Cooperative sector
-
కొత్తగా 10,000 కోఆపరేటివ్ సొసైటీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 10,000 బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు/ఎం–పీఏసీఎస్) ఏర్పాటయ్యాయి. కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా వీటిని ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో 2 లక్షల ఎం–పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని పంచాయతీ స్థాయిలో కోఆపరేటివ్ సొసైటీలు సమర్థవంతంగా పనిచేస్తే తప్పించి వీటి ద్వారా ఆశించిన సంపద సృష్టి సాధ్యపడదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సహకార రంగంలో డిజిటలైజేషన్ ప్రాధానాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే అన్ని పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించి, వాటిని అనుసంధానించినట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన సొసైటీలకు రిజి్రస్టేషన్ సరి్టఫికెట్లు, మైక్రో ఏటీఎంలు, రూపే కిసాన్ కార్డులను ఈ సందర్భంగా అందించారు. -
సహకార రంగంలో 11 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: దేశ సహకార రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. 2030 నాటికి నేరుగా 5.5 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది. అదే విధంగా మరో 5.6 కోట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. ఈ వివరాలను మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘ప్రైమస్ పార్ట్నర్స్’ వెల్లడించింది. ‘భారత సహకార విప్లవం’ పేరుతో సహకార రంగంపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.భారత కోపరేటివ్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దదంటూ.. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సహకార సొసైటీల్లో 30 శాతం మనదగ్గరే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘భారత్ 2030 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అలా చూస్తే సహకార రంగం ఆశావాదానికి, సామర్థ్యానికి ఆధారంగా కనిపిస్తోంది’’అని ఈ నివేదిక పేర్కొంది. సహకార రంగానికి ఉన్న అపార సామర్థ్యాలను ఆర్థిక వృద్ధికి, సామాజిక సమానత్వానికి, సమ్మిళితాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కేవలం ఒక విభాగం కాదంటూ, సమాజ పురోగతికి, శ్రేయస్సుకు శక్తిమంతమైన చోదకంగా నిలుస్తుందని పేర్కొంది.ఉపాధికి చిరునామా: ‘‘ఉపాధి కల్పనలో సహకార రంగం వాటా 2016–17 నాటికి 13.3 శాతానికి చేరింది. 2007–08 నాటికి ఈ రంగంలో 12 లక్షలుగా ఉన్న ఉపాధి అవకాశాలు, 2016–17 నాటికి 58 లక్షలకు చేరాయి. 18.9 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. 2030 నాటికి కోపరేటివ్‌లు 5.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనున్నాయి. 5.6 కోట్ల మందికి స్వయం ఉపాధి లభించనుంది’’అని ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈ రంగం కల్పించే స్వయం ఉపాధి అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించింది.‘‘2006–07 నాటికి సహకార రంగం 1.54 కోట్ల మందికి స్వయం ఉపాధి కల్పించగా, 2018 నాటికి ఇది 3 కోట్లకు విస్తరించింది. స్వయం ఉపాధికి కోపరేటివ్‌లు మూలస్తంభాలు. ఏటా 5–6 శాతం చొప్పున పెరిగినా 2030 నాటికి 5.6 కోట్ల మేర స్వయం ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఏర్పడనున్నాయి’’అని వివరించింది. 2030 నాటికి జీడీపీకి 3–5 శాతం వాటాను సమకూరుస్తుందని అంచనా వేసింది.ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కూడా కలిపి చూస్తే జీడీపీలో 10 శాతంగా ఉంటుందని తెలిపింది. సహకార రంగాన్ని ఆధునికీకరించడంతోపాటు విధానాల క్రమబద్ధీకరణ, సహకార ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు దిశగా 2021లోనే కేంద్ర సహకార శాఖ పలు చర్యలు ప్రకటించడం గమనార్హం. 29 కోట్ల సభ్యులతో 8.5 లక్షల కోపరేటివ్‌లు స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్యయుతంగా నడిచేందుకు వీలుగా వాటికి నిధుల సా యంఅందించి, సొం తంగా నిల దొక్కుకునేలా చూడాలని నివేదిక సూచించింది. -
రూ.1.25 లక్షల కోట్లతో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం
న్యూఢిల్లీ: దేశంలో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అమలుకు రూ.1.25 లక్షల కోట్లకుపైగా నిధులు వెచి్చంచనున్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నారు. ఇందులో భాగంగా 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీ) పరిధిలో నిర్మించిన 11 గోడౌన్లను మోదీ ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో వేలాది గోదాములు నిర్మించబోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 500 పీఏసీల పరిధిలో గోదాముల నిర్మాణానికి, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. 18,000 పీఏసీలను కంప్యూటీకరించే ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో ఆహార ధాన్యాల నిల్వకు సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమస్యను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని తప్పుపట్టారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.1.25 లక్షల కోట్లలో వ్యయంతో రాబోయే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టించే పథకానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చని, వాటిపై రుణం పొందవచ్చని, మార్కెట్లో సరైన ధర లభించినప్పుడు పంటలు విక్రయించుకోవచ్చని తెలియజేశారు. కేబినెట్ భేటీకి యాక్షన్ ప్లాన్‌తో రండి కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన లోక్‌సభ ఎన్నికలు మరో 100 రోజులలోపే జరుగనున్న నేపథ్యంలో మార్చి 3వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ భేటీని ఆయన కీలకంగా భావిస్తున్నారు. స్పష్టమైన, ఆచరణ యోగ్యమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని మంత్రులకు ఆయన సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేబినెట్ భేటీలో మంత్రులంతా వారి యాక్షన్ ప్లాన్ సమరి్పంచాలని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలియజేశాయి. -
Union Minister Amit Shah: ఎకానమీలో సహకార రంగ భాగస్వామ్యం పెరగాలి
న్యూఢిల్లీ: భారత్‌లో గత 75 సంవత్సరాల్లో సహకార ఉద్యమం ఆశించిన స్థాయిలో పురోగమించలేదని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్లుగా భారత్ ఎకానమీ ఆవిర్భవిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, ఈ లక్ష్య సాధనలో సహకార రంగం భారీ వాటాను కలిగి ఉండేలా చూడడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. దక్షిణ ఢిల్లీలోని నౌరోజీ నగర్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్బీసీసీ అభివృద్ధి చేసిన సెంట్రల్ రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర సహకార మంత్రి షా ప్రసంగించారు. 175 కోట్లతో ఈ కొత్త కార్యాలయాన్ని కొనుగోలు చేసినట్లు షా తెలిపారు. సహకార ఉద్యమం అభివృద్ధి కోసం ప్రభుత్వం గత 30 నెలల్లో 60 పెద్ద కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ జూలై 2021లో ఏర్పాటయినట్లు వివరించారు. 21వ శతాబ్దంలోకి పురోగమనం స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి సహకార సంఘాల విజయగాథలు ఉన్నాయని, అయితే ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందలేదని షా అన్నారు. ‘‘ప్రధాని మోదీజీ లక్షిత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో, సహకార సంస్థలకు పెద్ద వాటా ఉండాలని ఇప్పుడు మేము నిర్ణయించుకున్నాము. సహకార రంగం 19వ శతాబ్దం నుండి నేరుగా 21వ శతాబ్దంలోకి పురోగమిస్తుంది’’ అని షా ఈ సందర్భంగా అన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మల్టీ–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టాన్ని సవరించిందని అన్నారు. అలాగే పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలు), పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించే పథకాన్ని బలోపేతం చేయడానికి నమూనా బై–లాస్‌ను తీసుకువచి్చందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల సంఘాల ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో 2 లక్షల బహుళ వినియోగ పీఏసీఎస్/ డెయిరీ/ మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని షా తెలిపారు. ఇప్పటికే కొత్తగా 12,000 పీఏసీఎస్‌లు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. సహకార రంగంలో మరిన్ని బ్యాంకులను తెరవాల్సిన అవసరాన్ని షా ఉద్ఘాటించారు. తమను తాము బ్యాంకులుగా మార్చుకోవాలని బహుళ–రాష్ట్ర క్రెడిట్ సొసైటీలను సూచించారు. మలీ్ట–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ 2023లో 102కి చేరిందని ఆయన పేర్కొంటూ 2020లో 10 నుంచి 10 రెట్లు పెరిగిందని వివరించారు. నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీలకు డిమాండ్ ఐఎఫ్ఎఫ్సీఓ వినూత్న ఉత్పత్తులైన నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీ (డి–అమ్మోనియం ఫాస్ఫేట్)లను షా ఈ సందర్భంగా ఉటంకించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. నానో యూరియా, నానో డీఏపీ పిచి కారీ చేసేందుకు పీఏసీఎస్‌లు రైతులకు డ్రోన్ లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. కాగా, ఇటీవల షా ఆవిష్కరించిన నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఉన్న త స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ)చీఫ్ ప్రమోటర్‌గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద 2022 జనవరి 25న ఎన్‌సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్‌సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. -
ఏపీ బాటలో కేంద్రం..
సాక్షి, అమరావతి: ఏపీలో మాదిరిగానే గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కూడా నడుంబిగించింది. ఆర్బీకేలకు అనుబంధంగా గోదాములతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగానే కేంద్రం కూడా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)కు అనుబంధంగా వసతుల కల్పనకు కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు (వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు)కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద తొలిదశలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు కింద పీఏసీఎస్ స్థాయిలో గోదాముతో పాటు అత్యాధునిక రైస్‌మిల్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోని మృత్యుంజయ సహకార సమితి పీఏసీఎస్‌ను ఎంపిక చేశారు. సొసైటీ ఆదాయ, వ్యయాల ఆధారంగా ఈ పీఏసీఎస్‌కు అన్ని విధాలుగా వయబులిటీ ఉందని గుర్తించి దీనిని ఎంపిక చేశారు. డీపీఆర్ తయారీ.. ఇక జాతీయస్థాయిలో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నాబ్‌స్కాన్ ఈ ప్రాజెక్టు కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారుచేసింది. ఈ బృందం ఇటీవలే ఆచంట పీఏసీఎస్‌ను సందర్శించి సంతృప్తి కూడా వ్యక్తంచేసింది. ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన రెండెకరాల భూమిలో సాయిల్ టెస్టింగ్ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు కింద.. ► రూ.2.14 కోట్ల అంచనాతో ఆహార ధాన్యాల నిల్వకోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నారు. ► రూ.86.20 లక్షల అంచనా వ్యయంతో.. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గోదాము నిర్మిస్తారు. ► రూ.1,12,86,000 అంచనా వ్యయంతో గంటకు రెండు టన్నుల సామర్థ్యంతో కూడిన అత్యాధునిక కలర్ సార్టెక్స్ రైస్‌మిల్‌ను నిర్మిస్తారు. ► ఏన్సలరీ, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.14.06 లక్షల అంచనాతో విద్యుత్, అగ్నిమాపక సౌకర్యాలు కల్పిస్తారు. ► అంతేకాక.. పీఏసీఎస్‌కు ప్రత్యేకంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రూ.1.18 లక్షల అంచనాతో డ్రోన్‌ను కూడా సమకూరుస్తారు. ► ఈ ప్రాజెక్టు కింద చేపట్టే వ్యయంలో 20% (రూ.42.86 లక్షలు) సొసైటీ సమకూర్చుకుంటే, మిగిలిన 80% (రూ.171.44 లక్షలు) ఆప్కాబ్ ద్వారా ప్రభుత్వం రుణం సమకూరుస్తుంది. ► ఈ ప్రాజెక్టుకు ఆగస్టు మూడో వారంలో శంకుస్థాపన చేస్తారు. నవంబరు నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏపీ బాటలోనే.. ఏపీ బాటలోనే పీఏసీఎస్ స్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి∙ఆచంట పీఏసీఎస్‌ను ఎంపిక చేసింది. ఇక్కడ రూ.2.14 కోట్లతో గోదాము, రైసుమిల్లు, ఇతర వసతులు కల్పిస్తారు. – అహ్మద్ బాబు, కమిషనర్, సహకార శాఖ -
‘సహకారం’ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ‘మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.. మన రాష్ట్రంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థికంగా బలంగా ఉండాలి. వ్యవసాయ కార్యకలాపాలకు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ద్వారా వారిని చేయిపట్టుకుని నడిపించగలుగుతాం. ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్–ప్యాక్స్), రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) భాగస్వామ్యం కావాలి. వీటి నెట్‌వర్క్‌ను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఆర్బీకేల రూపంలో ప్రతీ గ్రామంలో ఓ బ్రాంచ్ ప్రతి పీఏసీఎస్ పరిధిలో 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకువచ్చాం. ప్రతీ ఆర్బీకేలోనూ ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను నియమించాం. వీరు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలి. పీఏసీఎస్‌లు, ఆర్బీకేలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేశాం. పీఏసీఎస్‌లు ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రుణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. క్రెడిట్, నాన్ క్రెడిట్ సేవలను గ్రామ స్థాయిలో పీఏసీఎస్‌లు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయి. ఇలా పీఏసీఎస్‌ల మాదిరిగానే ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలో ఆప్కాబ్‌కు, డీసీసీబీలకు ప్రత్యేకంగా శాఖలు ఉన్నట్టుగానే పరిగణించాలి. దేశంలో మరే ఇతర బ్యాంకుకు లేని అవకాశం రాష్ట్రంలోని సహకార బ్యాంకులకు ఉంది. రైతులకు రుణాల విషయంలో ఆర్బీకేలకు ఒక ప్రాంతీయ కార్యాలయాల మాదిరిగా పీఏసీఎస్‌లు వ్యవహరించాలి. ఆర్బీకేల ద్వారా ఆర్ధిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించాలంటే గ్రామ స్థాయి వరకు ఉన్న ఈ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సహకారరంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీసీఎంఎస్‌లపై అధ్యయనం చేయాలి జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల పనితీరుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలి. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ కార్యకలాపాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. వాటి సేవలను మరింత విస్తృతం చేసే దిశగా, రైతులతో పాటు సంబంధిత వర్గాల వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ అధ్యయనం జరగాలి. వ్యవసాయ ఉత్పత్తులు వాటి ధరలపై ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా వివరాలు వస్తున్నాయి. ఎక్కడైనా కనీస మద్దతు ధర లభించకపోయినా, ధరలు నిరాశాజనకంగా ఉన్నా సీఎం యాప్ ద్వారా వివరాలు తెలియగానే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో డీసీఎంఎస్‌లకు సముచిత పాత్ర కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రైమరీ, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలను కూడా డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేట్ చేయాలి. ఇందుకోసం çసమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడిన నివేదిక సిద్ధం చేయాలి. స్వయం ఉపాధి కల్పించాలి గ్రామస్థాయిలో తక్కువ వడ్డీకే రుణాలివ్వడం వల్ల గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళల స్వయం ఉపాధికి ఆప్కాబ్ చర్యలు తీసుకోవాలి. గుర్తించిన లబ్దిదారు చేతిలో వరుసగా నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున ప్రభుత్వం డబ్బులు పెడుతుంది. వీటితో వారిని స్వయం ఉపాధి దిశగా నడిపించేలా చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి. బంగారంపై ఇచ్చే రుణాలపై కూడా తక్కువ వడ్డీ ఉండాలి. పీఏసీఎస్‌ల ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ సరళతరంగా, సమర్థంగా ఉండేలా చూడాలి. వీటి కోసం ప్రత్యేకంగా ఎస్ఓపీలు తయారుచేయాలి. లాభాల బాట పట్టించేలా చూడాలి.. గతంలో చూడని పురోగతి ఈ నాలుగేళ్లలో ఆప్కాబ్‌లో కనిపిస్తోంది. ఆప్కాబ్ మన బ్యాంకు, మనందరి బ్యాంక్ అన్న భావనతో తీర్చిదిద్దాలి. మరింత ముందుకు తీసుకువెళ్లాలి. ఆప్కాబ్ మాదిరిగానే డీసీసీబీలు, పీఏసీఎస్‌లను కూడా నూటికి నూరు శాతం లాభాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలి. నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. లాభాల బాట పట్టించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. వెబ్ ల్యాండ్, రెవెన్యూ రికార్డులను పూర్తిగా అప్డేట్ చేయాలి. ఆ వివరాలు పీఏసీఎస్‌ల వద్ద అందుబాటులో ఉంచాలి. దీనివల్ల రికార్డుల స్వచ్చ్చికరణ జరుగుతుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. 84.32 శాతం పెరిగిన కార్యకలాపాలు: అధికారులు ప్రభుత్వ ప్రోత్సాహం, సంస్కరణల ఫలితంగా సహకార రంగంలో ఆర్థిక కార్యకలాపాలు ఈ నాలుగేళ్లలో అనూహ్యంగా పెరిగాయని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. 2019తో పోలిస్తే 2023 నాటికి 84.32 శాతం పెరిగాయన్నారు. 2019 వరకూ పీఏసీఎస్‌లో ఆర్థిక కార్యకలాపాలు రూ. 11,884.97 కోట్లు కాగా, 2023 నాటికి ఈ మొత్తం రూ. 21,906 కోట్లకు చేరిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 400 పీఏసీఎస్‌లు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయని సీఎంకు చెప్పారు. ఆప్కాబ్‌లో 2019 మార్చి నాటికి రూ. 13,322.55 కోట్ల టర్నోవర్ ఉండగా, అది 2023 మార్చి నాటికి రూ. 36,732.43 కోట్లకు చేరిందన్నారు. నాలుగేళ్లలో 175 శాతం గ్రోత్ రేటు నమోదైందన్నారు. సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పౌరసరఫరాల సంస్థ ఎండీ జీ.వీరపాండియన్, సహకార శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఆప్కాబ్ ఎండీ ఆర్ఎస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యం పెంచాలి మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం వలన సహకార రంగంలోని ప్రతి వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో పూర్తి స్థాయిలో వృత్తి నైపుణ్యం తీసుకురాగలిగితే ఆ మేరకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందుతాయి. డీసీసీబీల్లో ఇప్పటికే ప్రొఫెషనలిజం తీసుకొచ్చాం. అదే రీతిలో పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లలో కూడా ప్రొఫెషనలిజాన్ని పెంచాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషించాలి. పీఏసీఎస్‌లు, ఆర్బీకేల నెట్వర్క్ ద్వారా గ్రామ స్థాయిలో నాణ్యమైన సేవలు అందుతాయి. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించే ఎరువులు, మిగిలిన వాటిలో నాణ్యత చాలాముఖ్యం. ఎట్టిపరిస్థితుల్లోనూ కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలి. పీఏసీఎస్‌ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలి. నవంబర్ నాటికి పీఏసీఎస్‌లలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ అందుబాటులోకి తీసుకురావాలి. ఆప్కాబ్, సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లలో క్రమం తప్పకుండా ఆడిట్ జరిగేలా చూడాలి. -
సాగుకు ‘సహకారం’
సాక్షి అమరావతి: సహకార రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆప్కాబ్‌ను నిలబెట్టిన ఘనత దివంగత వైఎస్సార్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైద్యనాధన్ సిఫార్సులను ఆమోదించి సహకార పరపతి వ్యవస్థ బలోపేతం కోసం రూ.1,850 కోట్లు ఇచ్చిన తొలి రాష్ట్రంగా ఉమ్మడి ఏపీకి వైఎస్సార్ గుర్తింపు తెచ్చారని చెప్పారు. ఆప్కాబ్ (ద ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్) ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆప్కాబ్ నూతన లోగో, ఆప్కాబ్ బ్రాండ్ ఐడెంటిటీ గైడ్‌లైన్స్ (బీఐజీ) బిగ్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. డీసీసీబీలకు రూ.55.93 కోట్ల డివిడెండ్‌ను పంపిణీ చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన డీసీసీబీలు, పీఏసీఎస్, బ్రాంచ్‌లు, ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ఆ ఒక్క మార్పుతో.. ఆప్కాబ్ షష్టి పూర్తి సందర్భంగా సహకార రంగ చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. రైతులకు అండగా నిలుస్తూ బ్యాంకింగ్ సేవలతో ఆప్కాబ్ 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన పరిస్థితి చూస్తే చాలా గొప్పగా ఉంది. బ్యాంకును ఈ స్థాయికి తెచ్చేందుకు కృషి చేసిన యాజమాన్యానికి, బ్యాంకు కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. మన దేశంలో రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే పెరుగుతాడు.. అప్పుల్లోనే చనిపోతారని ఒకప్పుడు నానుడి ఉండేది. దీనికి కారణం విత్తనం నుంచి పంట కోత వరకు అన్నింటికీ పెట్టుబడి అవసరం. అందుకోసం రైతన్నలు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక రైతన్నలు అవస్థలు పడుతున్న పరిస్థితుల వల్ల ఈ నానుడి వచ్చింది. అప్పుడు.. విప్లవంలా ఒక మార్పు జరిగింది. అదేమిటంటే.. ఎప్పుడైతే రైతులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ అడుగులు వేసిందో అప్పుడు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఒక్క మార్పుతో వ్యవసాయంలో రైతన్నలు నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది. ఈ మార్పును మరింత ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్రంలో ఆప్కాబ్ అనే కోపరేటివ్ బ్యాంకు వచ్చింది. ఒక చారిత్రక అవసరంతో ఏర్పడ్డ ఈ బ్యాంకు రైతన్నలను చేయి పట్టుకుని నడిపించింది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందికర పరిస్థితులను చవి చూసింది. సహకార చట్ట సవరణ.. ఆర్థిక చేయూత ఆప్కాబ్‌ను మెరుగైన స్థితికి చేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసే బాధ్యతను 2019 అక్టోబర్‌లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్విస్ నాబ్కాన్స్కు అప్పగించాం. వారు ప్రతి బ్యాంకుకూ వెళ్లి ఏడాది పాటు క్షుణ్నంగా అధ్యయనం అనంతరం కొన్ని సూచనలు, సలహాలు అందించారు. వాటిని పరిగణలోకి తీసుకుంటూ సహకార సంఘాలు, రైతుల ప్రస్తుత పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా 1964 సహకార చట్టాన్ని సవరించాం. కో ఆపరేటివ్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో ప్రొఫెషనల్స్ ఉండేలా చర్యలు చేపట్టాం. దీనివల్ల పారదర్శకత, సామర్థ్యం పెరుగుతుంది. ప్రొఫెషనల్స్ డైరెక్టర్లుగా బ్యాంకుల్లో బాధ్యతలు తీసుకోవడంతో రాజకీయ కార్యకలాపాలు తగ్గే పరిస్థితి వచ్చింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ డీసీసీబీ సీఈవోల ఎంపిక కోసం రాష్ట్రస్థాయిలో కామన్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా సీఈవోల ఎంపిక, నియామకం చేపట్టడం ద్వారా మరింత ప్రొఫెషనలిజం తెచ్చాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డీసీసీబీలకు, ఆప్కాబ్‌కు గతేడాది రూ.295 కోట్లు షేర్ క్యాపిటల్ రూపంలో ఆర్థ్ధిక చేయూతనిచ్చాం. ఇవన్నీ ఆప్కాబ్‌ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడ్డాయి. పెరిగిన పరపతి.. లాభాల బాట సహకార వ్యవస్థలో పారదర్శక, సమర్థతను పెంపొందించేందుకు కంప్యూటరైజేషన్ తీసుకొచ్చాం. టీసీఎస్ సహకారంతో కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సహకార పరపతి సంఘాల వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందింది. 2019 నుంచి నాలుగేళ్ల వ్యవధిలో సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ఆప్కాబ్ లావాదేవీలు గణనీయంగా విస్తరించాయి. 2019 మార్చి 31 నాటికి రూ.53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,05,089 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపైన పరిస్థితి కనిపిస్తోంది. 2019లో రూ.13,700 కోట్లుగా ఉన్న ఆప్కాబ్ పరపతి 2023 మార్చి నాటికి ఏకంగా రూ.36,700 కోట్లకు పెరిగింది. అంటే మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా మిగతా డీసీసీబీలన్నీ లాభాల్లో నడుస్తున్నాయని చెప్పేందుకు గర్వపడుతున్నా. అంతేకాదు.. 36 ఏళ్ల తర్వాత కర్నూలు డీసీసీబీ, 28 ఏళ్ల తర్వాత వైఎస్సార్ కడప జిల్లా డీసీసీబీలు లాభాల్లోకి వచ్చిన పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. గొప్పగా అడుగులు వేసిన సిబ్బంది, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. డిజిటలైజేషన్ పూర్తి కావడం ద్వారా ఆప్కాబ్, డీసీసీబీలు మరింత బలోపేతమై ఈరోజు మనం చూస్తున్న మార్పులే కాకుండా ఇంకా మెరుగైన ఫలితాలు రానున్న రోజుల్లో కనిపిస్తాయి. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించాం. కంప్యూటరైజేషన్ పనులు వేగంగా జరుగు తున్నాయి. రాబోయే రోజుల్లో ఆప్కాబ్ సేవలు రైతులందరికీ విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్బీకేల స్థాయిలో అన్నీ.. ఇవాళ సాగైన ప్రతి పంటను నమోదు చేసేందుకు ఆర్బీకేల స్థాయిలో ఈ – క్రాపింగ్ జరుగుతోంది. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ తీసుకొచ్చాం. రైతులు గ్రూప్‌గా ఏర్పడి పది శాతం చెల్లిస్తే చాలు 40 శాతం బ్యాంకు రుణాలు, 50 శాతం సబ్సిడీగా ఇస్తూ తోడుగా నిలుస్తున్నాం. ఆర్బీకే స్థాయిలోనే అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. వీటి కోసం ఆప్కాబ్ రూ.500 కోట్లు రుణాలు మంజూరు చేసింది. ప్రభుత్వ సహకారం ప్రశంసనీయం: జేపీ ఆప్కాబ్ మాజీ ఎండీ, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ తాను ఆప్కాబ్ ఎండీగా ఉన్నప్పుడు సహకార రంగంలో సంస్కరణలు తేవాలని ప్రయతి్నంచానని, కానీ అప్పటి ప్రభుత్వాలు సహకరించలేదన్నారు. నాడు కేవలం 8 శాతానికి మించి రికవరీ చేయలేకపోయేవాళ్లమని, నేడు 80 శాతానికి పైగా రికవరీ సాధిస్తున్నారని చెప్పారు. సహకార వ్యవస్థ బలంగా ఉండాలన్న ఆకాంక్షతో ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు నిజంగా ప్రశంసనీయమని అన్నారు. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు. మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ, నాఫ్స్కాబ్ ఎండీ బీమా సుబ్రహ్మణ్యం, నాబార్డు సీజీఎం ఆర్ఎం గోపాల్, సహకార మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సహకార శాఖ రిజిస్ట్రార్ అహ్మద్‌బాబు, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ, 13 జిల్లాల డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తొలిసారిగా డీసీసీబీలకు డివిడెండ్ ‘‘రాష్ట్రంలో సహకార విప్లవంతో బ్యాంకింగ్ వ్యవస్థ రైతన్నలకు చేరువగా అడుగులు వేసింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో సహకార రంగం బలోపేతమై ఆధునికీకరణ సంతరించుకుంటోంది. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తూ అన్నదాతలకు చేదోడుగా నిలుస్తోంది’’ ‘‘బ్యాంక్ చరిత్రలో తొలిసారిగా డీసీసీబీలకు డివిడెండ్ ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో జరుగుతున్నందుకు గర్వంగా ఉంది. ఆప్కాబ్ ఇంకా గొప్పగా ఎదిగి రైతన్నలకు మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’’ – సీఎం వైఎస్ జగన్ ఆర్బీకేలతో పీఏసీఎస్‌ల అనుసంధానం.. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలతో (పీఏసీఎస్) అనుసంధానం చేయడంతో మరో గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఆ తర్వాత డీసీసీబీలతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతోంది. మిగతా బ్యాంకుల సహకారంతో ఈరోజు ప్రతి ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అందుబాటులోకి తెచ్చాం. కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ఆర్బీకేలతో ‘ప్యాక్స్’ అనుసంధానం.. ఇవన్నీ గ్రామ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు నిదర్శనంగా నిలుస్తాయి. తద్వారా రైతులకు ఆర్బీకేల వద్దే వ్యవసాయ ఇన్‌పుట్స్‌తో పాటు రుణ పరపతి పొందే పరిస్థితి కూడా వస్తుందని గట్టిగా చెబుతున్నా. రైతు.. గ్రామం బాగుండాలంటే రైతు, గ్రామం రెండూ బాగుండాలంటే వ్యవసాయంతో పాటు ఆర్థిక స్వావలంబనపై ఆధారపడి ఉంటుంది. మన రైతన్నలు, అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగగలిగితే గ్రామీణ వ్యవస్థ బతుకుతుంది. ఇలా అక్కచెల్లెమ్మలకు మంచి చేసే గొప్ప అడుగు ఆప్కాబ్ ద్వారా పడింది. పాడి, పంట సమృద్ధిగా పెరిగాయి. మనం అందచేస్తున్న వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ వీటన్నింటిని బ్యాంకులతో అనుసంధానించి ఆ డబ్బులను సరైన పద్ధతిలో వాడుకోవడం, అమూల్ లాంటి సంస్థ గ్రామ స్థాయిలోకి రావడం ద్వారా రైతన్నలు, అక్కచెల్లెమ్మలు మోసపోకుండా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తున్న పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆప్కాబ్ అన్ని రంగాల్లో విస్తరించడంతో గ్రామస్థాయిలో రుణాలు ఇప్పించగలిగే స్థితిలోకి వచ్చింది. దేశంలోనే భారీ నెట్వర్క్ ఆప్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్‌తో అనుసంధానమైన ఆర్బీకేలు.. ఇలాంటి పంపిణీ వ్యవస్థ బహుశా దేశ చరిత్రలో ఏ బ్యాంకుకూ లేని విధంగా రానున్న రోజుల్లో మన ఆప్కాబ్‌కు మాత్రమే ఉంటుంది. వీటన్నింటికి తోడు ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉన్నారు. దీనివల్ల భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి గ్రామంలో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలోకి ఫైబర్ గ్రిడ్ చేరుకుంటుంది. ఇవన్నీ గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. -
‘గ్యారంటీలు’ అమలు చేస్తున్నాం
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగంతోపాటు రైతన్నలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.6.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హామీల గురించి కేవలం మాటలు చెప్పడం లేదని, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసి చూపిస్తున్నామని అన్నారు. శనివారం ఢిల్లీలో 17వ భారత సహకార సదస్సులో మోదీ మాట్లాడారు. సహకార సంఘాలు రాజకీయాలను పక్కనపెట్టి సామాజిక, జాతీయ విధానాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పారదర్శక, అవినీతి రహిత పాలనకు నమూనాగా మారాలని సూచించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని చెప్పారు. వంట నూనెలు, తృణధాన్యాలు, శుద్ధి చేసిన ఆహారం, చేపల దాణాను దిగుమతి చేసుకోవడానికి మనం ఏటా రూ.2.5 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని, ఈ భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వంట నూనెల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో నూనె గింజలు, తృణ ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సహకార సంఘాలు కృషి చేయాలని కోరారు. చేసిందే చెబుతున్నాం.. గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని ప్రధాని మోదీ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో చౌక ధరలకే రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో భారీ మొత్తంలో పంటలను సేకరిస్తున్నామని చెప్పారు. పీఎం–కిసాన్ పథకం కింద నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గత నాలుగేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు బదిలీ చేశామన్నారు. ప్రజలకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీలపై మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ప్రతి రైతుకు ఏటా వివిధ రూపాల్లో రూ.50,000 లబ్ధి చేకూరుతోందని, ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. చేసిందే చెబుతున్నామని పేర్కొన్నారు. ఎంఎస్పీ ద్వారా గత తొమ్మిదేళ్లలో రైతులకు రూ.15 లక్షల కోట్లకుపైగా సొమ్ము అందజేశామని తెలియజేశారు. ఎరువుల రాయితీ కోసం ఏకంగా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంతకంటే పెద్ద గ్యారంటీ ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో రైతులకు ఒక్కో ఎరువు బస్తా కేవలం రూ.270కే లభిస్తోందని, అమెరికాలో దీని ధర రూ.3,000 పైగానే ఉందన్నారు. రైతుల జీవితాలను మార్చాలంటే చిన్న ప్రయత్నాలు సరిపోవు, భారీ ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. విపక్షాల ఐక్యత నిలిచేది కాదు షాదోల్: ప్రతిపక్షాలు ఐక్యంగా ఒక్క తాటిపైకి వస్తాయనడానికి ఎలాంటి గ్యారంటీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత గొడవలతో పార్టీలన్నీ మునిగిపోయినప్పుడు వారందరూ ఐక్యంగా ఉంటారని భావించలేమన్నారు. కాంగ్రెస్ ఇతర కుటుంబ పార్టీలన్నీ ప్రజలకి తప్పుడు హామీలిస్తున్నాయని ఇవన్నీ వారంతా ఐక్యంగా ఉండలేరనడానికి సంకేతాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడానికి అంగీకారానికొచ్చిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2047 నాటికి దేశం ఎనీమియా (రక్తహీనత)ను పారద్రోలే లక్ష్యంతో మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఒక మిషన్‌ను శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలతో ఈ పార్టీలన్నీ తమ కుటుంబాల సంక్షేమమే చూస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమం కాదని అన్నారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని బెయిల్‌పై బయటకు వచ్చిన వారు, కుంభకోణాల్లో దోషులుగా తేలి జైల్లో ఉండి వచ్చినవారే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారని నిందించారు. రాజకీయ పార్టీలిచ్చే హామీల్లో ఏమి అమలు చేయగలిగేవో ప్రజలే గుర్తించాలన్నారు. ఇలాంటి తప్పుడు హామీలిచ్చే వారంతా ఇప్పుడు ఒకే గూటికి వస్తామనడం విడ్డూరమేనని ఆయన ఎద్దేవా చేశారు. -
PACS: సహకార వ్యవస్థ బలోపేతం కోసం..
సాక్షి, ఢిల్లీ: కేంద్రం మంత్రివర్గం ఇవాళ(బుధవారం) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రధాన నిర్ణయానికి కేబినెట్ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ మీడియాకు వివరించారు. ప్రతీ పంచాయతీలో వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ మొగ్గుచూపింది. దీని ప్రకారం.. ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక పీఏసీఎస్(Primary Agricultural Credit Society) ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో మొత్తంగా రెండు లక్షల పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయాలి
న్యూఢిల్లీ: సహకార రంగం సమగ్రాభివృద్ధికి రాష్ట్రాలు కలసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో సహకార రంగం కీలక పాత్ర పోషించగలదన్నారు. రాష్ట్రాల సహకార శాఖల మంత్రుల రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. దీనిని ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ సహకార ఉద్యమం ఒకే వేగంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార రంగం కార్యకలాపాలు నిదానించిన చోట, తగ్గుముఖం పట్టిన చోట వెంటనే వాటిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే మనకు జాతీయ సహకార విధానం కావాలన్నారు. నూతన విధానం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోపరేటివ్ రంగం సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా, కొత్త విభాగాలను గుర్తించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. సహకార ఉద్యమం దక్షిణ భారత్, పశ్చిమ భారత్‌లో బలంగా ఉందన్నారు. ఉత్తర, మధ్య భారత్‌లో అభివృద్ధి దశలో ఉంటే, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా తక్కువ అభివృద్ధికి నోచుకున్నట్టు చెప్పారు. 100 ఏళ్ల లక్ష్యం.. : కోపరేటివ్ రంగం అభివృద్ధికి రాష్ట్రాలన్నీ ఒకే మార్గాన్ని, ఏకీకృత విధానాలను అనుసరించాలని అమిత్‌షా సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ వారమే 47 మంది సభ్యులతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు అధ్యక్షతన గల ఈ ప్యానెల్ సహకార రంగానికి సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయలని అమిత్‌షా కోరారు. ‘‘మన లక్ష్యం 100 ఏళ్లుగా ఉండాలి. కోపరేటివ్‌లు దేశ ఆర్థిక రంగానికి మూలస్తంభంగా మారాలి’’అని అమిత్‌షా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కోపరేటివ్ రంగం వృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ల సంఖ్యను ఐదేళ్లలో మూడు లక్షలకు పెంచడంతోపాటు, డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. -
స్వావలంబనకు సహకార రంగం కీలకం
న్యూఢిల్లీ: భారత్ స్వావలంబన సాధించడంలో సహకార రంగం కీలక పాత్ర పోషించగలదని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మరింత మెరుగైన జీవితం సాగించాలన్న 70 కోట్ల మంది పేదల ఆకాంక్షలను సాకారం చేసేందుకు, వారు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పాటు అందించగలదని పేర్కొన్నారు. సహకార సంఘాల 100వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం గరీబీ హటావో నినాదాలకే పరిమితం కాగా మోదీ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లలో పేదల అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. కోఆపరేటివ్ రంగాన్ని పటిష్టం చేసేందుకు సహకార శాఖ పలు చర్యలు తీసుకుంటోందని షా వివరించారు. నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు .. అకౌంటింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ మొదలైన అంశాల్లో కోర్సులు అందించేందుకు కోఆపరేటివ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 63,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలను (పీఏసీఎస్) దాదాపు రూ. 2,516 కోట్లతో కంప్యూటరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు షా వివరించారు. దీనితో అకౌంటింగ్, ఖాతాల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. పీఏసీఎస్‌లు ఇతరత్రా కార్యకలాపాల్లోకి కూడా విస్తరించేందుకు వీలుగా నమూనా బై–లాస్ ముసాయిదాను రూపొందించినట్లు చెప్పారు. పీఏసీఎస్‌లు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి కాబట్టి దీనిపై రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కూడా సలహాలు తీసుకుంటున్నామని వివరించారు. దేశీయంగా ప్రస్తుతం 8.5 లక్షల కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. -
సహకార రంగం తోడ్పాటుతోనే సుస్థిర అభివృద్ధి
సాక్షి, అమరావతి: దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరచడంలో సహకార వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. పుణెలోని వైకుంఠ్ మెహతా సహకార నిర్వహణ సంస్థ స్నాతకోత్సవంలో సోమవారం విజయవాడ రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో పాడి విప్లవానికి సహకార రంగమే నాందిగా నిలిచిందన్నారు. ఇఫ్కో, క్రిబ్కో, అమూల్ వంటి సంస్థలు సహకార రంగంలో గణనీయమైన విజయాలు సాధించాయని చెప్పారు. విద్య, పరిశోధన రంగాల్లో ప్రభుత్వం, సహకార, కార్పొరేట్ సంస్థలకు వైకుంఠ్ మెహతా సహకార నిర్వహణ సంస్థ విలువైన సేవలు అందిస్తోందని గవర్నర్ కొనియాడారు. దేశంలో కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టం–2020 ద్వారా వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలను విజయవంతం చేయడంలో ఈ సంస్థ భాగస్వామి కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైకుంఠ్ మెహతా సహకార నిర్వహణ సంస్థ డైరెక్టర్ కె.కె.త్రిపాఠి, గవర్నర్ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు. -
‘సహకార రంగాన్ని బాబు పూర్తిగా నాశనం చేశారు’
సాక్షి, విజయవాడ: సహకార రంగం బతికి బట్టకట్టింది అంటే కేవలం అది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలనే అని మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. తండ్రి అడుగు జాడల్లోనే కోపరేటివ్ రంగాన్ని బలపరిచే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సహకార రంగం పూర్తిగా నాశనమైందని విమర్శించారు. అనంతరం వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక సహకార రంగం ఊపిరి పోసుకుందన్నారు. కోపరేటివ్ రంగాన్ని బలపరిచేవిధంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంటుందన్నారు. సహకార రంగ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. ఉద్యోగుల నమ్మకాన్ని సీఎం వైఎస్ జగన్ కాపాడతారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని అభివర్ణించారు. బ్యాంకింగ్, సహకార వ్యవస్థను ముఖ్యమంత్రి బలోపేతం దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో సహకార సంఘం కుదేలయిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అయితే సహకార రంగంలో రెండంచెల విధానాన్ని వైఎస్సార్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. సహకార రంగాన్ని వైఎస్సార్ ముందుండి నడిపించారని, అదేవిధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం మరింత ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. -
సహకార రంగానికి ఊతం
సాక్షి, అమరావతి: సహకార రంగానికి జవసత్వాలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్న, చిన్నకారు రైతుల అభ్యున్నతికి దోహదపడే ఈ రంగం మోడువారకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్.. బడ్జెట్లో నిధుల కేటాయింపు, చక్కెర కర్మాగారాల్లోని పరిస్థితుల అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని దశల వారీగా వీటిని పునరుద్ధరించనున్నారు. తొలిదశలో రెండు కర్మాగారాల పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశంపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష జరగనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నష్టాల ఊబిలో కర్మాగారాలు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతులు పెరగడం, గత ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడంతో సహకార రంగంలో కొనసాగుతున్న రాష్ట్రంలోని పది చక్కెర కర్మాగారాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. రేణిగుంటలోని ఎస్వీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, గుంటూరు జిల్లాలోని జంపని షుగర్ ఫ్యాక్టరీ, వైఎస్సార్ జిల్లాలోని కడప కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, విజయనగరం జిల్లాలోని భీమ్‌సింగ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన చెరుకు రైతులు, రైతు కూలీలు, కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, తాండవ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పాక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ ఉత్పాదక రంగంలో కొనసాగుతున్నాయి. చక్కెర కర్మాగారాలకు వాటిల్లిన నష్టాలు.. అవి ప్రభుత్వానికి, ఆర్థిక సంస్థలు, ఉద్యోగుల జీతాలకు చెల్లించాల్సిన మొత్తాలు దాదాపు రూ. 1,475 కోట్లు ఉన్నాయి. కర్మాగారాలకు వచ్చిన నష్టాలు రూ. 683 కోట్లు, ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 271.14 కోట్లు, ఆప్కాబ్, ఎన్సీడీసీల నుంచి తీసుకున్న అప్పులు రూ. 416.58 కోట్లు, ఉద్యోగుల జీతాల బకాయిలు రూ. 105 కోట్లు ఉన్నాయి. భారమైనా ఈ రంగాన్ని బతికించాలని... ప్రస్తుత పరిస్థితిలో చక్కెర కర్మాగారాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వీటికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించినా, భవిష్యత్‌లో అవి లాభాల బాటలో కొనసాగే పరిస్థితులు లేవు. ఏటా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశాలు లేకపోలేదని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. అయితే భారమైనా ఈ రంగాన్ని బతికించాలని, ఆయా కర్మాగారాలు ఉత్పాదక రంగంలో కొనసాగితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అక్కడి రైతులు, రైతు కూలీలకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ వీటికి దశల వారీగా నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలోని కడప కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను తొలిదశలో ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిగా సొంత జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో డిసెంబరులోపు అక్కడి కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు బడ్జెట్లో దాదాపు రూ. 100 కోట్లు కేటాయించారు. పాడి రైతులకు లీటరుకు రూ. 4 బోనస్ ప్రైవేట్ డెయిరీల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు మూతపడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను తెరిపించి, రైతుల నుంచి నేరుగా పాలను కొనుగోలు చేసి లీటరుకు రూ. 4లను బోనస్‌గా ఇస్తానని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 100 కోట్లు కేటాయించారు. ఒక ఏడాదిలోపు ఇవన్నీ సక్రమంగా నడిచే విధంగా చర్యలు తీసుకుని, ఆ తరువాత రైతుల నుంచి నేరుగా పాలను కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నారు. -
ఏమవుతుందో..!
రేపు తేలనున్న తుమ్మపాల సుగర్స్ భవితవ్యం సహకార కర్మాగారాలకు గడ్డుకాలమని ఐఏఎస్ అధికారి నివేదిక...? {పభుత్వ గ్యారెంటీ ఇస్తే రుణాలిస్తామన్న ఆప్కాబ్ అనకాపల్లి : తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సహకార రంగానికి గడ్డుకాలం ఉందని, ప్రధానంగా చక్కెర పరిశ్రమ జాతీయస్థాయిలో ఆర్థికంగా కుదేలవుతున్నందున సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాలకు తగిన సహకారం అందించినా నష్టాలే పునరావృతమవుతాయని ఓ ఐఏఎస్ అధికారి ఇవ్వనున్న నివేదిక దీనిపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ర్టంలో సహకార రంగంలో ఉన్న 11 చక్కెర కర్మాగారాల్లో ఇప్పటికే ఐదు మూతపడగా తాజాగా తుమ్మపాల చక్కెర కర్మాగారం అదే బాటలో పయనిస్తోంది. రూ.కోట్ల అప్పులు, నష్టాలతో కుదేలైన తుమ్మపాల చక్కెర కర్మాగారానికి ఈ సీజన్‌కు సంబంధించి రుణాలు ఇవ్వాలంటే ప్రభుత్వం గ్యారంటీ తప్పనిసరి అని ఆప్కాబ్ చెప్పి తప్పించుకుంది. వ్యాట్ మినహాయింపునకు నిర్ణయం బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యాట్ నుంచి చక్కెర కర్మాగారాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారే తప్ప సంక్లిష్ట స్థితిలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఈనెల 19న చక్కెర కర్మాగారాలపై ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఈ సబ్ కమిటీకి కర్మాగారాల గురించి ఒక ఐఏఎస్ అధికారి సమర్పించనున్న నివేదికే కీలకం కానున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాలకు వెయ్యి కోట్ల నిధులు కేటాయించినా ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నుంచి చక్కెర పరిశ్రమలు బయటపడడం కష్టమని ఆయన పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సహకార చక్కెర కర్మాగారాలకు రుణాలు అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్థిక పరపతి లేని కర్మాగారాల్లో ఒకటైన తుమ్మపాల కర్మాగారానికి ఆప్కాబ్ నిధులు ఇవ్వడం కష్టమని, ఫలితంగా కర్మాగారంలో క్రషింగ్‌కు దారులు మూసుకుపోతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోవడం, చెరకు రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకోకపోవడం, ఉన్న చెరకు ఏటికొప్పాక, తదితర కర్మాగారాలకు తరలిపోవడానికి అవకాశాలు పెరగడంతో ఇక ఈ ఏడాది క్రషింగ్ ఆశలు సన్నగిల్లినట్లేనని మరికొందరు పేర్కొంటున్నారు. అంధకారంలో కర్మాగారం... తుమ్మపాల చక్కెర కర్మాగారం ఆర్థిక వెతలు ఒక్కొక్కటికి బయటపడుతుండగా తాజాగా కర్మాగారం విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.సుమారు రూ.40 లక్షల వరకూ కర్మాగారం బకాయి పడినట్లు తెలుస్తోంది. ఎండీకి అనారోగ్యం... తుమ్మపాల చక్కెర కర్మాగారం ఎండీ సత్యప్రకాష్ గతకొద్దిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కర్మాగార స్థితిగతులు దిగజారిన సమయంలోనే ఎండీ అనారోగ్యానికి గురి కావడంతో మార్కెట్‌వర్గాలు మరింత డీలా పడ్డాయి. ఆప్కాబ్పై ఆశలు పెట్టుకోగా ఆప్కాబ్ అధికారులు ప్రభుత్వం వైపు బంతిని నెట్టేసి కర్మాగార భవితవ్యాన్ని మరింత జటిలం చేశారు. జీతాలు లేక ఇబ్బందులు గత 16 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నాం. ఇంటి పోషణ సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు అందేలా సహకరించాలి. - డి.పైడిరాజు, రెగ్యులర్ ఉద్యోగి ఫ్యాక్టరీకోసం పనిచేస్తున్నాం జీతాలు అందకపోయినా గానుగాట జరపాలని పని చేస్తున్నాం. ఓవర్‌హాలింగ్ పనుల్లో పస్తులు ఉండి కూడా పాల్గొంటున్నాం. కర్మాగారంలో గానుగాడితేనే మాకు కుటుంబపోషణ ఉంటుంది. -పి.ఉమామహేశ్వరరావు, ఎన్ఎంఆర్