ఐపీఓకు హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్...
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రయత్నాలను ప్రారంభించింది. భారత్‌లో తొలిసారిగా ఐపీఓకు వస్తున్న తొలి జీవిత బీమా సంస్థ ఇదేకానున్నది. ఈ ఐపీఓలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్‌లో తనకున్న61.65 శాతం వాటాలో 10 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ విక్రయించనున్నది. ఐపీఓ వివరాలు వెల్లడి కానప్పటికీ, ఈ కంపెనీ ఐపీఓ కనీసం రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కంపెనీ త్వరలోనే ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీకి మర్పిస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐపీఓ వస్తుందని సమాచారం.