రహదారులపై..రణభేరి | ysrcp Highway blockade good response in Kakinada | Sakshi
Sakshi News home page

రహదారులపై..రణభేరి

Published Fri, Nov 8 2013 2:33 AM | Last Updated on Fri, May 25 2018 9:39 PM

ysrcp Highway blockade good response in Kakinada

సాక్షి, కాకినాడ :దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులే కాదు, జిల్లా పరిధిలో నడిచే బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులే కాదు.. భారీ వాహనాలు.. ఆటోలు.. కార్లతో పాటు చివరకు ద్విచక్ర వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కొన్నిచోట్ల పాదచారులు కూడా అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అయినా ఎక్కడా ఏ ఒక్కరూ చిన్నపాటి అసహనానికి గురి కాలేదు. సామాన్య ప్రజలు సైతం తమ ఇబ్బందులను సుతరాము ఖాతరు చేయక సమైక్యాంధ్ర పరిరక్షణకు   వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రహదారుల దిగ్బంధానికి మనస్ఫూర్తిగా మద్దతునిచ్చారు.సమైక్యాంధ్ర పరిరణే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా చేపట్టిన జాతీయ రహదారుల రెండు రోజు ల దిగ్బంధం కార్యక్రమానికి  జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పం దన లభించింది.
 
 కనీవినీ ఎరుగని రీతిలో 48 గంటల పాటు జరిగి న ఆందోళన కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. మండుటెండను  సైతం లెక్కచేయకుండా కదం తొక్కిన పార్టీ శ్రేణులు రహదారులను దిగ్బంధం చేశారు. అక్కడూ వంటావార్పులు..సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులు-16, 216తో పాటు అన్ని రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ఉద్యోగులు కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. ప్రయాణికులు గమ్యానికి చేరుకోవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులు కొన్ని చోట్ల మండుటెండలోనే రోడ్లపై పడుకొని నిరసన తెలపగా, మరికొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా ఇటుకలతో గోడలు  కట్టి నిరసన తెలిపారు.
 
 జాతీయ రహదారిపై ఆటాపాటా..
 ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో లాలా చెరువు వద్ద ఎన్‌హెచ్-16ని గంటన్నర పాటు దిగ్బంధించారు. రోడ్డుపైనే వాలీబాల్, ఖోఖో ఆడి నిరసన తెలిపారు. మూడు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. ఆదిరెడ్డి, బొమ్మన సహా 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు.సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ సుంకర చిన్ని, సమైక్య ఉద్యమం అర్బన్ పర్యవేక్షకులు ఆర్.వి.వి. సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సమైక్య ఉద్యమం మొదలై వందరోజులైన సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, నగరఅధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ సహా వందమంది మహిళా కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షల ముగింపు సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాజానగరం మండలం సూర్యారావుపేట వద్ద ఎన్‌హెచ్-16ని, రాజమండ్రి- భద్రాచలం రోడ్డుపై బూరుగు పూడి జంక్షన్‌ను దిగ్బంధించారు. ఆమెతో పాటు పలువుర్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి, అనంతరం విడిచిపెట్టారు. యువనాయకుడు జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 మండుటెండలో రోడ్డుపై పడుకుని..
 జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వందలాదిమంది కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం వద్ద ఎన్‌హెచ్-216ని దిగ్బంధించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే సుమారు గంటపాటు పడుకొని నిరసన తెలిపారు. రోడ్డుకిరువైపులా ఆయిల్ ట్యాంకర్లు పెట్టి రాస్తారోకో చేయడంతో పాదచారులను కూడా వెళ్లనివ్వలేదు. వేణు సహా 250 మందిని పోలీస్‌లు అరెస్టు చేశారు. చేనేత విభాగం జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ, పార్టీ కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, కర్రి సత్యనారాయణ పాల్గొన్నారు. 
 
 అమలాపురంలో ఎర్రవంతెన వద్ద ఎన్‌హెచ్-216ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంటు నియో జకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావుఅ ఆధ్వర్యంలో  దిగ్బంధించారు. నేతలతో పాటు 55 మందిని అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడిచి పెట్టారు. పార్టీ కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టా మురళీకృష్ణ పాల్గొన్నారు. దిండి- చించినాడ వంతెనపై మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరుల ఆధ్వర్యంలో ఎన్‌హెచ్-216ని దిగ్బంధించడంతో ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో గొల్లప్రోలు వద్ద ఎన్‌హెచ్-216ని దిగ్బంధించారు. దొరబాబుతో సహా 35 మందిని అదుపులోకి తీసుకొని అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
 
 ఇటుకలతో గోడ కట్టి..
 మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ కో-ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో రౌతులపూడిలో కోటనందూరు రహదారిని దిగ్బంధం చేశారు. రోడ్డుపైనే వంటావార్పు చేశారు. రోడ్డుకు అడ్డంగా గోడగా ఇటుకలను పేర్చి నిరసన తెలిపారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నీలాద్రిరావు పేట, మల్లేపల్లి, గండేపల్లి, గోకవరంలలో ఎన్‌హెచ్-16ని దిగ్బంధించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కడియపులంక పూల మార్కెట్ వద్ద సుమారు 300 మందికి పైగా పార్టీ కార్యకర్తలు ఎన్‌హెచ్-16ని దిగ్బంధించారు. ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్ ఎదుట 216 జాతీయ రహదారిని సుమారు గంటన్నర సేవు దిగ్బంధించారు.
 
 రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, డీసీసీబీ మాజీ డెరైక్టర్ పెయ్యిల చిట్టిబాబు పాల్గొన్నారు. నేతలతో పాటు వందమందిని అరెస్ట్ చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడిచి పెట్టారు. ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీను ఆధ్వర్యంలో జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం నగరంలో తాటిపాక మినీ రిఫైనరీ ఎదురుగా 216 జాతీయ రహదారిని వందలాదిమంది దిగ్బంధించారు.
 
 అక్విడెక్టుపై బైఠాయింపు
 
 పి.గన్నవరంలో డొక్కా సీతమ్మ అక్విడెక్టుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమాల్లో పి.గన్నవరం కో ఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్, కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గొంచాల జంక్షన్ వద్ద కాకినాడ- సామర్లకోట రహదారిని దిగ్బంధించారు.
 
 నేతలతో పాటు 300 మందిని అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. యువనాయకుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో సీతానగరం వద్ద రాజమండ్రి-సీతానగరం రహదారిపై రాస్తారోకో చేశారు. అనపర్తి నియోజకవర్గ నాయకులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బిక్కవోలు కెనాల్ రోడ్ వంతెనపై రాస్తారోకో చేశారు. వేమగిరి నుంచి కాకినాడ వైపు వెళ్లే ఈ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్, నియోజక వర్గ పరిశీలకులు కర్రి పాపారాయుడుల ఆధ్వర్యంలో ఐ.పోలవరం జంక్షన్ వద్ద రాజమండ్రి, భద్రాచలం-రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ తదితరులు పాల్గొ న్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement