దుర్శేడ్ పీఏసీఎస్లో చోరీకి యత్నం
కరీంనగర్ జిల్లా దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో చోరీ యత్నం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి కార్యాలయంలోకి చొరబడ్డ ఒక గుర్తు తెలియని వ్యక్తి డబ్బును భద్రపరిచే లాకర్ను తెరవటానికి యత్నించాడు. అది తెరుచుకోక పోవడంతో వెనుదిరిగాడు. వెళ్తూవెళ్తూ టేబుల్ సొరుగులో ఉంచిన రూ.1200 ఎత్తుకు పోయాడు. చోరీ విషయం సోమవారం ఉదయం వెలుగుచూసింది. పీఏసీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కార్యాలయంలోని సీసీ ఫుటేజిని పరిశీలించారు. స్థానికుడే దొంగతనానికి యత్నించినట్లు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.