
రానున్న ఐపీఓలు, ఎస్‌ఎంఈ ఐపీఓలు, ఎన్‌సీడీలు, బాండ్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘ఐపీఓ గైడ్’ యాప్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
♦ రన్నింగ్/అప్‌కమింగ్ ఐపీఓల సమాచారం తెలుసుకోవచ్చు.
♦ రానున్న ఎస్‌ఎంఈ ఐపీఓలు, ఎన్‌సీడీలు, బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు చూడొచ్చు.
♦ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన స్టాక్ టిప్స్ పొందొచ్చు.
♦ ఐపీఓలో పాల్గొన్నవారు అలాట్‌మెంట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. అలాగే రానున్న ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నవారు బేసిక్ వివరాలు అందిస్తే సంస్థ ఎగ్జిక్యూటివ్స్ ఐపీఓ/ఎన్‌సీడీ/బాండ్ల దరఖాస్తుకు సహాయపడతారు.
♦ యాప్‌లో ఐపీఓ/ఎన్‌సీడీ/ ఎస్‌ఎంఈ ఐపీఓ/ బాండ్లకు సంబంధించిన ఐపీఓ తేదీ, ప్రైస్ బ్యాండ్, లిస్టింగ్ తేదీ, సబ్‌స్క్రిప్షన్ వివరాలు, కంపెనీ సమాచారం వంటి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
♦ ఐపీఓల పనితీరు ఎలా ఉందో గమనించొచ్చు.
♦ ఐపీఓ ఎప్పుడు ప్రారంభమౌతుంది.. ఎప్పుడు ముగుస్తుంది.. ఎప్పుడు లిస్టవుతుంది.. వంటి విషయాలను అలర్ట్స్ రూపంలో పొందొచ్చు.
♦ ఐపీఓ క్యాలెండర్ కూడా అందుబాటులో ఉంది.
గమనిక: కేవలం ఈ యాప్ ఆధారంగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి.
Comments
Please login to add a commentAdd a comment