కొత్తగా 10,000 కోఆపరేటివ్‌ సొసైటీలు | Union Home Minister Shah inaugurates 10,000 newly established M-PACS | Sakshi
Sakshi News home page

కొత్తగా 10,000 కోఆపరేటివ్‌ సొసైటీలు

Published Thu, Dec 26 2024 5:18 AM | Last Updated on Thu, Dec 26 2024 5:18 AM

Union Home Minister Shah inaugurates 10,000 newly established M-PACS

ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్‌షా 

ఐదేళ్లలో 2 లక్షల సొసైటీల ఏర్పాటు లక్ష్యం 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 10,000 బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (కోఆపరేటివ్‌ సొసైటీలు/ఎం–పీఏసీఎస్‌) ఏర్పాటయ్యాయి. కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా వీటిని ప్రారంభించారు. 

వచ్చే ఐదేళ్ల కాలంలో 2 లక్షల ఎం–పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని పంచాయతీ స్థాయిలో కోఆపరేటివ్‌ సొసైటీలు సమర్థవంతంగా పనిచేస్తే తప్పించి వీటి ద్వారా ఆశించిన సంపద సృష్టి సాధ్యపడదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.  సహకార రంగంలో డిజిటలైజేషన్‌ ప్రాధానాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే అన్ని పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించి, వాటిని అనుసంధానించినట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సొసైటీలకు రిజి్రస్టేషన్‌ సరి్టఫికెట్‌లు, మైక్రో ఏటీఎంలు, రూపే కిసాన్‌ కార్డులను ఈ సందర్భంగా అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement