న్యూఢిల్లీ: భారత్‌లో గత 75 సంవత్సరాల్లో సహకార ఉద్యమం ఆశించిన స్థాయిలో పురోగమించలేదని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్లుగా భారత్ ఎకానమీ ఆవిర్భవిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, ఈ లక్ష్య సాధనలో సహకార రంగం భారీ వాటాను కలిగి ఉండేలా చూడడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు.
దక్షిణ ఢిల్లీలోని నౌరోజీ నగర్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌బీసీసీ అభివృద్ధి చేసిన సెంట్రల్ రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్‌సీఎస్) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర సహకార మంత్రి షా ప్రసంగించారు. 175 కోట్లతో ఈ కొత్త కార్యాలయాన్ని కొనుగోలు చేసినట్లు షా తెలిపారు. సహకార ఉద్యమం అభివృద్ధి కోసం ప్రభుత్వం గత 30 నెలల్లో 60 పెద్ద కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ జూలై 2021లో ఏర్పాటయినట్లు వివరించారు.
21వ శతాబ్దంలోకి పురోగమనం
స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి సహకార సంఘాల విజయగాథలు ఉన్నాయని, అయితే ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందలేదని షా అన్నారు. ‘‘ప్రధాని మోదీజీ లక్షిత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో, సహకార సంస్థలకు పెద్ద వాటా ఉండాలని ఇప్పుడు మేము నిర్ణయించుకున్నాము. సహకార రంగం 19వ శతాబ్దం నుండి నేరుగా 21వ శతాబ్దంలోకి పురోగమిస్తుంది’’ అని షా ఈ సందర్భంగా అన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మల్టీ–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టాన్ని సవరించిందని అన్నారు. అలాగే పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలు), పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించే పథకాన్ని బలోపేతం చేయడానికి నమూనా బై–లాస్‌ను తీసుకువచి్చందని మంత్రి పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో 2 లక్షల సంఘాల ఏర్పాటు
వచ్చే ఐదేళ్లలో 2 లక్షల బహుళ వినియోగ పీఏసీఎస్/ డెయిరీ/ మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని షా తెలిపారు. ఇప్పటికే కొత్తగా 12,000 పీఏసీఎస్‌లు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. సహకార రంగంలో మరిన్ని బ్యాంకులను తెరవాల్సిన అవసరాన్ని షా ఉద్ఘాటించారు. తమను తాము బ్యాంకులుగా మార్చుకోవాలని బహుళ–రాష్ట్ర క్రెడిట్ సొసైటీలను సూచించారు. మలీ్ట–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ 2023లో 102కి చేరిందని ఆయన పేర్కొంటూ 2020లో 10 నుంచి 10 రెట్లు పెరిగిందని వివరించారు.
నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీలకు డిమాండ్
ఐఎఫ్‌ఎఫ్‌సీఓ వినూత్న ఉత్పత్తులైన నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డీఏపీ (డి–అమ్మోనియం ఫాస్ఫేట్)లను షా ఈ సందర్భంగా ఉటంకించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. నానో యూరియా, నానో డీఏపీ పిచి కారీ చేసేందుకు పీఏసీఎస్‌లు రైతులకు డ్రోన్ లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు.
కాగా, ఇటీవల షా ఆవిష్కరించిన నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఉన్న త స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నేషనల్ డైయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ)చీఫ్ ప్రమోటర్‌గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద 2022 జనవరి 25న ఎన్‌సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్‌సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment