యాడ్‌ల్యాబ్స్ ఐపీవో షురూ | adlabs ipo issued | Sakshi
Sakshi News home page

యాడ్‌ల్యాబ్స్ ఐపీవో షురూ

Published Wed, Mar 11 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

యాడ్‌ల్యాబ్స్ ఐపీవో షురూ

యాడ్‌ల్యాబ్స్ ఐపీవో షురూ

థీమ్‌పార్క్‌ల నిర్వహణ సంస్థ యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) తొలి రోజున (మంగళవారం) 0.03 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది.

ముంబై: థీమ్‌పార్క్‌ల నిర్వహణ సంస్థ యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) తొలి రోజున (మంగళవారం) 0.03 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. 1.76 కోట్ల షేర్లను జారీ చేస్తుండగా 4.98 లక్షల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి రూ. 221 చొప్పున.. సుమారు రూ. 60 కోట్ల విలువ చేసే షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు యాడ్‌ల్యాబ్స్ కేటాయించింది. దాదాపు రూ.400 కోట్లు సమీకరణ కోసం యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఐపీవోకి వచ్చింది. ఆఫర్ ఈ నెల 12న ముగియనుంది. షేరు ధరల శ్రేణి రూ. 221-రూ.230. వ్యాపారవేత్త మన్మోహన్ శెట్టి, థ్రిల్ పార్క్ కలసి యాడ్ ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. ఇమేజికా థీమ్ పార్క్‌తో పాటు ఆక్వామ్యాజికా వాటర్ పార్క్‌ను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement