోడ్లపై పడుకొని నిరసన తెలపగా, మరికొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా ఇటుకలతో గోడలు కట్టి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై ఆటాపాటా.. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో లాలా చెరువు వద్ద ఎన్‌హెచ్-16ని గంటన్నర పాటు దిగ్బంధించారు. రోడ్డుపైనే వాలీబాల్, ఖోఖో ఆడి నిరసన తెలిపారు. మూడు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. ఆదిరెడ్డి, బొమ్మన సహా 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు.సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ సుంకర చిన్ని, సమైక్య ఉద్యమం అర్బన్ పర్యవేక్షకులు ఆర్.వి.వి. సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సమైక్య ఉద్యమం మొదలై వందరోజులైన సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, నగరఅధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ సహా వందమంది మహిళా కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షల ముగింపు సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాజానగరం మండలం సూర్యారావుపేట వద్ద ఎన్‌హెచ్-16ని, రాజమండ్రి- భద్రాచలం రోడ్డుపై బూరుగు పూడి జంక్షన్‌ను దిగ్బంధించారు. ఆమెతో పాటు పలువుర్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి, అనంతరం విడిచిపెట్టారు. యువనాయకుడు జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మండుటెండలో రోడ్డుపై పడుకుని.. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వందలాదిమంది కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం వద్ద ఎన్‌హెచ్-216ని దిగ్బంధించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే సుమారు గంటపాటు పడుకొని నిరసన తెలిపారు. రోడ్డుకిరువైపులా ఆయిల్ ట్యాంకర్లు పెట్టి రాస్తారోకో చేయడంతో పాదచారులను కూడా వెళ్లనివ్వలేదు. వేణు సహా 250 మందిని పోలీస్‌లు అరెస్టు చేశారు. చేనేత విభాగం జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ, పార్టీ కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, కర్రి సత్యనారాయణ పాల్గొన్నారు. అమలాపురంలో ఎర్రవంతెన వద్ద ఎన్‌హెచ్-216ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంటు నియో జకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావుఅ ఆధ్వర్యంలో దిగ్బంధించారు. నేతలతో పాటు 55 మందిని అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడిచి పెట్టారు. పార్టీ కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టా మురళీకృష్ణ పాల్గొన్నారు. దిండి- చించినాడ వంతెనపై మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరుల ఆధ్వర్యంలో ఎన్‌హెచ్-216ని దిగ్బంధించడంతో ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో గొల్లప్రోలు వద్ద ఎన్‌హెచ్-216ని దిగ్బంధించారు. దొరబాబుతో సహా 35 మందిని అదుపులోకి తీసుకొని అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఇటుకలతో గోడ కట్టి.. మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ కో-ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో రౌతులపూడిలో కోటనందూరు రహదారిని దిగ్బంధం చేశారు. రోడ్డుపైనే వంటావార్పు చేశారు. రోడ్డుకు అడ్డంగా గోడగా ఇటుకలను పేర్చి నిరసన తెలిపారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నీలాద్రిరావు పేట, మల్లేపల్లి, గండేపల్లి, గోకవరంలలో ఎన్‌హెచ్-16ని దిగ్బంధించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కడియపులంక పూల మార్కెట్ వద్ద సుమారు 300 మందికి పైగా పార్టీ కార్యకర్తలు ఎన్‌హెచ్-16ని దిగ్బంధించారు. ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్ ఎదుట 216 జాతీయ రహదారిని సుమారు గంటన్నర సేవు దిగ్బంధించారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, డీసీసీబీ మాజీ డెరైక్టర్ పెయ్యిల చిట్టిబాబు పాల్గొన్నారు. నేతలతో పాటు వందమందిని అరెస్ట్ చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడిచి పెట్టారు. ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీను ఆధ్వర్యంలో జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం నగరంలో తాటిపాక మినీ రిఫైనరీ ఎదురుగా 216 జాతీయ రహదారిని వందలాదిమంది దిగ్బంధించారు. అక్విడెక్టుపై బైఠాయింపు పి.గన్నవరంలో డొక్కా సీతమ్మ అక్విడెక్టుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమాల్లో పి.గన్నవరం కో ఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్, కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గొంచాల జంక్షన్ వద్ద కాకినాడ- సామర్లకోట రహదారిని దిగ్బంధించారు. నేతలతో పాటు 300 మందిని అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. యువనాయకుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో సీతానగరం వద్ద రాజమండ్రి-సీతానగరం రహదారిపై రాస్తారోకో చేశారు. అనపర్తి నియోజకవర్గ నాయకులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బిక్కవోలు కెనాల్ రోడ్ వంతెనపై రాస్తారోకో చేశారు. వేమగిరి నుంచి కాకినాడ వైపు వెళ్లే ఈ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్, నియోజక వర్గ పరిశీలకులు కర్రి పాపారాయుడుల ఆధ్వర్యంలో ఐ.పోలవరం జంక్షన్ వద్ద రాజమండ్రి, భద్రాచలం-రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ తదితరులు పాల్గొ న్నారు. -
దిగ్బంధం సక్సెస్
గుంటూరు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రహదారుల దిగ్బంధం రెండవ రోజు గురువారం కూడా విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని జాతీయ రహదారితోపాటు ప్రధాన రహదారులను దిగ్బంధం చేసి వంటావార్పు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు. అధిక సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొని సమైక్యానికి మద్దతు పలికారు.అంతటా సమైక్య నినాదాలు మిన్నంటాయి.చిలకలూరిపేటలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర కోరుతూ నినాదాలు చేశారు.మంగళగిరి నియోజకవర్గంలో గుంటూరు,కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేపట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు వద్ద సత్తెనపల్లి-నరసరావుపేట ప్రధాన రహదారిని పార్టీ అధికార ప్రతినిధి, అంబటి రాంబాబు ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. విభజన నిర్ణయం వాయిదా వేసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల, తాళ్లపల్లి రహదారులను దిగ్బంధం చేశారు. నరసరావుపేటలో పార్టీ సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం, రొంపిచర్ల మర్రిచెట్టు పాలెం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. పొన్నూరు సమన్వయకర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో గుంటూరు-చీరాల రోడ్డులోని మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్లు దిగ్బంధం చేశారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వినుకొండలో సమన్వయకర్త డాక్టర్ సుధ ఆధ్వర్యంలో ఈపూరు మండల పరిధిలోని కొండ్రముట్ల వద్ద రహదారులను దిగ్బంధం చేశారు. దీంతో వినుకొండ- హైదరాబాద్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు ముగ్గురు ఒకేచోట రహదారుల దిగ్బంధం చేశారు. మందపాటి శేషగిరిరావు, ఈపూరు అనూఫ్, కొల్లిపర రాజేంద్రప్రసాద్‌ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. వేమూరు నియోజకవర్గంలో మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో అమృతలూరులోని తెనాలి-చెరుకుపల్లి రహదారిలో, చుండూరు మండల కేంద్రంలో తెనాలిలో రహదారులు దిగ్బంధం చేసి రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో దిగమర్రు వద్ద ప్రధాన జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. గడియార స్తంభం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. పట్టణ, మండల కన్వీనర్లు దగ్గుమల్లి ధర్మారావు, గవిని కష్ణమూర్తి, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, అహ్మద్ హుసేన్ పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల వద్ద అద్దంకి- హైదరాబాద్ రహదారిని దిగ్బంధం చేసి ఆందోళన చేపట్టారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు- సత్తెనపల్లి రహదారిని సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నూతలపాటి హనుమయ్య ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. తెనాలి నియోజకవర్గంలో గుదిబండి చినవెంకటరెడ్డి, గల్లా చందు ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో రహదారిని దిగ్బంధం చేసి వంటావార్పు నిర్వహించారు. రేపల్లె నియోజకవర్గంలో చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం వద్ద జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. మోపిదేవి హరనాధ్‌బాబు, దివాకర్త్న్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిలానీ, విజయసారధి ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధం చేశారు. గుంటూరులో... గుంటూరులోని అంకిరెడ్డిపాలెం వై జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు వంటావార్పు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షౌకత్, నసీర్ అహ్మద్, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఏటూకూరు రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేశారు. భారీగా నిలిచిన వాహనాలు రహదారుల దిగ్బంధం కారణంగా జిల్లాలో అనేక చోట్ల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. 20 నుంచి 25 కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్ లు, లారీలు నిలిచిపోయాయి. చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్‌లు నిలిచిపోయాయి. గుంటూరు నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రహదారుల దిగ్బంధంలో అంకిరెడ్డిపాలెం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నాగుల చవితి సందర్భంగా రహదారిపైనే శివలింగాన్ని ఏర్పాటు చేసి మహిళలు పూజలు నిర్వహించారు. మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలో రోడ్లపై మూడు గంటలపాటు లారీలు, బస్‌లు నిలిచిపోయాయి. -
నేడు, రేపు రోడ్ల దిగ్బంధం
-
నేడు, రేపు జాతీయ రహదారుల దిగ్బంధం
కాకినాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో ఈ ఆందోళనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. -
నేడు, రేపు రోడ్ల దిగ్బంధం
సమైక్యంపై కేంద్రానికి, జీవోఎంకు కనువిప్పు కోసమే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి వెల్లడి ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపు నేడు, రేపు ప్రయాణాలు మానుకోవాలని వినతి కాంగ్రెస్, టీడీపీలు డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ధ్వజం పదవి కోసం ప్రజల భవితను కిరణ్ తాకట్టు పెడుతున్నారని విమర్శ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రజాకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు బుధ, గురువారాల్లో రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందనిపార్టీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. విభజన విధివిధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం గురువారం సమావేశం కానున్నందున వారికి కనువిప్పు కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం విలేకరుల భేటీలో వెల్లడించారు. ‘రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో అంతా భాగస్వాములు కావాలి. ప్రయాణాలను వాయిదా వేసుకుని సహకరించాలి’ అని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్సీపీ చేస్తున్న కృషిని వివరించారు. ‘‘ఇప్పటిదాకా 9,360 గ్రామ పంచాయతీల్లో సమైక్య తీర్మానాలు చేసి ప్రధానికి, జీవోఎంకు ఇ-మెయిళ్ల ద్వారా పంపించాం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సీనియర్ నేతలంతా వెళ్లి కలిసి రాష్ట్ర సమైక్యత ఆవశ్యకతను వివరించారు. హేతుబద్ధత లేకుండా, సంప్రదాయాలకు భిన్నంగా, ఏకపక్షంగా, ప్రజా వ్యతిరేకంగా కేంద్రం తలపెట్టిన విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని విన్నవించాం’’ అని గుర్తు చేశారు. రాష్ట్రపతిని కలవలేదేం బాబూ? ప్రజలను మోసగిస్తూ కాంగ్రెస్, టీడీపీలు డ్రామాను బాగా రక్తి కట్టిస్తున్నాయని శోభ దుయ్యబట్టారు. యాత్రలు, దీక్షల పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎవరికీ అనుమానం రాకుండా సోనియా నిర్ణయాన్ని చాలా చక్కగా సీఎం కిరణ్ నెరవేరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెట్టిన బాబు, ఆయన హైదరాబాద్ వచ్చినా ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. దీంతో బాబు నైజం మరోసారి నిరూపితమైందన్నారు. ‘‘బాధ్యతగల ప్రధాన ప్రతిపక్షనేతగా ఉండి ప్రజల మనోభావాలను రాష్ట్రపతి దృష్టికి బాబు తీసుకెళ్లలేదేం? ఆయన ఢిల్లీలో నిరాహారదీక్ష దేని కోసం చేశారు? ఏ డ్రామా ఆడటానికి చేశారు? ఒకపక్క సీమాంధ్ర టీడీపీ నేతలు విభజనను ఆపాలంటారు. మరోపక్క తెలంగాణ టీడీపీ నేతలు సీమాంధ్ర నేతలపై బాబుకు ఫిర్యాదు చేశామని మీడియాకు చెబుతారు. అసలు టీడీపీ నేతలు ఏమనుకుంటున్నారు? ప్రజలను అమాయకులుగా భావిస్తున్నారా? వీరి డ్రామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. రెండుసార్లు ఓడిపోయినా కూడా సిగ్గురాలేదా’ అని శోభ నిప్పులు చెరిగారు. సోనియా డెరైక్షన్‌లో కిరణ్ డ్రామాలు సమైక్య ముసుగులో సోనియా ఆదేశాల మేరకు విభజన సంబంధిత సమాచారమంతటినీ కేంద్రానికి కిరణ్ అందజేస్తున్నారన్నారు. ‘‘ఆయన నిజంగా సమైక్యవాదే అయితే ఆ సమాచారాన్ని ఎందుకిస్తున్నట్టు? ఎలాంటి సహకారమూ, సమాచారమూ ఇవ్వబోనని కేంద్రానికి ఎందుకు గట్టిగా చెప్పడం లేదు?’’ అని ప్రశ్నించారు. మూడు నెలల పదవి కోసం ప్రజల భవితను కిరణ్ తాకట్టు పెడుతున్నారన్నారు. ‘‘మేం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న మేరకు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం పెట్టడం లేదు? వారానికో ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఏమైనా చేశారా? అసెంబ్లీ తీర్మానం యావద్దేశం దృష్టినీ ఆకర్షించవచ్చని మేమెంతగా కావాలనే కిరణ్ పెడచెవిన పెట్టారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ఆ ప్రక్రియ ప్రారంభం కాకముందే కేంద్రానికి గట్టి సందేశం ఇవ్వలేని నిస్సహాయ స్థితికి సీమాంధ్రను నెట్టేశారు’’ అంటూ తూర్పరాబట్టారు.విభజనను ఆపడానికి సీఎంగా ఏ చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. -
విభజనను అడ్డుకుందాం
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ పోరుబాట సాగిస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పా రు. సోమవారం ఇక్కడ నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయూనికి నిరసనగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 6, 7 తేదీల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే రహదారుల దిగ్భంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని పార్టీ శ్రేణులకు, సమైక్యవాదులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు ఎగసిపడుతున్నప్పటికీ ప్రజల మ నోభావాలను అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేయడం దుర్మార్గమన్నారు. ఇందుకు నిరసనగా 48 గంటలపాటు రహదారుల దిగ్బం ధం చేయడానికి వైసీపీ పూనుకుం దన్నారు. అన్నివర్గాల ప్రజలు, సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు, ఇతర జేఏసీ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. -
రేపు ఎల్లుండి రహదారుల దిగ్బంధం
సాక్షి, గుంటూరు : ప్రభుత్వం 2011 అక్టోబరు 2 నుంచి జిల్లాలో ఇందిర జలప్రభ అమలును ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన బంజరు భూములను ఎంపిక చేసి బోర్లు వేసి సస్యశ్యామలం చేయడమే పథకం లక్ష్యం. దీనికోసం జిల్లా అధికారులు 16 మండలాలను ఎంపిక చేశారు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, గురజాల, కారంపూడి, దాచేపల్లి, నూజెండ్ల, ఈపూరు, వినుకొండ, బొల్లాపల్లి, మాచవరం, బెల్లంకొండ, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలంతా రాష్ట్ర విభజనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలిపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అన్ని మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. కాంగ్రెస్,టీడీపీల కుట్రలను ఛేదించే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు పాటుపడుతున్న జననేతకు ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర విభజనను అడ్డుకుని, ప్రజా ప్రయోజనాలను జననేత కాపాడతారన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిని, నియోజకవర్గంలో విస్తరించిన రాష్ట్రీయ రహదారులను 48 గంటల పాటు దిగ్బంధం చేస్తామని తెలిపారు. ప్రజలు, ప్రయాణికులు సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.