కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరరావు (ఫైల్ ఫోటో)
సాక్షి, బెంగళూరు: నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ (ఈసీ) కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందని బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరరావు ఆరోపించారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఆదేశాలతో ఈసీ అధికారులు బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తల ఇళ్లలో అనధికారంగా తనిఖీలు చేయడమే కాక, వారి ఇళ్లపై ఉన్న బీజేపీ జెండాలను, ఇళ్లపై రాసుకున్న ఓం గుర్తులను తొలగించాలని, లేదంటే కేసులు పెడతామని బెదిరింస్తున్నారని ఆరోపించారు.
ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయడం ద్వారా రాష్ట్రంలో ఈసీ, కాంగ్రెస్ పార్టీ తీరును కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ తదితరులు ప్రచారాల్లో పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment