private hospital Siege
-
ఆకివీడులో ప్రైవేటు ఆసుపత్రి సీజ్
ఆకివీడు: అనుమతులతో పాటు, వైద్యులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రిలో సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ పి.బాలు, నర్సాపురం డిప్యూటీ వైద్యాధికారి ప్రసాద్‌లు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీ చేపట్టినట్టు బాలు చెప్పారు. రమేష్ అనే వ్యక్తి తన పేరుతోనే ఆస్పత్రి నడుపుతున్నారని, దీనికి ప్రభుత్వ అనుమతుల్లేవన్నారు. తనిఖీ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంపై ప్రశ్నించగా.. కోవిడ్ కారణంగా రావడం లేదని నిర్వాహకులు చెప్పినట్టు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న మందుల షాపును కూడా సీజ్ చేసినట్టు డాక్టర్ బాలు వివరించారు. దీనిపై రమేష్ మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. -
అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రి సీజ్
పశ్చిమగోదావరి ,నిడదవోలు :నిడదవోలు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి సెంటర్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డాక్టర్ అనిల్ ఆర్ధో అండ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదులు రావడంతో ఈనెల 11న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ పద్మజారాణి తన సిబ్బందితో అనిల్ ఆర్ధో అండ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్నారని నిర్ధారించారు. వైద్యులు మండవ అనిల్ కుమార్ చౌదరిని ప్రశ్నించగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేకపోగా, ఒరిజినల్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ కూడా లేదని నిర్ధారించారు. అతనితో పాటు వైద్యం చేస్తున్న మరో వైద్యురాలు పుష్ప చౌదరి కూడా సర్టిఫికెట్లు చూపించలేదు. రెండు రోజుల్లో ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. 15 రోజులు గడిచినా ఇంతవరకు అనుమతులకు సంబంధించిన రికార్డులను వైద్యాధికారులకు చూపకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె.కోటేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా ఉప వైద్య ఆరోగ్య విస్తరణ, మీడియా అధికారి సీహెచ్.నాగేశ్వరరావు, తాడిమళ్ల పీహెచ్సీ ప్రభుత్వ వైద్యాధికారి పి.శ్రీకాంత్‌లు తమ సిబ్బందితో మళ్లీ ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించారు. ఈ సమయంలో వైద్యుడు అనిల్‌కుమార్ చౌదరి ఆసుపత్రిలో లేరు. దాంతో ఆసుపత్రిలో వైద్యుడి ఓపీ గది, ఆపరేషన్ థియేటర్, వార్డు గదులకు తాళాలు వేసి సీజ్ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించగా ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే రోగులకు వైద్య పరీక్షలు, ఆపరేషన్లు చేస్తున్నారని గుర్తించారు. వైద్యులు మండవ అనిల్ కుమార్ చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు. -
ప్రైవేట్ ఆస్పత్రి సీజ్
వలిగొండ : కలెక్టర్ ఆదేశాల మేరకు వలిగొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆమోస్ శుక్రవారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాయినర్సింగ్ హోం లో మౌలిక వసతులు, ఆపరేషన్ థియేటర్లో సరిగా లేదని పేర్కొంటూ సీజ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులలో సరైన సౌకర్యాలు కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వలిగొండ పీహెచ్సీ ఆస్పత్రి డాక్టర్ సుమన్‌కల్యాణ్, సీహెచ్ఓ బడుగు శ్రీరాములు ఉన్నారు. -
పాతపట్నంలో ప్రైవేటు ఆస్పత్రి సీజ్
పాతపట్నం, న్యూస్‌లైన్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కనకమహాలక్ష్మి మెడికేర్‌పై అధికారులు కొరడా ఝులి పించారు. పాలకొండ ఆర్డీవో ఎస్.తేజ్‌భరత్, ఇతర అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు జరిపారు. అనుమతి ప త్రాలు లేకుండా మెడికల్ స్టోర్, ల్యాబ్, ఆస్పత్రి రెండేళ్ల నుం చి నిర్వహిస్తుండడాన్ని గుర్తించి..విస్తుపోయారు. కనీసం వైద్యుడు కూడా లే కుండా ఎలా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంబంధిత యాజమాన్యం పత్రాలు చూపించకపోవడంతో..వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించా రు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే..ఆస్పత్రులు, ల్యా బ్‌లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహశీల్దార్ బి.ఎస్.ప్రకాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.లక్ష్మీనారాయ ణ, వీఆర్వో మురళీ, పాతపట్నం ఎస్పీహెచ్వో డాక్టర్ వేణుగోపాల్, సీహెచ్‌వో ఐ.నారాయణరావు, సీనియర్ సహాయకుడు శేఖర్ పట్నాయక్, పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ పైల ప్రియాంక సమక్షంలో మెడికేర్‌ను సీజ్ చేశారు.