ఈ వారం రెండు ఐపీఓలు | Two IPO this week | Sakshi
Sakshi News home page

ఈ వారం రెండు ఐపీఓలు

Published Mon, Mar 6 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

ఈ వారం రెండు ఐపీఓలు

ఈ వారం రెండు ఐపీఓలు

మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌.. రూ.400 కోట్లు  
అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌.. రూ.1,870 కోట్లు


న్యూఢిల్లీ: ఈ వారంలో రెండు కంపెనీల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)లు రానున్నాయి. రేడియో సిటీ ఎఫ్‌ఎం రేడియో చానళ్లన్నీ నిర్వహించే జాగరణ్‌ ప్రకాశన్‌ గ్రూప్‌కు చెందిన మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్, డి–మార్ట్‌ రిటైల్‌ సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌లు ఈ ఐపీఓల ద్వారా రూ.2,300 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నాయి.

ఈ నెల 6 నుంచి మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఐపీఓ
దేశవ్యాప్తంగా 37 నగరాల్లో రేడియో సిటీ బ్రాండ్‌ కింద ఎఫ్‌ంఎ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న మ్యూజిక్‌  బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ ఐపీఓ ఈ నెల 6 న ప్రారంభం కానున్నది. 8వ తేదీన ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు, ఆఫర్‌  ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో 26.59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ధరల శ్రేణి రూ.324–333గా కంపెనీ నిర్ణయించింది.  ఈ నెల 17న స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావచ్చని అంచనా. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను..లిస్టెడ్‌ నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఉపసంహరణకు వినియోగిస్తారు. గత శుక్రవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ రూ.146 కోట్లు సమీకరించింది.

ఈ నెల 8 నుంచి డి–మార్ట్‌ ఐపీఓ
డి–మార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఐపీఓ ఈ నెల 8న ప్రారంభం అవుతుంది. ఈ నెల 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. ధరల శ్రేణిని రూ.295–299గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 21న స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావచ్చని అంచనా.  గతేడాది రూ.3,000 కోట్ల పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement