టెలికాం మార్కెట్, ఫీచర్ ఫోన్ సెగ్మెంట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, ఇక డీటీహెచ్ స్పేస్‌లోనూ తన హవా చాటేందుకు వచ్చేస్తోంది. జియోహోమ్ టీవీ సర్వీసు కింద జియో ఎస్‌డీ, హెచ్‌డీ ఛానల్స్‌ను రూ.400కే అందించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టెలికాంటాక్ రిపోర్టు ప్రకారం జియో రూ.200కు ఎస్‌డీ ఛానల్స్‌ను, రూ.400కు ఎస్‌డీప్లస్‌హెచ్‌డీ ఛానల్స్‌ను జియోహోమ్ టీవీ సర్వీసుతో ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. అయితే జియోహోమ్ టీవీ సర్వీసులను ప్రత్యేకంగా అందించనుందని రిపోర్టు చెబుతోంది. కంపెనీ ఎప్పటి నుంచో సొంతంగా డీటీహెచ్ సర్వీసులను భారత్‌లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
జియోహోమ్ టీవీ సర్వీసులు, ఎప్పటి నుంచో మార్కెట్‌లో రూమర్లు కొడుతున్న జియో సెటాప్ బాక్స్ సర్వీసులను రీప్లేస్ చేయనున్నాయా? లేదా వీటిని వేరుగా లాంచ్ చేయనుందా? అనేది క్లారిటీగా తెలియరాలేదు. రిపోర్టుల ప్రకారం మెరుగైన మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్ మల్టీకాస్ట్ సర్వీస్(ఈఎంబీఎంఎస్) కింద జియోహోమ్ టీవీ రన్ అవనున్నట్టు తెలిసింది. ఈఎంబీఎంఎస్ అనేది హైబ్రిడ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఒకే సారి పెద్ద మొత్తంలో యూజర్లను పొందగలదు. గత రెండేళ్లుగా ఈ సర్వీసులను జియో టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో క్వార్టర్‌లో రానున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment