రిలయన్స్ జియో (ఆర్‌జియో) లిస్టింగ్ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిలయన్స్ జియో సహా డిజిటల్ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు) తన పేరిట బదలాయించుకోనుంది. ప్రతిగా అను బంధ సంస్థలో పూర్తి వాటాలను దక్కించుకోనుంది. దీనితో ఆర్‌ఐఎల్‌కు రిలయన్స్ జియో 100%అనుబంధ సంస్థగా (డబ్ల్యూవోఎస్) మారుతుంది. ఈ ప్రతిపాదనకు జియో పేరిట రుణాలిచి్చన బ్యాంకులు, డిబెంచర్ హోల్డర్లు అనుమతి వచ్చినట్లు ఆర్‌ఐఎల్ తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే 2020 మార్చి 31 నాటికి స్పెక్ట్రం పరంగా చెల్లించాల్సిన చెల్లింపులు తప్పితే.. రిలయన్స్ జియో పూర్తి రుణ రహిత సంస్థగా మారుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment