కొత్త ఆటోలకు గ్రీన్‌ సిగ్నల్‌ | green signal for New autos | Sakshi
Sakshi News home page

కొత్త ఆటోలకు గ్రీన్‌ సిగ్నల్‌

Published Wed, Aug 10 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

green signal for New autos

► పాత ప్రొసీడింగ్‌లపైనే జారీ
► 1407 ఆటోలకు అనుమతి
► జేటీసీ రఘునాథ్‌ వెల్లడి
 
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరిన్ని కొత్త ఆటోలు రోడ్డెక్కనున్నాయి. గతంలో పలు జీవోల కింద విడుదలై గడువు ముగిసిన కారణంగా మిగిలిపోయిన 1,407 ఆటో రిక్షాలకు అనుమతినిస్తూ మంగళవారం రవాణాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. బుధవారం నుంచి కొత్త ఆటోల విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్లు హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ టి.రఘునాథ్‌ తెలిపారు. 
కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వండి..
గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు కొత్తవాళ్లకు కూడా ఆటో పర్మిట్లు పొందేందుకు అవకాశం కల్పించాలని  ఏఐటీయూసీ కార్యదర్శి బి.వెంకటేశం, తెలంగాణ ఆటోడ్రైవర్‌ల సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి ఏ.సత్తిరెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రెండేళ్లలో పెరిగిన నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని అవకాశం కల్పించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement