ఖట్టర్ వార్షికాదాయం రూ. 2.73 లక్షలే! | BJP's Haryana CM-Designate Was 'Agriculturist' by Profession | Sakshi
Sakshi News home page

ఖట్టర్ వార్షికాదాయం రూ. 2.73 లక్షలే!

Published Thu, Oct 23 2014 2:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:11 PM

ఖట్టర్ వార్షికాదాయం  రూ. 2.73 లక్షలే! - Sakshi

ఖట్టర్ వార్షికాదాయం రూ. 2.73 లక్షలే!

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా ఎన్నికైన బీజేపీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్(60) తన వృత్తి వ్యవసాయమని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు ట్యూషన్ కూడా చెప్పానని తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ఆదాయం 2.73 లక్షలు. రోహతక్ జిల్లాలోని బిన్యాయి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీని విలువ రూ. 50 లక్షలు.

బిన్యాయిలో రూ. 3లక్షల ఖరీదు చేసే ఇల్లు కూడా ఉంది. బ్యాంకులో రూ. 2.29 లక్షలు సహా రూ. 8.29 లక్షల చరాస్తులు, రూ. 53 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. 5 లక్షల రుణం కూడా ఉంది. ఎలాంటి వాహనం కాని, వ్యవసాయేతర భూములు కానీ లేవు. క్రిమినల్ కేసు కూడా లేదు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement