సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జిల్లావ్యాప్తంగా జాతీయ
కాకినాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో ఈ ఆందోళనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు.