19 నుంచి ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ | RBL Bank IPO to open on Aug 19 | Sakshi
Sakshi News home page

19 నుంచి ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ

Published Thu, Aug 11 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

19  నుంచి ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ

19 నుంచి ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ

పదేళ్ల తర్వాత అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐపీఓ
ధరల శ్రేణి రూ.224-225

ముంబై: ఆర్‌బీఎల్ బ్యాంక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,230 కోట్లు సమీకరించనున్నట్లు ఆర్‌బీఎల్ బ్యాంక్ తెలిపింది. దాదాపు పదేళ్ల తర్వాత ఒక  ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐపీఓ రావడం ఇదే మొదటిసారి. ఒక దేశీయ బ్యాంక్ ఈ రేంజ్‌లో నిధులు సమీకరించడం కూడా ఇదే తొలిసారి.

ఈ ఐపీఓలో భాగంగా తాజా షేర్ల జారీ ద్వారా రూ.832.5 కోట్లు, ప్రస్తుత వాటాదారుల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించడం ద్వారా రూ.380 కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నామని పేర్కొంది. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.224-225గా నిర్ణయించామని  ఇక్కడ జరిగిన ఐపీఓ రోడ్‌షోలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ తెలిపారు. ఈ రోడ్ షోలో ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో స్వల్పమొత్తంలో వాటా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ దీపక్ పరేఖ్, ఎస్‌బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement