సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన జియో కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 31 బిలిలయన్ డాలర్ల(రూ.1,99,779కోట్లు) పెట్టుబడుల అనంతరం రిలయన్స్ జియో ఇన్‌షియల్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. 2018 చివరిలో కాని, 2019 ప్రారంభంలో కాని జియోను ఐపీఓకి తీసుకురావాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తున్నట్టు రిపోర్టులు తెలిపాయి. జియో ఐపీఓ కోసం అంతర్గత చర్చలు కూడా ప్రారంభమైనట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో నేటి మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 0.29 శాతం లాభంలో రూ.918.60 వద్ద ముగిసింది.
2017 సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ.270.59 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. గత సెప్టెంబర్‌లో ఈ కంపెనీని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. అప్పటి నుంచి కంపెనీ సబ్‌స్క్రైబర్ బేస్ 138.6 మిలియన్లకు పెరిగింది. టెలికాం సర్వీసుల ప్రారంభం అనంతరం రిలయన్స్ జియో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీగా పేరులోకి వచ్చింది. సగటున రోజుకు ఆరు లక్షల సబ్‌స్క్రైబర్లను యాడ్ చేసుకుంటోంది. 29 రాష్ట్రాల్లో 18వేలకు పైగా అర్బన్, రూరల్ టౌన్లలో, 2 లక్షలకు పైగా గ్రామాల్లో జియో తన కార్యకలాపాలు సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment