Initial Public Offers
-
ఐపీవోల్లో పెట్టుబడులు పెడుతున్నారా? ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
లిస్టింగ్‌లోనే 100 శాతం లాభం. మరొకటి లిస్టింగ్ రోజే 150 శాతం లాభం ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) గురించి ఈ తరహా వార్తలు వింటుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఐపీవోలో షేర్లు అలాట్ అయితే లాభాల పంట పండినట్టే! అన్న వేలంవెర్రి కొన్ని సందర్భాల్లో మార్కెట్లో కనిపిస్తుంటుంది. కానీ, ఇది అన్ని వేళలా ఉండే ధోరణి కాదు. బుల్ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే, అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటే అంచనాలు తప్పుతాయి. నష్టాలు పలకరిస్తాయి. గతేడాది మార్కెట్ల ర్యాలీ సమయంలో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్లలో విపరీతమైన యూఫోరియా నెలకొంది. 2022 వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. స్టాక్స్ భారీ పతనంతో ఆ యూఫోరియా ఆవిరైపోయింది. మార్కెట్లో ఈ రకమైన అస్థిరతలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మార్కెట్లో నిలిచి గెలవాలంటే, పెట్టుబడులన్నవి లక్ష్యాలకు అనుగుణంగానే ఉండాలనేది నిపుణుల మాట. ఐపీవోల్లో పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయాలను తెలియజేసే కథనమిది... జొమాటో షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.76. లిస్టింగ్ ధర రూ.115. అక్కడి నుంచి రూ.169 వరకు వెళ్లింది. రూ.140 ధరలో ఉన్నప్పుడు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ రూ.175 వరకు పెరుగుతుందని లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ, ఒక జొమాటో షేరుకు రూ.41 మించి పెట్టడం దండగని వ్యాల్యూషన్ గురువుగా ప్రసిద్ధి చెందిన అశ్వత్ దామోదరన్ ఐపీవో సమయంలోనే సూచించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టు జొమాటో ఇటీవలే రూ.40.55కు పడిపోయి అక్కడి నుంచి కోలుకుంది. ఆ సందర్భంలో జొమాటో సహేతుక విలువ రూ.35 అంటూ దామోదరన్ సవరించారనుకోండి. ఒక్క జొమాటోనే అని కాదు. న్యూఏజ్ వ్యాపారాల్లో ఉన్న అన్ని ఐపీవోలు లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చినవే. అందుకే లాభాల వెర్రితనం కాకుండా.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఇన్వెస్ట్ చేయడం ద్వారానే విలువైన క్యాపిటల్‌ను కాపాడుకోవచ్చని మార్కెట్ పండితుల సూచన. 2021 జూలైలో జొమాటో ఐపీవోకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌గా 38 రెట్లు అధిక స్పందన అందుకుంది. రూ.9,000 కోట్ల ఐపీవోకు ఈ స్థాయి స్పందన అంటే చిన్నదేమీ కాదు. లిస్టింగ్‌లోనే 64 శాతం లాభాన్ని పంచింది. నైకా అయితే లిస్టింగ్ రోజే 96 శాతం లాభాలను ఇచ్చింది. ‘‘ఐపీవోలో ఒక కంపెనీ జారీ చేసే షేరు ధరను నిర్ణయించే విధానం ఈ ఏడాది మార్చి 31వరకు వేరుగా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సైతం నిధుల లభ్యత దండిగా ఉంది. దీంతో వారు రుణం తీసుకుని మరీ ఐపీవోలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో రెట్ల అధిక స్పందనతో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగి ఆయా షేర్ల ధరల వృద్ధికి దారితీసింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐపీవో నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఆ తర్వాత నుంచి వచ్చిన ఐపీవోల్లో కేవలం ఒక్క ఇష్యూలోనే అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల కోటా (హెచ్ఎన్ఐలు) డబుల్ డిజిట్లో సబ్స్క్రయిబ్ కావడం గమనించాలి’’అని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ ‘క్రిస్’ డైరెక్టర్ అర్జున్ కేజ్రీవాల్ తెలిపారు. గతేడాది ఐపీవోకు వచ్చిన, కొత్తగా లిస్ట్ అయిన వాటిల్లో అధిక శాతం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోవడాన్ని గమనించొచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ముఖ్యంగా గడిచిన ఆరు నెలల్లో ఇవి ఎక్కువ నష్టాలను చవిచూశాయి. ఎన్నో ఉదాహరణలు... ప్రస్తుతం జొమాటో ధర (రూ.60)ను చూస్తే గరిష్ట స్థాయి (రూ.169) నుంచి 60 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. పాలసీబజార్ (పీబీ ఫిన్‌టెక్) గరిష్ట ధర (రూ.1,470) నుంచి చూస్తే 65 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. నైకా (ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్) గరిష్ట ధర రూ.2,574 కాగా, 47 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. ఇక పేటీఎం అయితే ఇష్యూ ధర రూ.2,150 కాగా, 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,961 మాత్రమే. ఈ ధర నుంచి చూస్తే 60 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. భారీ నష్టాల్లో ఉన్న న్యూఏజ్ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు ఐపీవోలకు వచ్చి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడాన్ని చూశాం. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ఈజీని ప్రమోట్ చేస్తున్న ఏపీఐ హోల్డింగ్స్ కూడా నష్టాల్లో నడుస్తున్నదే. ఈ సంస్థ కూడా ఐపీవోకు దరఖాస్తు పెట్టుకుంది. కానీ, న్యూఏజ్ వ్యాపార కంపెనీల షేర్లు పేకమేడల్లా కూలిపోతున్న తరుణంలో, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో ఐపీవోకు రావడం తగదని భావించి ఇటీవలే తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ తరహా షేర్ల వ్యాల్యూషన్ నిర్ణయ విధానం సంప్రదాయానికి భిన్నమైనది. వ్యాపారంలో భారీ వృద్ధి, భవిష్యత్తులో వచ్చే లాభాల అంచనాల ఆధారంగా వీటి షేర్ల ధర నిర్ణయమవుతుంటుంది. సుదీర్ఘకాలం పాటు (5–10–15–20 ఏళ్లు) వేచి చూస్తేనే.. ఇవి నిలిచి గెలుస్తాయా? లాభాలు కురిపిస్తాయా? అన్నది తేలుతుంది. కానీ, వీటిపై పెద్దగా అవగాహన లేని, ప్రణాళిక లేని ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల కోసం, స్వల్పకాల లాభాల కోసం వీటికి దరఖాస్తు చేసుకుని నష్టపోయారు. అంతెందుకు ఎల్ఐసీ ఐపీవోనే తీసుకుందాం. దేశవ్యాప్తంగా అధిక శాతం ఇన్వెస్టర్లలో మంచి అంచనాలే ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు, పాలసీదారులకు ఇష్యూ ధరలో డిస్కౌంట్ కూడా లభించింది. కానీ, లిస్టింగ్‌లో నిరాశపరించింది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి అది నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఒక్కో షేరు జారీ ధర రూ.949 కాగా, బీఎస్ఈలో నమోదైన గరిష్ట ధర రూ.920. అక్కడి నుంచి 30 శాతం నష్టపోయి రూ.700కు దిగువన ట్రేడ్ అవుతోంది. ఎల్ఐసీ బీమా రంగంలో గొప్ప కంపెనీ. భారీ లాభాల్లో ఉన్న బ్లూచిప్ సంస్థ. ఆ రంగంలో లీడర్. అయినా కానీ లిస్టింగ్‌లో లాభాలు పంచలేకపోయింది. దీనికి కారణం ప్రతికూల మార్కెట్ పరిస్థితులకుతోడు, ఎల్ఐసీ అధిక వ్యాల్యూషన్పై ఐపీవో రావడాన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం కోసం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ నష్టాల బెడద ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో బీమా వ్యాప్తి 5 శాతం మించలేదు. కనుక భవిష్యత్తులో వ్యాపార వృద్ధి అవకావాలు దండిగా ఉన్నాయి. అయినా కానీ, స్వల్పకాలంలో లాభాలకు ఇక్కడ హామీ ఉండదు. ఎందుకంటే..? ఇటీవలి ఐపీవోల్లో ఇన్వెస్టర్ల చేతులు కాలడం వెనుక నిపుణులు ప్రధానంగా.. ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌కు తోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘గతేడాది వ్యవస్థలో నగదు లభ్యత పుష్కలంగా ఉంది. దీంతో కొత్త టెక్నాలజీ కంపెనీల ధరలను పరుగుపెట్టించింది. ఇప్పుడు నగదు లభ్యత కఠినతరంగా మారింది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ షేర్లపై ప్రభావం పడింది’’అని హేమ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆస్తాజైన్ పేర్కొన్నారు. వీటి వైపు చూడొచ్చా..? కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు రక్షణాత్మకం అని భావించొచ్చు. ‘‘జొమాటో షేరును గతేడాది ఇష్టపడని వారు లేరు. కానీ, ఇప్పుడు దీనికి అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నికరంగా నష్టాలనే ఇచ్చింది. బ్లింకిట్ కొనుగోలుతో లాభాల్లోకి రావడానికి మరింత సమయం పడుతుంది. యాజమాన్యం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో బ్రేక్ ఈవెన్‌కు సంబంధించి అంచనాలను ప్రకటించింది. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు కూడా సందేహం లేదు. దీర్ఘకాల ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఇదొక మంచి ఉదాహరణ అవుతుంది’’అని జెఫరీస్ తన నివేదికలో ప్రస్తావించింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ గత నెలలో నైకా షేరుకు బై రేటింగ్ ఇచ్చింది. మార్కెటింగ్‌పై అధిక వ్యయాలతో మార్జిన్లు తగ్గుతున్నందున ఇదే నైకా స్టాక్‌కు రెడ్యూస్ (తగ్గించుకోవడం) రేటింగ్‌ను ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రకటించింది. పేటీఎం, ఎల్ఐసీకి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై రేటింగ్ ఇచ్చింది. పాలజీబజార్కు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ బై రేటింగ్ ఇచ్చింది. తిరిగి ఈ కంపెనీలు పూర్వపు ఆదరణ సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘ఈ కంపెనీల మూలాలు మెరుగుపడాల్సి ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం కూడా అనుకూలించాలి’’అని ఆస్తాజైన్ పేర్కొన్నారు. మిస్ అయిపోతామన్న భయం వద్దు ఒక స్టాక్‌ను మిస్ అయిపోతామన్న ధోరణి (ఫోమో)కి దూరంగా ఉండాలన్నది స్టాక్ మార్కెట్ల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠంగా సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘టీబీఎంజీ క్యాపిటల్’ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ తెలిపారు. ఈ విధమైన ధోరణిని అనుసరించకుండా, ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉంటే అది ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పారు. ఇన్వెస్టర్లకు స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి, కావాల్సిన క్యాపిటల్ ఉంటే లాభాలను ఇవ్వదు. లక్ష్యాలు, కాల వ్యవధి పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడు తమ కాలవ్యవధి, రాబడుల అంచనాలకు అనుకూలమైన స్టాక్స్‌లో పెట్టుబడి చేసుకోవచ్చు. ఐదేళ్లు లేదా పదేళ్ల కోసం, భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాలతో ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తే, లిస్టింగ్ తర్వాత నష్టాల్లోకి వెళ్లిందని విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు లాభాల్లోకి వస్తామన్నది తమకు తెలియదని జొమాటో ఫౌండర్ గోయల్ ఐపీవో ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. దీర్ఘకాలం కోసమే తాము వ్యాపారాన్ని నిర్మిస్తున్నామనే అంటున్నారు. కనుక దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ∙ కొందరు లిస్టింగ్ రోజు లాభం వస్తే విక్రయించుకోవచ్చన్న ఒకే ఆలోచనతో డిమాండ్ ఉన్న ఐపీవోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి వారు లిస్టింగ్ రోజు లాభం వచ్చినా, నష్టం వచ్చినా సరే విక్రయించుకోవాల్సిందే. జొమాటో ఐదేళ్లలో లాభాల్లోకి వస్తుందని అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పటి వరకు వేచి చూసి, కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు ఆధారంగా నిర్ణయానికి రావాలి. స్టాక్స్ ఎప్పుడూ పడి లేచే కెరటాలే. కాకపోతే మంచి యాజమాన్యం, బలమైన వ్యాపార మూలాలు ఉన్న కంపెనీలకే ఇది అమలవుతుంది. ఇక అసలు నష్టాల్లో ఉన్న కంపెనీల జోలికి వెళ్లకపోవడం రిస్క్ వద్దనుకునే వారికి మెరుగైన మార్గం. వివిధ రంగాల్లో లీడర్లుగా ఉన్న బ్లూచిప్ కంపెనీల్లో రిస్క్ దాదాపుగా ఉండదు. రాబడులు మోస్తరుగా ఉంటాయి. అధిక రాబడి ఆశించే వారు, అధిక రిస్క్ తీసుకుంటున్నట్టే. అది కూడా తగినంత అధ్యయనం, నిపుణుల సూచనల ఆధారంగా కాలిక్యులేటెడ్ రిస్క్‌కే పరిమితం కావాలి. -
పేటీఎం ఐపీవోకు ఇన్వెస్టర్ల క్యూ..
ముంబై: డిజిటల్ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 1.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం సత్వరం ఓవర్ సబ్‌స్క్రైబ్ కాగా, ఇష్యూ ఆఖరు రోజైన బుధవారం నాడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సహా సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా రంగంలోకి దిగారు. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. దీంతో వచ్చే వారం పేటీఎం లిస్టింగ్ భారీగా ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. నవంబర్ 15న షేర్లను అలాట్ చేయనుండగా, 18న లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లిస్టింగ్ రోజున పేటీఎం దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) పైగా వేల్యుయేషన్ దక్కించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కోల్ ఇండియాను మించిన ఇష్యూ.. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080 – 2,150గా కంపెనీ నిర్ణయించింది. విజయ్ శేఖర్ శర్మ 2000లో వన్97 కమ్యూనికేషన్స్‌ని (పేటీఎం మాతృ సంస్థ) ప్రారంభించారు. దాదాపు దశాబ్దం క్రితం మొబైల్ రీచార్జి, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థగా ఏర్పాటైన పేటీఎం .. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లు యాంట్ గ్రూప్, సాఫ్ట్ బ్యాంక్ మొదలైన వాటికి ఇందులో పెట్టుబడులు ఉన్నాయి. సఫైర్ ఫుడ్స్‌కు 1.07 రెట్ల స్పందన న్యూఢిల్లీ: కేఎఫ్‌సీ, పిజా హట్ అవుట్‌లెట్స్ నిర్వహణ సంస్థ సఫైర్ ఫుడ్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ రెండో రోజున పూర్తి స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయింది. 96.63 లక్షల షేర్లను ఆఫర్ చేస్తుండగా 1.03 కోట్ల షేర్లకు (1.07 రెట్లు) బిడ్స్ వచ్చినట్లు ఎన్ఎస్ఈ గణాంకాల్లో వెల్లడైంది. రిటైల్ వ్యక్తిగత ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) విభాగం 5.38 రెట్లు, సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల విభాగం 29 శాతం, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 3 శాతం మేర సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఈ ఇష్యూ ద్వారా సఫైర్ ఫుడ్స్ రూ. 2,073 కోట్లు సమీకరిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 933 కోట్లు సమీకరించింది. ఐపీవో ధరల శ్రేణి షేరు ఒక్కింటికి రూ. 1,120–1,180గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 31 నాటికి సఫైర్ ఫుడ్స్ భారత్, మాల్దీవుల్లో 204 కేఎఫ్‌సీ రెస్టారెంట్లను.. భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో 231 పిజా హట్ రెస్టారెంట్లను, శ్రీలంకలో రెండు టాకో బెల్ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. -
ఐపీఓ జోష్ భద్రం బాస్!
గడిచిన పది నెలలుగా స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీ చేస్తుండడం.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్‌కు జోష్‌నిస్తోంది. కొత్త కొత్త కంపెనీలు బుల్ మార్కెట్ అండతో, భారీగా నిధులు సమీకరించుకునేందుకు... స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయ్యేందుకు ఐపీవో బాట పడుతున్నాయి. లిస్టింగ్‌తోనే రెట్టింపునకు పైగా లాభాలు కురిపిస్తుండడంతో (కొన్ని ఇష్యూలు) రిటైల్ ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ, ప్రతీ ఐపీవో లాభాలు కురిపిస్తుందన్న ఆశతో వెళితే చేతులు కాలే ప్రమాదం ఉందని గత అనుభవాలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తగిన అధ్యయనం తర్వాతే ఐపీవోల్లో పాల్గొనడం ద్వారా ఆశించిన లాభాలను కళ్ల చూడగలరని అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్లకు బుట్టెడు లాభాలను పంచినవే కాదు.. పెట్టుబడిని ఆసాంతం హరించేసిన ఇష్యూలు కూడా ఉన్నాయి. కనుక ఐపీవో మార్కెట్లో చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయడంపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... 2020 రెండో అర్ధభాగంలో 14 ఐపీవోలు ప్రజల నుంచి సుమారు రూ.16,272 కోట్లను సమీకరించాయి. ఇక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఐదు ఐపీవోలు మార్కెట్‌ను పలకరించాయి. మరెన్నో సంస్థలు త్వరలో ఐపీవోలకు వచ్చేందుకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తుండగా.. ఇంకొన్ని సంస్థలు ఐపీవో ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఐపీవోల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత వేలంవెర్రిగా ఉన్నారంటే.. ఇటీవలే ముగిసిన నురేకా ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటాకు ఏకంగా 166 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. కానీ, అన్ని ఐపీవోలు ఇన్వెస్టర్లకు రాబడులు కురిపిస్తాయన్న గ్యారంటీ లేదనే విషయాన్ని ఎక్కువ మంది పట్టించుకోవడం లేదు. 2015 నుంచి 2021 జనవరి వరకు 142 ఐపీవోలు ప్రజల నుంచి నిధులు సమీకరించగా.. అందులో 55 స్టాక్స్ ఇప్పటికీ వాటి ఐపీవో జారీ ధర కంటే తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అయితే, ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఎన్నో రెట్లు వృద్ధి చేసిన ఇష్యూలు కూడా ఉన్నాయి. అందుకే ఆణిముత్యాల్లాంటి ఐపీవోలను ఇన్వెస్టర్లు గుర్తించగలగాలి. అప్పుడే వారి కష్టార్జితాన్ని కరిగిపోకుండా చూసు కోవచ్చు. 49 ఇష్యూలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు అంతకు మించి వృద్ధి చేశాయి. వాటిల్లో ఐఆర్సీటీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సీడీఎస్ఎల్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్‌మొబైల్ ఉన్నాయి. ముఖ్యంగా డిక్సన్ టెక్, అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్), ఐఆర్సీటీసీ అయితే వాటి ఐపీవో ధరలతో పోలిస్తే.. ఐదింతల కంటే ఎక్కువే ఇప్పటి వరకు పెరిగాయి. మరి ఇన్వెస్టర్ల పెట్టుబడులను కరిగించేసిన వాటిల్లో ఆర్టెల్ కమ్యూనికేషన్స్, యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ తదితర కంపెనీలు కూడా ఉన్నాయని మర్చిపోవద్దు. ఈ రెండూ 2015లో ఐపీవో ముగించుకోగా, నాటి నుంచి నేటి వరకు ఇన్వెస్టర్ల పెట్టుబడులను 95 శాతం తుడిచిపెట్టేశాయి. ఇక మన్‌పసంద్ బెవరేజెస్ తదితర కొన్ని కంపెనీలు ట్రేడింగ్ నుంచి కనుమరుగైపోయాయి. కారణం కార్పొ రేట్ గవర్నెన్స్ అంశాలే. అందుకే మెరుగైన ఇష్యూలను గుర్తించగలిగితేనే ఇన్వెస్టర్లు ఆశించిన లక్ష్యాలను చేరుకోగలరు. అనుకరించడం తెలియాలి.. ఇటీవలి బర్గర్ కింగ్, ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూలకు సంస్థాగత ఇన్వెస్టర్లు (ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు), అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల (హెచ్ఎన్ఐ) నుంచి అధిక స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లూ వీరికేమీ తీసిపోలేదు లేండి. కానీ, తెలివిగా మసలుకోకపోతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా పరిస్థితి మారుతుంది. ఎందుకంటే ఇనిస్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐల స్పందన ఆధారంగా ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు.. వారికి మాదిరే ఆయా కౌంటర్ల నుంచి ఎప్పుడు బయటపడాలన్నది తప్పకుండా తెలిసి ఉండాలి. ఉదాహరణకు.. 2017లో వచ్చిన కెపాసిట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఐపీవోను చెప్పుకోవాలి. నాడు ఈ ఐపీవో 130 రెట్లు అధికంగా స్పందన అందుకుంది. క్యూఐబీ, ఎఫ్ఐఐల కోటా 52 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. ఇష్యూ ధరపై 37 శాతం అధిక స్థాయిలో లిస్ట్ అయింది. కానీ, మూడు నెలల్లోనే ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులు తమ వాటాలను సగం మేర తగ్గించేసుకున్నారు. దీనికి రియల్ ఎస్టేట్ పరిస్థితులు కూడా కారణం. 2017 సెప్టెంబర్ నాటికి 26.9 శాతంగా ఉన్న వాటా.. అదే ఏడాది డిసెంబర్ చివరికి 13.2 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ స్టాక్ 30 శాతానికి పైగా నష్టపోయింది. ఇప్పటికీ ఈ స్టాక్ ధర నాటి ఐపీవో ధరతో పోలిస్తే 13 శాతం తక్కువలోనే ట్రేడవుతోంది. హడ్కో ఇష్యూ కూడా ఇదే పాఠం చెబుతోంది. హడ్కో ఐపీవోకు ఇనిస్టిట్యూషనల్ (క్యూఐబీ) విభాగం నుంచి 50 రెట్ల కంటే అధిక స్పందన వచ్చింది. లిస్టింగ్ రోజే స్టాక్ ధర 20% లాభపడడంతో ఇనిస్టిట్యూషన్స్ లాభాల స్వీకరణ చేశాయి. కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం హడ్కో మరింత రాబడులు ఇస్తుందని కొనసాగగా.. ఐపీవో ధరతో పోలిస్తే ఇప్పటికీ షేరు ధర దిగువనే ట్రేడవుతోంది. బర్గర్ కింగ్ ఐపీవోలోనూ పెద్ద ఎత్తున పాల్గొన్న హెచ్ఎన్ఐలు, క్యూఐబీలు లిస్టింగ్ తర్వాత కొంతమేర లాభాలను తీసుకున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నియంత్రణ అంశాల ప్రభావం ప్రభుత్వం ఆదేశాలు, నియంత్రణ సంస్థల ఆదేశాలూ కొన్ని కంపెనీల భవిష్యత్తును మార్చేయగలవు. వీటి పట్ల కూడా ఇన్వెస్టర్లు అవగాహనతో ఉండాలి. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల పరంగా బ్యాంకుల స్టాక్స్ కదలికలు ఉంటుంటాయి. 2015లో ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు లైసెన్స్‌లను 10 ఎన్‌బీఎఫ్‌సీలకు జారీ చేసినప్పుడు.. రూ.500 కోట్ల నికర విలువ సంతరించుకున్న మూడేళ్లలోగా పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలన్న నిబంధన విధించింది. ఈ ఆదేశాల కారణంగానే గడిచిన ఐదేళ్లలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోలకు రావాల్సి వచ్చింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గతేడాది ఐపీవోకు ముగించుకుంది. ఈ తరహా నిబంధన మాతృ సంస్థ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్ షేర్లపై ప్రభావం చూపించింది. బంధన్ బ్యాంకు కూడా ఆర్బీఐ ఆదేశాల కారణంగా ప్రభావితమైనదే. ప్రమోటర్ల వాటాలను నిబంధనల మేరకు తగ్గించుకోవాల్సి రావడం స్టాక్ ధరలపై ప్రభావం పడేలా చేసింది. లిస్ట్ అయిన ఏడాదిలోనే ప్రమోటర్లు తమ వాటాలను 40%కి తగ్గించుకోవాల్సి వచ్చింది. తమ వాటాలు తగ్గించుకునేందుకు అదనపు సమయం ఇవ్వాలని బంధన్ బ్యాంకు ప్రమోటర్లు కోరగా, ఆర్బీఐ తిరస్కరించడంతోపాటు జరిమానాలను విధించి, బ్యాంకు శాఖల విస్తరణపై కొంత కాలం పాటు ఆంక్షలను కూడా అమలు చేసింది. కనుక విధానపరమైన నిర్ణయాల ప్రభావం స్టాక్స్‌పై ఉంటుందని అర్థం చేసుకోవాలి. కనుక ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేసిన వారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి కంపెనీ మూలాలు, స్టాక్స్ విలువలు వచ్చిన ప్రతీ నూతన ఇష్యూకు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకోవడం కాకుండా.. ఆ కంపెనీ బలా, బలాలు, విలువను తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2017 బుల్ మార్కెట్ సమయంలో ప్రతాప్ స్నాక్స్ ఐపీవోకు వచ్చింది. 2016–17 ఆర్థిక సంవత్సరం లాభాలతో పోలిస్తే ఇష్యూ ధరను 200 రెట్లు అధిక స్థాయిల వద్ద నిర్ణయించింది. లిస్టింగ్ రోజు అయితే 25 శాతం లాభం ఇచ్చింది కానీ, ఏడాది కాలంలో స్టాక్ ధర నికరంగా 12.6 శాతం తక్కువకు పడిపోయింది. ఇప్పటికీ ఈ షేరు ధర నాటి ఇష్యూ ధరతో పోలిస్తే 29 శాతం తక్కువకు లభిస్తోంది. అంటే మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను ఈ కంపెనీ ప్రమోటర్లు క్యాష్ చేసుకోవడంలో సఫలమైనట్టు తెలుస్తోంది. 2016 మేలో వచ్చిన పరాగ్ మిల్క్ ఫుడ్ ఐపీవో కూడా మరో ఉదాహరణ. 2015–16 సంవత్సరపు లాభాల కంటే ఒక్కో షేరును 44 రెట్ల అధిక విలువకు కంపెనీ ఆఫర్ చేసింది. కానీ, లిస్టింగ్ రోజు 15% లాభాలను చూపించిన ఈ షేరు.. తర్వాతి సంవత్సరంలో పతనమైంది. ఎందుకంటే కంపెనీ లాభాలు 2016–17లో 80% క్షీణించడమే కారణం. నాడు ఐపీవోలో షేర్లను పొంది, అలాగే కొనసాగి ఉంటే ఇప్పటికి పెట్టుబడి నికరంగా 50% తగ్గిపోయి ఉంటుంది. ఆర్బీఎల్ బ్యాంకు కూడా ఇందుకేమీ తీసిపోలేదు. గతేడాది కరోనా తర్వాత ఎన్పీఏలు పెరిగిపోతాయంటూ బ్యాంకు యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు, రుణ ఆస్తుల నాణ్యత, వసూళ్ల సామర్థ్యాలు క్షీణించడం వల్ల షేరు ధర ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి భారీగా పతనమైంది. తర్వాత కోలుకున్నప్పటికీ.. ఐపీవో ధర కంటే ఇంకా దిగువనే ట్రేడవుతోంది. కనుక కంపెనీల ఆర్థిక మూలాలు, అంతకుముందు కొన్నేళ్లలో వాటి పనితీరు, మేనేజ్మెంట్ సామర్థ్యం, రంగం, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, పనితీరులో పురోగతి వీటన్నింటినీ చూసి ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. షేర్ల ఎంపికే లాభాలను నిర్ణయించగలవని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి. పరిస్థితులు మారిపోనూవచ్చు.. ఆయా రంగాల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పుల కారణంగా కంపెనీల లాభాలు దూసుకుపోవచ్చు. అందుకే కంపెనీ వ్యాపార మూలాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మోదీ సర్కారు మొదటి విడతలో మౌలిక రంగ కంపెనీల్లో జోరు కనిపించింది. భారత్ మాల, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఇందుకు మద్దతునిచ్చాయి. దీంతో 2015–17 కాలంలో ఇన్ఫ్రా కంపెనీల ఐపీవోల్లో కదలికలు పెరిగాయి. అదే సమయంలో వచ్చిన కెపాసిట్ ఇన్ఫ్రా ఇష్యూ అయితే భారీ స్పందనను దక్కించుకుంది. 2015లో పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, 2016లో దిలీప్‌బిల్డ్‌కాన్ పబ్లిక్ ఇష్యూలకు వచ్చి జారీ ధరతో పోలిస్తే రెట్టింపునకు పైగా ఇన్వెస్టర్లకు లాభాలను తినిపించాయి. కానీ, ఇప్పుడు చూస్తే.. వాటిల్లో కెపాసిట్ ఇన్ఫ్రా, సద్బావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, భారత్ రోడ్ నెట్వర్క్, పవర్‌మెక్ కంపెనీలు ఐపీవో ధర కంటే 13–84 శాతం తక్కువలో కోట్ అవుతున్నాయి. 2020లో చైనా వ్యతిరేక సెంటిమెంట్ కూడా కెమికల్, ఫార్మా కంపెనీలకు బాగా కలిసొచ్చింది. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్, రోసారి బయోటెక్ సంస్థల ఐపీవోలకు మంచి స్పందన రావడమే కాకుండా, లిస్టింగ్‌తో గణనీయంగా లాభపడ్డాయి కూడా. కాకపోతే ఈ తరహా ధోరణలు స్వల్పకాలమా.. లేక దీర్ఘకాలం పాటు కొనసాగుతాయా అన్న అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. -
ఐపీ‘వావ్’!
స్టాక్ మార్కెట్లో లిస్టైన తొలిరోజే కొన్ని కంపెనీలు మంచి లాభాలను ఇన్వెస్టర్లకు ఇచ్చాయి. కరోనా కల్లోల పరిస్థితులు ఉన్నా చాలా కంపెనీల ఐపీఓలు వంద రెట్లకు పైగా సబ్‌స్క్రై బయ్యాయి. అంతే కాకుండా రెట్టింపునకు పైగా లిస్టింగ్ లాభాలను సాధించాయి. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ)లకు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కొన్ని కంపెనీల లిస్టింగ్ లాభాలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ.... కరోనా కల్లోలం ఈ ఏడాది అన్ని దేశాల అర్థిక స్థితిగతులను అల్లకల్లోలం చేసింది. కానీ ఈ ఏడాది స్టాక్మార్కెట్లో అరంగేట్రం చేసిన కంపెనీలు తొలి (లిస్టింగ్)రోజు భారీ లాభాలను ఇన్వెస్టర్లకు పంచాయి. గత పదేళ్ల కాలంలో చూస్తే, ఈ ఏడాది చివరి ఆరునెలల్లో కంపెనీలు లిస్టింగ్ రోజు అత్యధిక లాభాలను(సగటున 36 శాతం మేర) ఇచ్చాయి. తొలి రోజు లిస్టింగ్ లాభాల విషయంలో 2020 తర్వాత 2007 నిలిచింది. ఆ ఏడాది తొలిరోజు సగటు లిస్టింగ్ లాభాలు 29 శాతంగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొత్తం ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లపై సగటు లాభాలు 61 శాతంగా ఉండగా, 2007లో మాత్రం 90 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 16 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.27,000 కోట్ల మేర నిధులను సమీకరించాయి. గత ఏడాది 16 కంపెనీలు రూ.12,363 కోట్లు రాబట్టాయి. 2018లో మొత్తం 24 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ.30,959 కోట్లు సమీకరించాయి. సోమవారం నాడు మొదలైన ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ ఈ నెల 27న ముగుస్తుంది. ఈ ఏడాదికి ఇదే ఆఖరి ఐపీఓగా నిలవనుంది. లిస్టింగ్... డబుల్ ధమాకా బర్గర్ కింగ్, హ్యాప్పియెస్ట్ మైండ్ షేర్లు లిస్టింగ్ రోజు రెట్టింపు లాభాలను సాధించాయి. రూట్‌మొబైల్, రోసారి బయోటెక్, కెమ్‌కాన్ స్పెషాల్టీ షేర్ల లిస్టింగ్ లాభాలు 70 శాతం నుంచి 90 శాతం రేంజ్లో ఉన్నాయి. ఇక గురువారమే స్టాక్ మార్కెట్లో లిస్టయిన మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ షేర్లు వంద శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన చివరి కంపెనీ ఇదే. హెచ్ఎన్ఐల హవా.... దేశీయ బ్రోకరేజ్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ) హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ)లకు ఆకర్షణీయమైన వడ్డీరేట్లకు రుణాలిచ్చాయని, ఈ మొత్తాలను హెచ్ఎన్ఐలు ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు గడించారని నిపుణులంటున్నారు. ఇటీవలి ఐపీఓలు సక్సెస్ కావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారంటున్నారు. ఇటీవలే ఐపీఓకు వచ్చిన మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ కంపెనీకి సంబంధించి హెచ్ఎన్ఐ కేటగిరీ వాటా 621 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. దాదాపు రూ.50,650 కోట్ల విలువైన బిడ్లు ఈ కేటగిరీ నుంచే దాఖలయ్యాయి. షేర్ ఖాన్, జేఎమ్ ఫైనాన్షియల్, బజాజ్, మోతీలాల్ ఓస్వాల్ తదితర 10 బ్రోకరేజ్ సంస్థలు రూ.40,000 కోట్లు మేర ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేశాయని సమాచారం. లిస్టింగ్ లాభాల నుంచి హెచ్ఎన్ఐలకు ప్రయోజనం కలుగుతుందని, వారికి రుణాలిచ్చిన సంస్థలకు 3–4 శాతం మేర లాభం ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలంటున్నాయి. 5 కంపెనీలు 150 రెట్లు... ఈ ఏడాది 5 కంపెనీల ఐపీఓలు 150 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. మిసెస్ బెక్టర్ ఫుడ్ స్పెషాల్టీస్, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, బర్గర్ కింగ్ ఇండియా, హ్యాప్పియెస్ట్ మైండ్ టెక్నాలజీస్, కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓలు 150–200 రెట్ల రేంజ్లో ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో కరోనా ప్రభావం పడని రం గాల కంపెనీలకు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. టెక్నాలజీ, ప్రత్యేక రసాయనాలు, తదితర కంపెనీలపై కరోనా ప్రభావం పెద్దగా పడలేదు. ఈ రంగాలకు సంబంధించిన కంపెనీల ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇలాంటి కంపెనీలపై రిటైల్ ఇన్వెస్టర్లే కాకుండా అంతర్జాతీయ సావరిన్, పెన్షన్ ఫండ్స్ కూడా భారీగానే ఇన్వెస్ట్ చేశాయి. మిసెస్ బెక్టర్స్ ఫుడ్ బంపర్ లిస్టింగ్ న్యూఢిల్లీ: మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ షేర్లు లిస్టింగ్‌లో దుమ్ము రేపాయి. ఈ షేర్ బీఎస్ఈలో ఇష్యూ ధర, రూ.288తో పోల్చితే 74% లాభంతో రూ.501 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 109% లాభంతో రూ.601 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 107% లాభంతో రూ.596 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,499 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 37.81 లక్షలు, ఎన్ఎస్ఈలో 3.7 కోట్ల షేర్లు ట్రేడయ్యా యి. ఇటీవలే ముగిసిన ఈ ఐపీఓ 198 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ కంపెనీ మిసెస్ బెక్టర్స్ క్రిమికా, ఇంగ్లిష్ ఓవెన్ బ్రాండ్లతో బిస్కెట్లు, బ్రెడ్డు, బన్లను తయారు చేస్తోంది. -
గెట్.. సెట్.. స్టార్టప్!
కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేయవచ్చు గాక, కానీ స్టార్టప్‌లకు మాత్రం జోష్‌నిచ్చింది. కరోనా కాలంలో చాలా స్టార్టప్‌ల అమ్మకాలు, లాభదాయకత అంచనాలకు మించి పెరిగాయి. దీంతో నిధుల సమీకరణ నిమిత్తం, లేదా మరింత విలువ పెంచుకోవడం కోసం (వేల్యూ అన్‌లాక్) పలు స్టార్టప్‌లు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లకు రానున్నాయి. అసలైతే రెండు, మూడేళ్ల తర్వాత గాని ఐపీఓల గురించి ఆలోచించని స్టార్టప్‌లన్నీ ఇప్పుడు ఐపీఓలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయమై సాక్షి స్పెషల్ స్టోరీ.... కరోనా వైరస్... స్టార్టప్ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రణాళికలను ముందుకు జరుపుతోంది. డిజిటల్ కామర్స్, పేమెంట్స్ కంపెనీలు ఐపీఓ మార్గంలో నిధులు సమీకరించాలని యోచిస్తున్నాయి. స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఈ ఐపీఓల ద్వారా తమ తమ వాటాలను విక్రయించనున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫార్మ్ జొమాటొ, ఫ్యాషన్ ఇటెయిలర్ నైకా, లాజిస్టిక్స్, డెలివరీ సంస్థ డెలివరీ, ఇన్సూరెన్స్ డిస్కవరీ ప్లాట్ఫార్మ్ పాలసీ బజార్, కళ్లజోళ్ల రిటైల్ చెయిన్ లెన్స్‌కార్ట్, విద్యాసేవలకు సంబంధించిన ఎడ్యుటెక్, ఆన్లైన్ ట్యూషన్ల సంస్థ బైజుస్.. ఈ సంస్థలన్నీ బాహాటంగానే తమ తమ ఐపీఓ ప్రణాళికలను వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే, ఆన్లైన్ బిల్ చెల్లింపుల సంస్థ మోబిక్విక్లు కూడా ఐపీఓ కోసం కసరత్తు చేస్తున్నాయని సమాచారం. కరోనాతో జోరు.... కరోనా కారణంగా ఈ స్టార్టప్‌ల వ్యాపారం కుదురుకోవడమే కాకుండా జోరుగా పెరిగేలా చేసిందని, అందుకే ఈ స్టార్టప్‌లు తమ ఐపీఓ ప్రణాళికలను ముందుకు జరుపుతున్నాయని నిపుణులంటున్నారు. ఈ కంపెనీల తదుపరి వ్యాపార వ్యూహం ఐపీఓయేనని వారంటున్నారు. సీఈఓగా ప్రమోషన్... ఐపీఓ కోసమే తమ కంపెనీ అమ్మకాలు, లాభదాయకత మరింతగా పెరిగాయని ఫ్యాషన్ ఇటెయిలర్ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ పేర్కొన్నారు. ఫలితంగా ఐపీఓ ప్రణాళికలను ఈ కంపెనీ ముందుకు జరిపే అవకాశాలున్నాయి. ఇక మోబిక్విక్ సంస్థ తన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చందన్ జోషిని సీఈఓగా ప్రమోట్ చేసింది. ఐపీఓ ప్రణాళిక కోసమే ఈ మార్పు జరిగిందని సమాచారం. కాగా ఐపీఓకు వచ్చేది ఖాయమేనని, అయితే ఎప్పుడనేది త్వరలోనే నిర్ణయిస్తామని బైజుస్ సీఈఓ బైజు రవీంద్రన్ ఇటీవలనే తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ విదేశాల్లో లిస్టయ్యే యోచన చేస్తోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ కంపెనీ విలువ 5,000 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీల్లో ఒక్క ఫ్లిప్‌కార్ట్‌కే నష్టాలు వస్తున్నాయి. 2019లో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్, ఈ సంస్థ హోల్‌సేల్ వ్యాపారాలకు కలిపి రూ.5,459 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరో ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌తో పోటీపడాలంటే ఐపీఓకు రావడమే ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న ఏకైక మార్గమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఐపీఓకువస్తే, ఈ స్టార్టప్‌ల విలువలు గతంలో మాదిరిగా భారీగా పెరగకపోవచ్చని విశ్లేషకులంటున్నారు. విదేశాల్లో లిస్టింగ్ ఇక ఫ్లిప్‌కార్ట్ సంస్థ విదేశాల్లో లిస్టయ్యే యోచన చేస్తోంది. ఈ కంపెనీ విలువ 5,000 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇక పాలసీ బజార్ సంస్థ న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో వచ్చే ఏడాది లిస్ట్ కావాలని కసరత్తు చేస్తోంది. 350 కోట్ల డాలర్ల విలువ సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారత కంపెనీల విదేశీ లిస్టింగ్‌కు సంబంధించి కంపెనీల సవరణ చట్టాన్ని ఇటీవలే లోక్‌సభ ఆమోదించింది. ఈ సవరణ కారణంగా భారత కంపెనీలు విదేశాల నుంచి నిధుల సమీకరణ గతంలో కంటే సులువు కానున్నది. ముందుగానే ఐపీఓకు.... ఎందుకంటే ► కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ విధించింది. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తూ వచ్చింది. ఈ కాలంలో స్టార్టప్‌ల కార్యకలాపాలు బాగా పుంజుకున్నాయి. అమ్మకాలు, లాభదాయకత పెరగడంతో పలు సంస్థలు నిధుల సమీకరణకు ఐపీఓ బాట పడుతున్నాయి. ► కరోనాకు ముందు పీఈ(ప్రైవేట్ ఈక్విటీ), వీసీ(వెంచర్ క్యాపిటల్) సంస్థల నుంచి జోరుగా పెట్టుబడులు వచ్చాయి,. కరోనా కాలంలో ఈ పెట్టుబడులు ఆగిపోయాయి. దీంతో నిధుల కోసం స్టార్టప్‌లు ఐపీఓ వైపు చూస్తున్నాయి. ► గతంలో ఆలీబాబా, టెన్సెంట్ వంటి చైనా సంస్థల నుంచి స్టార్టప్‌లకు పెట్టుబడుల వరద పారేది. మన దేశంతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడంతో చైనా నుంచి పెట్టుబడుల విషయమై భారత ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. దీంతో చైనా సంస్థల నుంచి నిధులు రావడం లేదు. ఫలితంగా స్టార్టప్‌లు తమ ఐపీఓ ప్రణాళికలను ముందుకు జరపక తప్పడం లేదు. -
నేటి నుంచి మూడు ఐపీఓలు
ప్రైమరీ మార్కెట్ మళ్లీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో కళకళలాడుతోంది. గతవారమే మూడు కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ వారం... అదీ...నేటి(మంగళవారం) నుంచి మరో మూడు ఐపీఓలు (–మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్) సందడి చేయనున్నాయి. గతవారం ఐపీఓలకు మంచి స్పందన వచ్చినట్లే ఈ ఐపీఓలకు కూడా ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభించవచ్చని అంచనా. గురువారం (అక్టోబర్ 1న) ముగిసి వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే ఈ ఐపీఓలకు సంబంధించి మరిన్ని వివరాలు... మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్న తొలి ప్రభుత్వ రంగ ఐపీఓ ఇది. రూ.135–145 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఇష్యూ సైజు రూ.444 కోట్లు. కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేయాలి. లిస్టింగ్ లాభాలు, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేయవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) 90 శాతం(రూ.125–130) రేంజ్లో ఉండటంతో లిస్టింగ్‌లో మంచి లాభాలు వస్తాయని నిపుణులంటున్నారు. యూటీఐ ఏఎమ్‌సీ ఈ వారంలో వస్తున్న అతి పెద్ద ఐపీఓ ఇదే. రూ.552–554 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,260 కోట్లు సమీకరించగలదని అంచనా. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.40–42 రేంజ్లో ఉంది. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయిల్, గ్యాస్పైప్లైన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలందించే ఈ కంపెనీ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ. 117–120గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.20 రేంజ్లో ఉంది. -
మార్చి 2 నుంచి ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ల విభాగం, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే నెల 2 నుంచి ఆరంభం అవుతుంది. అదే నెల 5న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో 13 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తారు. దీంట్లో ఎస్బీఐ 3.7 కోట్లు, కార్లైల్ గ్రూప్ 9.3 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. మార్కెట్ లాట్‌గా 19 షేర్లను నిర్ణయించారు. ఈ ఐపీఓకు ప్రైస్ బాండ్ రూ.750–755గా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్బీఐ ఉద్యోగులకు 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. జీఎమ్‌పీ రూ.320–330 వచ్చే నెల 16న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జీఎమ్‌పీ (గ్రే మార్కెట్ ప్రీమియమ్) రూ.320–330 రేంజ్లో ఉందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, డీఎస్పీ మెరిల్ లించ్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తున్నాయి. ఎస్బీఐ కార్డ్స్ కంపెనీలో ఎస్బీఐకు 76 శాతం, కార్లైల్ గ్రూప్‌నకు 24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన షేర్లను కార్లైల్ గ్రూప్, 4 శాతం వాటాకు సమానమైన షేర్లను ఎస్బీఐ విక్రయిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేసిన రెండో అతి పెద్ద కంపెనీగా ఎస్బీఐ కార్డ్స్ నిలిచింది. మన దేశ క్రెడిట్ కార్డ్‌ల మార్కెట్లో ఈ కంపెనీ వాటా 18 శాతం. ఈ కంపెనీ వినియోగదారులు 90 లక్షలకు పైగా ఉన్నారు. ఈ కంపెనీ ఐపీఓ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఈ కంపెనీ అత్యధిక వాటా ఉన్న ఎస్బీఐ షేర్ లాభపడింది. బీఎస్ఈలో 2.3 శాతం లాభంతో రూ.328 వద్ద ముగిసింది. -
సీఎస్బీ బ్యాంక్ లిస్టింగ్.. భేష్
న్యూఢిల్లీ: సీఎస్బీ బ్యాంక్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లోనూ, ముగింపులోనూ మెరుపులు మెరిపించాయి. ఇష్యూ ధర రూ.195తో పోల్చితే లిస్టింగ్‌లో 41 శాతం లాభాన్ని, ముగింపులో 54 శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. రూ.193–195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ బ్యాంక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 87 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. బుధవారం సీఎస్బీ బ్యాంక్ షేర్లు బీఎస్ఈలో ఇష్యూ ధర, రూ.195తో పోల్చితే 41 శాతం లాభంతో రూ. 275 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 57 శాతం లాభంతో రూ. 307 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 54 శాతం లాభంతో రూ.300 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 40.2 లక్షలు, ఎన్ఎస్ఈలో 3.7 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్‌రూ.5,205 కోట్లకు చేరింది. ఈ ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్ రూ.410 కోట్లు సమీకరించింది. -
ఐఆర్సీటీసీ ఐపీఓ అదుర్స్!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) సూపర్ హిట్ అయింది. గురువారం ముగిసిన ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. మందగమనం ఉన్నప్పటికీ, కంపెనీ పై భవిష్యత్తు అంచనాలు ఆశావహంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన లభించిందని నిపుణులంటున్నారు. ఈ ఐపీఓలో భాగంగా 12.6 శాతానికి సమానమైన 2 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించింది. రూ.317–320 ప్రైస్‌బ్యాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా కేంద్రానికి రూ.645 కోట్లు లభిస్తాయని అంచనా. ఈ నెల 14న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. రూ.150–200 రేంజ్లో లిస్టింగ్ లాభాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 225 కోట్ల షేర్లకు దరఖాస్తులు... మొత్తం 2 కోట్ల షేర్లకు గాను 225 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తం సమీకరణ విలువ రూ.645 కోట్లు కాగా... దాదాపు రూ.72,000 కోట్ల విలువైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల(క్విబ్)కు కేటాయించిన వాటా 109 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 355 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 14.65 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్న రెండో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యంత విజయవంతమైన ఐపీఓ ఇదే. క్విబ్, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల, ఉద్యోగుల వాటాల విషయంలో అత్యధిక బిడ్లు వచ్చాయి. రైల్వేలకు కేటరింగ్ సర్వీసులు అందించే ఏకైక కంపెనీ.. ఐఆర్‌సీటీసీయే. ఆన్లైన్ రైల్వే టికెట్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను ఈ కంపెనీ విక్రయిస్తోంది. -
ఈ ఏడాదే ఎన్ఎస్ఈ ఐపీఓ
కోల్‌కతా: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రానున్నదని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ లిమాయే చెప్పారు. కో–లొకేషన్ సర్వర్ సంబంధిత వివాదం త్వరలో పరిష్కారమవ్వగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ఐపీఓకు అడ్డంకిగా ఉన్న ఈ వివాదం సమసిపోగానే ఐపీఓకు వస్తామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తమ ఐపీఓ ఉండగలదని ఆయన అంచనా వేస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నామని, సోషల్ మీడియా డేటా, ట్రేడింగ్ పోకడలపై నిఘాకు కృత్రిమ మేధ వినియోగంపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. ఎక్సే్చంజ్, ఇతర వ్యాపారాల కోసం కంపెనీల కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, కో–లొకేషన్ సర్వర్ సంబంధిత విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ, సీబీఐలు విచారణ జరుపుతున్న నేపథ్యంలో రూ.10,000 కోట్ల ఎన్ఎస్ఈ ఐపీఓ జాప్యం అవుతోంది. మామూలుగానైతే ఈ ఐపీఓ ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చి మధ్య రావలసి ఉంది. ఎన్ఎస్ఈ కో–లొకేషన్ సర్వర్‌ను కొందరు బ్రోకర్లు అక్రమంగా యాక్సెస్ చేసుకొని లబ్ధిపొందారన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరుగుతోంది. ఓలా నష్టం పెరిగింది.. న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఓలా నష్టాలు 2016–17 ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరిగాయి. రూ. 4,898 కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలు రూ. 3,148 కోట్లు. తాజాగా ఆదాయం 70% పెరిగి రూ. 811 కోట్ల నుంచి రూ. 1,381 కోట్లకు చేరాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి దాఖలు చేసిన పత్రాల ప్రకారం కంపెనీ ప్రకటన వ్యయాలు 35 శాతం తగ్గగా, ఉద్యోగులపై వ్యయాలు 24 శాతం పెరిగాయి. -
ముందే కట్ అవదు కాబట్టి... వెనక్కు రాలేదన్న బాధ ఉండదు
ఉమెన్ ఫైనాన్స్ / ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ కంపెనీలు ఏవైనా తమ అవసరాలకు తగిన పెట్టుబడులను సమకూర్చుకోడానికి పబ్లిక్ షేర్లను ఆఫర్ చేస్తుంటాయి. (ఉదా: కొత్త కంపెనీ పెట్టడానికి, ఉన్న కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికి, ఇతరత్రా అభివృద్ధి అవసరాల కోసం). అలా కంపెనీ ప్రకటించిన షేర్లను ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్’ (ఐ.పి.ఓ.లు) విధానంలో కంపెనీ నుంచి నేరుగా పొందవచ్చు. ఈ ఐ.పి.ఓ.ల ద్వారా షేర్లకు దరఖాస్తు చేయదలచుకున్న వారు తప్పనిసరిగా ఎ.ఎస్.బి.ఎ. (అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పద్ధతి వివరాలను చూద్దాం. సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) 2016 జనవరి 1 నుంచి ఐ.పి.ఓ. షేర్లను ఎ.ఎస్.బి.ఎ. పద్ధతిలో దరఖాస్తు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఎ.ఎస్.బి.ఎ. పద్ధతిలో ఐ.పి.ఓ.లకు దరఖాస్తు చేసినప్పుడు ఖాతాదారుని బ్యాంకు అకౌంటు నుండి.. ఎన్ని షేర్లకైతే దరఖాస్తు చేశారో ఆ మొత్తం ఆ ఐ.పి.ఓ.కి బదలీ కాదు. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోనే ఉంచి బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎప్పుైడె తే ఖాతాదారునికి అలాట్మెంట్ జరుగుతుందో ఆ అలాట్మెంట్ మొత్తం వరకు మాత్రమే బ్యాంకు అకౌంట్ నుండి బదలీ చేస్తారు. (బ్యాంకు ఖాతాలో సొమ్ము బ్లాక్ చేసి ఉన్నప్పటికీ). దరఖాస్తు చేసిన తేదీ నుండి షేర్ల అలాట్మెంట్ తేదీ వరకు ఖాతాదారునికి బ్యాంకు వారు వడ్డీని యథాతథంగా అందజేస్తారు. పాత పద్ధతిలో అయితే ఖాతాదారుడు వడ్డీని నష్టపోవలసి వచ్చేది. అలాగే దరఖాస్తు చేసినప్పటికీ అలాట్మెంట్ జరగకపోతే ఆ సొమ్ము మళ్లీ వెనక్కు వచ్చే సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చేది. బ్యాంకులు ఏవైతే ఈ ఎ.ఎస్.బి.ఎ. సర్వీసును అందజేయడానికి అనుమతి పొంది ఉంటాయో వాటిని ఎస్.సి.ఎస్.బి.లు (సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంకులు) అంటారు. ఈ ఎస్.సి.ఎస్.బి.లు ఏయే బ్రాంచీలలో ఎ.ఎస్.బి.ఎ. సర్వీసును అందజేస్తాయో ఆ బ్రాంచీలలో ఎస్.ఎస్.బి.ఎ. అప్లికేషన్‌ను దాఖలు చేయవచ్చు. ఖాతాదారులు ఏ ఎస్.సి.ఎస్.బి.లోనైతే తమ బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నారో ఆ ఎస్.సి.ఎస్.బి. బ్రాంచిలలో మాత్రమే ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్‌ను అందజేయాలి. వేరే బ్యాంకులలో అనుమతించరు. ఒక్కొక్క ఐ.పి.ఓ. కి 5 దరఖాస్తుల వరకు ఒక బ్యాంకు ఖాతా ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత బిడ్డింగ్ సమయంలోనే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. విత్‌డ్రా చేసిన వెంటనే బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం లోంచి అప్లై చేసిన మొత్తం మేరకు అన్‌బ్లాక్ అవుతుంది. అదే బిడ్డింగ్ చివరి రోజు ముగిసిన తర్వాత విత్‌డ్రా చేస్తే మాత్రం వెంటనే అన్‌బ్లాక్ అవదు. ఆ ఐ.పి.ఓ. తాలూకు రిజిస్ట్రార్ సూచనల మేరకు అలాట్మెంట్ అంతా ముగిసిన తర్వాత అన్ బ్లాక్ అవుతుంది. ఖాతాదారుని బ్యాంకుకు కోర్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే కనుక ఖాతాదారు తన బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచిలోనే కాకుండా, ఆ బ్యాంకు వారు నిర్ణయించిన వేరే బ్రాంచీలలో కూడా ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్ ఇవ్వొచ్చు. ఏ ఐ.పి.ఓ.కైనా ఖాతాదారులు ఎన్.ఎస్.ఇ., బి.ఎస్.ఇ., వెబ్సైట్ల నుండి ఎ.ఎస్.బి.ఎ. ఇ-ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్.సి.ఎస్.బి. జాబితాని, వాటి బ్రాంచీల లిస్టుని ఎన్.ఎస్.ఇ., బి.ఎస్.ఇ., సెబీ సైట్ ల నుండి పొందవచ్చు. ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్ నింపేటప్పుడు జాగ్రత్తగా అన్ని వివరాలను (పేరు, పాన్ నెంబరు, డీమ్యాట్ అకౌంట్ నెంబరు, బిడ్ రేట్, బిడ్ క్వాంటిటీ తదితర వివరాలు) పొందుపరచవలసి ఉంటుంది. వీటిల్లో ఏ మాత్రం తప్పు ఉన్నా దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది. ఐ.పి.ఓ.కి దరఖాస్తు చేసేటప్పుడు ఆ కంపెనీ వివరాలను పరిశీలించి అలాగే, రేటింగ్ వివరాలను తెలుసుకొని అప్లై చెయ్యడం మంచిది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’