ఐపీఓ కోసం వొడాఫోన్ కసరత్తు
న్యూఢిల్లీ: బ్రిటిష్ టెలికం సంస్థ వొడాఫోన్ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానుంది. తన భారత విభాగం ఐపీఓకు రావడం కోసం బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని వొడాఫోన్ ప్రతినిధి తెలిపారు. అయితే ఇప్పటివరకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం, వొడాఫోన్‌ల మధ్య రూ.14,200 కోట్ల పన్ను వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ పన్ను వివాదం ఉన్నప్పటికీ, ఐపీఓ కోసం బ్యాంకులతో వొడాఫోన్ కొన్నాళ్లుగా సంప్రదింపులు జరుపుతోంది.