ఆసుపత్రిలో సీజ్ చేసిన మందుల షాపు
ఆకివీడు: అనుమతులతో పాటు, వైద్యులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రిలో సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ పి.బాలు, నర్సాపురం డిప్యూటీ వైద్యాధికారి ప్రసాద్‌లు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీ చేపట్టినట్టు బాలు చెప్పారు.
రమేష్ అనే వ్యక్తి తన పేరుతోనే ఆస్పత్రి నడుపుతున్నారని, దీనికి ప్రభుత్వ అనుమతుల్లేవన్నారు. తనిఖీ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంపై ప్రశ్నించగా.. కోవిడ్ కారణంగా రావడం లేదని నిర్వాహకులు చెప్పినట్టు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న మందుల షాపును కూడా సీజ్ చేసినట్టు డాక్టర్ బాలు వివరించారు. దీనిపై రమేష్ మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment