మాజీ సీఎం పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: హర్యానా టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. చౌతాలా, మరో తొమ్మిది మంది దాఖలు చేసిన పిటిషన్ను.. సోమవారం జస్టిస్ కలిఫుల్లా సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది.
1999 టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు వీరిని దోషులుగా ప్రకటిస్తూ పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను రద్దు చేయాలంటూ చౌతాలా సుప్రీం కోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.