
న్యూఢిల్లీ: దేశంలో 16 సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వగా దశాబ్దం తర్వాత ఐదు మాత్రం నిర్మాణంలో ఉన్నాయని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక తూర్పారబట్టింది. నిర్మాణం నత్తనడకన సాగుతుండగా వాటి అంచనా వ్యయం విపరీతంగా పెరిగిందని తెలిపింది. 2008 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్ పలు సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. వాటిల్లో ప్రస్తుతం పనులు నడుస్తున్నవి గోసిర్‌కుండ్, తీత్సా, సరయూ, ఇందిరాసాగర్ పోలవరం, షాపూర్–కాండి ప్రాజెక్టులు.
కాగా, 2017 వరకు వీటి నిర్మాణానికి వెచ్చించిన మొత్తం రూ.13,299 కోట్లుగా కాగ్ తేల్చింది. ఈ ఐదు ప్రాజెక్టులు 8 శాతం నుంచి 99 శాతం వరకు పనులు పూర్తి చేసుకున్నాయి. వీటి అంచనా వ్యయం మాత్రం 2,341 శాతం పెరిగిపోగా వీటి వల్ల అంత ప్రయోజనం దక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయంది. ఈ ప్రాజెక్టుల నివేదిక తయారీ, అనుమతులు, సర్వే, భూ సేకరణ నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ నిర్వహణ లోపాలున్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment