Digital Business
-
డిజిటల్ కాయిన్ పేరుతో భారీ మోసం
సాక్షి, చెన్నై: డిజిటల్ కాయిన్ సంస్థ నడిపి కోట్ల రూపాయలు మోసానికి పాల్పడిన కేసుకు సంబంధించిన ఆరుగురు నిందితుల సొంతమైన ఇల్లు, కార్యాలయాలలో ఆర్థిక నేర విభాగం పోలీసులు సోదాలు నిర్వహించారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా కావేరిపట సమీపంలోని వరట్టపట్టికి చెందిన ప్రకాశ్ (46) నేతృత్వంలో 60 మందికిపైగా గత 9వ తేది కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి కలెక్టర్ జయచంద్ర బాను రెడ్డి వద్ద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. యునివర్ కాయిన్ పేరిట డిజిటల్ కాయిన్ సంస్థను నిర్వహిస్తూ వచ్చిన హోసూర్ రామకృష్ణా నగర్‌కు చెందిన అరుణ్ కుమార్, కృష్ణగిరికి చెందిన నందకుమార్, మత్తూర్కు చెందిన శంకర్, ప్రకాశ్ బర్గూర్ సమీపంలోని చెట్టిపట్టికి చెందిన శ్రీనివాసన్, ధర్మపురి జిల్లా మారండహల్లికి చెందిన వేలన్ తదితరులు తనను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. డిజిటల్ కాయిన్ కొనుగోలు చేస్తే, తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చని తెలిపి లక్షలాది రూపాయలు కట్టించుకుని తమను మోసం చేసినట్లు చెప్పారన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా కృష్ణగిరి జిల్లా ఆర్థిక నేర విభాగం పోలీసులకు కలెక్టర్ ఆదేశించారు. ఈస్థితిలో ఆదివారం ఉదయం కృష్ణగిరి జిల్లా ఆర్థిక నేర విభాగం డీఎస్పీ శివకుమార్, సేలం జిల్లా ఆర్థిక నేర విభాగం డీఎస్పీ శ్రీనివాసన్, ఇన్స్పెక్టర్ ముత్తమిళ సెల్వన్, కృష్ణగిరి ఇన్స్పెక్టర్ వివేకానందమ్ అధ్యక్షతన కృష్ణగిరి, సేలం ధర్మపురి, నామక్కల్, ఈరోడ్ జిల్లాల నేర విభాగం పోలీసు ఇన్స్పెక్టర్లు 50 మందికి పైగా డిజిటల్ కాయిన్ పేరిట మోసాలకు పాల్పడిన వారి ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. వివిధ రికార్డులు, ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చదవండి: హాస్టల్ విద్యార్థినుల వీడియోల లీక్ దుమారం: స్నానం చేస్తూ నాలుగు వీడియోలు పంపిందంతే! -
డిజిటల్ సెక్టార్లో భారీ ఉద్యోగాలు!
ముంబై: జావా, క్లౌడ్, డేటా అనలిటిక్స్, ప్లాట్‌ఫాం టెక్నాలజీల్లాంటి డిజిటల్ నైపుణ్యాలకు గణనీయంగా డిమాండ్ పెరిగిందని డేటా కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ట్ కార్ప్ ఒక నివేదికలో వెల్లడించింది. గత త్రైమాసికం నుంచి ఈ ధోరణి గణనీయంగా కనిపిస్తోందని పేర్కొంది. టెక్నాలజీలో ప్రతిభావంతులను దక్కించుకునేందుకు సంస్థల మధ్య అసాధారణ పోటీ నెలకొందని వివరించింది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతున్న పరిస్థితుల్లో.. వివిధ రంగాల కంపెనీలు తమ సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్ధుల దరఖాస్తులు, ఉద్యోగాల ఖాళీలను సరిపోల్చి చూసే తమ అప్లికేషన్ ట్రాకింగ్ వ్యవస్థలోని డేటా ఆధారంగా క్వెస్ట్ కార్ప్ దీన్ని రూపొందించింది. జూన్–సెప్టెంబర్ మధ్య కాలంలో ధోరణులను సెప్టెంబర్–నవంబర్ మధ్య కాలంతో పోల్చి ఈ నివేదికను తయారు చేశారు. రిక్రూట్మెంట్కి డిమాండ్ ఈ నివేదిక ప్రకారం.. టెక్నాలజీ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు కూడా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తున్నాయి. దీంతో గతంతో పోలిస్తే మరింత భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకుంటున్నాయి. రాజీనామాల ద్వారా పెరిగే ఖాళీల సమస్య తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ సంస్థలకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ఇన్సైట్ ప్రకారం దేశీ ఐటీ సర్వీసుల పరిశ్రమకి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో స్థూలంగా 4,50,000 మంది పైచిలుకు సిబ్బంది జతకానున్నట్లు క్వెస్ట్ కార్ప్ తెలిపింది. డిజిటల్ డీల్స్ ఊతం.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో డిజిటల్ నైపుణ్యాలకు గణనీయంగా డిమాండ్ పెరిగింది. టాప్ 5 టెక్నాలజీల్లో ఎప్పట్లాగే జావా కొనసాగుతుండగా .. క్లౌడ్ ఇన్ఫ్రా, డేటా అనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ భారీగా నెలకొంది. డిజిటల్‌కు మారేందుకు సంస్థలు భారీ స్థాయిలో డీల్స్ కుదు ర్చుకుంటూ ఉండటం, హైబ్రిడ్ క్లౌడ్ వినియోగం మొదలైనవి 2021 ఆఖర్లో వ్యాపారాల పనితీరు మెరుగుపడేందుకు, నియామకాలు పెరిగేందుకు దోహదపడ్డాయని క్వెస్ట్ కార్ప్ పేర్కొంది. చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!! -
Infosys: ఈ కామర్స్ స్పెషల్.. ఈక్వినాక్స్ సొల్యూషన్స్
న్యూఢిల్లీ: కంపెనీలు తమ డిజిటల్ వాణిజ్య సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా ఈక్వినాక్స్ పేరిట కొత్త సొల్యూషన్స్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. గడిచిన రెండేళ్లుగా ప్రయోగదశలో దీనికి మంచి స్పందన వచ్చిందని ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్మేష్ వాస్వాని తెలిపారు. ఈ రంగాలకు అనువుగా ప్రస్తుతం ఏటా 15 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ–కామర్స్ లావాదేవీల నిర్వహణకు పలు అంతర్జాతీయ సంస్థలు దీన్ని ఉపయోగిస్తున్నాయని కర్మేష్ వాస్వాని పేర్కొన్నారు. రిటైల్, టెలికం, ఆటోమోటివ్, తయారీ, మీడియా స్ట్రీమింగ్ తదితర సంస్థల కోసం ఈక్వినాక్స్ అనువుగా ఉంటుందని వాస్వాని వివరించారు. ఇన్ఫీ ఆదాయంలో దాదాపు 15 శాతం వాటా ప్రస్తుతం రిటైల్ విభాగానిదే ఉంటోంది. అటు డిజిటల్ టెక్నాలజీ సంబంధ సర్వీసులు, సొల్యూషన్స్ వాటా 48.5 శాతంగా ఉంది. చాలా మటుకు కంపెనీలకు డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఉన్నప్పటికీ.. చురుగ్గా వ్యవహరించగలిగే చిన్న స్థాయి డిజిటల్ సంస్థల నుంచి వాటికి ముప్పు పొంచి ఉందని వాస్వాని వివరించారు. వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు పెద్ద కంపెనీలు ..సంక్లిష్టమైన తమ ప్లాట్‌ఫాంలను సులభతరంగా మార్చుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం ఈక్వినాక్స్ ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్! -
డిజిటల్ ట్యాక్స్‌పై కేంద్రం వెనకడుగు
న్యూఢిల్లీ: సమాన అవకాశాలు కల్పించే దృష్టితో విదేశీ ఈ కామర్స్ సంస్థలపై అమలు చేస్తున్న 2 శాతం డిజిటల్ పన్ను విషయంలో కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. భారత అనుబంధ విభాగాల ద్వారా విదేశీ ఈ కామర్స్ సంస్థలు విక్రయాలు నిర్వహిస్తే డిజిటల్ పన్ను ఉండదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సవరించిన ఆర్థిక బిల్లు 2021లో కేంద్రం స్పష్టతనిచ్చింది. భారత్‌లో శాశ్వత విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నా లేదా ఇక్కడ ఆదాయపన్ను చెల్లిస్తున్నా 2 శాతం సమానత్వలెవీని చెల్లించక్కర్లేదని కేంద్రం పేర్కొంది. అయితే భారత్‌లో ఆదాయపన్ను చెల్లించకుండా ఈ కామర్స్ విక్రయాలు చేపట్టే విదేశీ సంస్థలపై ఇక ముందూ 2 శాతం పన్ను కొనసాగుతుందని స్పష్టం చేసింది. వార్షిక ఆదాయాలు రూ.2 కోట్లు దాటిన విదేశీ సంస్థలపై డిజిటల్ ట్యాక్స్‌ను 2020 ఏప్రిల్‌లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం గమనార్హం. ‘సవరణ ద్వారా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. భారత్‌లో నివసించే వారికి సంబంధించిన వస్తువులపై సమానత్వ పన్ను అమలు కాదు. భారత్‌లో పన్నులు చెల్లించే భారత వ్యాపార సంస్థలు.. అదే సమయంలో భారత్‌లో ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఈ–కామర్స్ విక్రయాలు నిర్వహించే విదేశీ కంపెనీల మధ్య సమాన అవకాశాల కోణంలోనే దీన్ని ప్రవేశపెట్టాం’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. డిజిటల్ ట్యాక్స్ అన ్నది అమెరికా కంపెనీల పట్ల వివక్ష చూపించడమేనంటూ అమెరికా గతంలో ఆరోపించింది. భారత రేటింగ్ తగ్గదు భారత్‌కు పెట్టుబడుల రేటింగ్ కొనసాగుతుందని.. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు అవకాశాల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం, అధిక జీడీపీ వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ పెట్టుబడులు, తక్కువ ద్రవ్యలోటు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచే అంశాలుగా పేర్కొన్నారు. యూపీఏ హయంలో 2009–14 మధ్య సగటు జీడీపీ 6.7 శాతంగా ఉంటే, ఎన్డీఏ హయాంలో 2014–19 మధ్య 7.5 శాతంగా ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ హయంలోని యూపీఏ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యçస్తం చేయగా, మోదీ సర్కారు దీన్ని సరైన దారిలో పెట్టినట్టు తెలిపారు. ఆర్థిక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఆర్థిక బిల్లు 2021కి రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు వచ్చింది. చర్చలో భాగంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతారామన్ సమాధానమిచ్చారు. చర్చ అనంతరం మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బడ్జెట్ 2021–22కు పార్లమెంటు ఆమోదం పూర్తయింది. పీఎఫ్ సభ్యులకు పన్ను లేని చందా రూ.5 లక్షలకు పెంచడం సహా పలు సవరణలను బిల్లులో ప్రతిపాదించారు. -
డిజిటల్ బంగారం.. భద్రమేనా?
బంగారం అంటే ఆభరణమే కానక్కర్లేదు. పెట్టుబడి సాధనంగా బంగారానికి మన దేశంలో ఆదరణ పెరిగిపోతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో బంగారం ధరల ర్యాలీ.. ఇన్వెస్టర్లలో కొత్త విశ్వాసాన్ని చిగురింపజేసింది. 3,000 సంవత్సరాల నుంచి బంగారానికి విలువైన లోహంగా గుర్తింపు ఉంది. మన దేశంలో బంగారం ఆభరణాలు కుటుంబ ఆస్తిలో భాగం. దీనికి తోడు పెట్టుబడి సాధనంగానూ డిమాండ్ పెరుగుతోంది. గతేడాది కరోనా మహమ్మారి సమయంలోనూ బంగారంలో డిజిటల్ పెట్టుబడులు కొనసాగడం దీన్నే సూచిస్తోంది. డిజిటల్ గోల్డ్‌తోపాటు గోల్డ్ ఈటీఎఫ్‌లు, బంగారంపై ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడులకు అందుబాటులో ఉన్న ‘బంగారం’ సాధనాలపై వివరాలను అందించే çసాక్షి ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. సహజంగా బంగారాన్ని భౌతిక రూపంలో (ఆభరణాలు, కాయిన్లు) కొనుగోలు చేసుకుని భద్రపరుచుకోవడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనికితోడు సార్వభౌమ బంగారం బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ కూడా ఆదరణ పొందుతోంది. ఇటీవలి కాలంలో బంగారానికి పెట్టుబడి దృష్ట్యా డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ.. డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుండడం ఆసక్తికరం. మరి డిజిటల్ గోల్డ్ సంగతేంటి..? ఆభరణాల కోసమైతే ఫర్వాలేదు. అలా కాకుండా పెట్టుబడి కోణంలో భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వాటి స్వచ్ఛత ఎంతన్నది గుర్తించడం కష్టం. భద్రంగా దాచుకోవడం కూడా సమస్యే. అవసరమొచ్చి విక్రయించాలనుకుంటే ఆ బంగారానికి ఎంత విలువ కడతారన్నది చెప్పలేము. కానీ, డిజిటల్ గోల్డ్‌కు ఇటువంటి సమస్యలేవీ లేవు. ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. బీమా సదుపాయం కలిగిన ఖజానాల్లో వీటిని భౌతిక రూపంలో విక్రయదారే భద్రపరుస్తారు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు సులభంగా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు. వేదికలు... మన దేశంలో డిజిటల్ గోల్డ్‌ను ప్రధానంగా మూడు సంస్థలు అందిస్తున్నాయి. అవి ఆగ్మంట్ గోల్డ్, ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డిజిటల్ గోల్డ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (సేఫ్ గోల్డ్ బ్రాండ్‌పై). వీటి తరఫున గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎమ్, గ్రోవ్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, అమెజాన్ ఇండియా తదితర సంస్థలు తమ వేదికలపై డిజిటల్ గోల్డ్ కొనుగోలు అవకాశాలను కల్పిస్తున్నాయి. అంటే ఈ వేదికలపై కొనుగోళ్లు, అమ్మకాలు పైన చెప్పుకున్న మూడు సంస్థల తరఫున నడుస్తుంటాయి. ఆర్డర్ చేసిన తర్వాత.. అంత మొత్తానికి సరిపడా బంగారాన్ని ఈ సంస్థలు భౌతిక రూపంలో కొనుగోలు చేసి ఇన్వెస్టర్ పేరు మీద ఖజానాల్లో భద్రపరుస్తాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం, మొబైల్ నుంచే సు లభంగా పెట్టుబడులకు వీలుండడం డిజిటల్ గోల్డ్ పట్ల ఇన్వెస్టర్లను ఆకర్షించే అంశాలని చెప్పుకోవాలి. డిజిటల్ బంగారంలో ట్రేడింగ్ గ్రోవ్, పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్‌పే, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లేదా మోతీలాల్ ఓస్వాల్ సెక్యూ రిటీస్ మరే ఇతర సంస్థ అయినా కావచ్చు.. ఆయా ప్లాట్ఫామ్లో యూజర్ అయిఉండాలి. కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవాలనుకుంటే.. గ్రాములు లేదా రూపాయి వ్యాల్యూలో కొనుగోలు చేసుకోవచ్చు. పేమెంట్ విధానాన్ని ఎంచుకుని చెల్లింపులు చేస్తే సరిపోతుంది. బ్యాంకు ఖాతా, కార్డులు లేదా వ్యాలెట్ నుంచి అయినా చెల్లింపులు చేయవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా మీ బంగారాన్ని విక్రయించుకోవచ్చు. స్వచ్ఛంగా.. భౌతికంగా అందుకోవచ్చు.. ఒకవేళ విక్రయించుకునే ఉద్దేశం లేకుండా.. భౌతిక రూపంలో డెలివరీ తీసుకోవాలనే అనుకుంటే ఆ సదుపాయం కూడా ఈ వేదికల రూపంలో అందుబాటులో ఉంది. కాయిన్లు లేదా బులియన్ (బ్రిక్ ) రూపంలో మీ ఇంటి వద్దకే డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. డెలివరీ చార్జీలను కస్టమరే భరించాలి. స్వచ్ఛత/చార్జీలు ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ, సేఫ్గోల్డ్ రెండూ 24 క్యారట్ బంగారాన్ని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. స్వచ్ఛత విషయానికొస్తే ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ 99.9 శాతం ప్యూరిటీ బంగారాన్ని ఇస్తుండగా.. సేఫ్గోల్డ్ మాత్రం 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్‌ను ఆఫర్ చేస్తోంది. ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తే నిల్వ కోసం ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఐదేళ్ల వరకు ఉచితంగా స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని బంగారం కాయిన్లలోకి మార్చి డెలివరీ తీసుకోవాలి లేదా విక్రయించడం తప్పనిసరి. అకౌంట్ అచేతనంగా మారకుండా ఉండాలంటే ఆరు నెలలకు ఒక లావాదేవీ అయినా నిర్వహించాలి. ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌పై సేఫ్గోల్డ్ సంస్థ అందించే బంగారాన్ని కొనుగోలు చేస్తే మాత్రం స్టోరేజీ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. మొదటి రెండేళ్లకు ఎటువంటి చార్జీల్లేవు. మొదటిసారి కొనుగోలు చేసిన తేదీ నుంచి సరిగ్గా రెండేళ్లకు బంగారం 2 గ్రాములు అంతకంటే తక్కువే ఉంటే ప్రతీ నెలా విలువపై 0.05 శాతం చార్జీ కింద చెల్లించాలి. గోల్డ్ బ్యాలన్స్ నుంచి దీన్ని ప్రతీ నెలా మినహాయించుకుంటారు. గరిష్టంగా ఏడేళ్ల వరకు డిజిటల్ రూపంలో గోల్డ్‌ను సేఫ్గోల్డ్ వద్ద కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత డెలివరీ తీసుకోవడం లేదా విక్రయించడం చేయాలి. డిజిటల్ రూపంలో ఉంచుకోవాలనుకుంటే విక్రయించి మర్నాడు మళ్లీ కొనుగోలు చేయడం ఒక మార్గం. పెట్టుబడికి డిజిటల్ గోల్డ్‌తో పోలిస్తే మెరుగైన సాధనాలు ఉన్నాయి. బంగారం సౌర్వభౌమ బాండ్లను పరిశీలించొచ్చు. ఇందులో ప్రవేశ సమయంలో బంగారం మార్కెట్ ధర ఆధారంగా కేటాయింపులు చేస్తారు. గడువు తీరిన తర్వాత కూడా మార్కెట్ ధర ఆధారంగానే చెల్లింపులు చేస్తారు. దీనికితోడు వార్షికంగా 2.5% వడ్డీని చెల్లిస్తారు. కాకపోతే లాభాలపై పన్ను లేకపోవడం ఆకర్షణీయం. గోల్డ్ ఈటీఎఫ్‌లో అయితే లిక్విడిటీ పరంగా సమస్యఉండదు. క్రయ, విక్రయాలు అన్ని ట్రేడింగ్ రోజుల్లోనూ చేసుకోవచ్చు. ఫోన్‌పే ► ఫోన్‌పే సంస్థ అటు సేఫ్గోల్డ్ నుంచి.. ఇటు ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ వేదికల నుంచి డిజిటల్ గోల్డ్ కొనుగోలు అవకాశాలను అందిస్తోంది. అప్పుడు ప్రతీ లాకర్‌ను విడివిడిగా నిర్వహిస్తారు. ► రూపాయి లేదా 0.001 గ్రాము నుంచి బంగారాన్ని కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. ► కనీసం రూ.5 గోల్డ్ కలిగి ఉండాలి. ఒకే రోజు కొనుగోలు చేసిన డిజిటల్ గోల్డ్‌ను అదే రోజు అమ్మలేరు. ► యాప్‌లో కనిపించే బంగారం ధరలో కస్టమ్స్ డ్యూటీలు, పన్నులు కూడా కలిసే ఉంటాయి. ► గ్రాము పరిమాణం నుంచి కాయిన్ లేదా పెండెంట్ రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. పేటీఎమ్ పేటీఎమ్ ప్లాట్‌ఫామ్‌పై రూపాయి నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు. గ్రాముల్లో అయితే 0.0005 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి ఒక కస్టమర్‌కు 50 గ్రాములు. ఇంతే పరిమాణాల్లో విక్రయించుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత కూడా కొనుగోలు చేసిన బంగారాన్ని నిల్వ చేసుకో వాలంటే అందుకు చార్జీ చెల్లించుకోవాలి. బంగారాన్ని విక్రయించే సమయంలో బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో విక్రయించిన 72 గంటల్లో ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై కొనుగోలు చేసిన బంగారాన్ని మీకు నచ్చిన వారికి కానుకగా ఇచ్చుకునే సదుపాయం కూడా ఉంది. పేటీఎం డిజిటల్ గోల్డ్‌ను కాయిన్‌గా మార్చుకోవాలంటే కనీస బంగారం బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఎమ్ఎమ్టీసీ–పీఏఎమ్‌పీ కాయిన్ అయితే 0.5 గ్రాము నుంచి ప్రారంభమవుతుంది. ఆగ్మంట్ కాయిన్లు 0.1 గ్రాము నుంచి లభిస్తాయి. పేటీఎమ్ ఇటీవలే కల్యాణ్ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్ తదితర సంస్థలతోనూ టైఅప్ అయింది. దీంతో పేటీఎమ్ యూజర్లు తమ డిజిటల్ గోల్డ్‌ను కల్యాణ్ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్ సంస్థల్లో ఆభరణాలుగానూ మార్చుకోవచ్చు. గోల్డ్ రష్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్‌కు చెందిన.. ‘గోల్డ్రష్ఆన్లైన్ డాట్ కో డాట్ ఇన్’ పోర్టల్ నుంచి డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు అకౌంట్‌ను ప్రారంభించి, కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తును స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ పోర్టల్ నుంచి పొందొచ్చు. రిజిస్ట్రేషన్ ఉచితమే. కనీసం రూ.100 నుంచి బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. రూ.50,000 మించితే పాన్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. బంగారాన్ని డెలివరీ తీసుకోవాలంటే కనీసం ఒక గ్రాము అయినా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్‌గా కొనుగోలు చేసిన బంగారాన్ని భద్రంగా నిల్వ చేస్తారు. బంగారం కొనుగోలుపై పరిమితి లేకపోవడం ఆకర్షణీయం. డిజిటల్ గోల్డ్ సానుకూలతలు ► భౌతిక రూపంలో పసిడిని ఒక్క రూపాయి నుంచే కొనుగోలు చేసుకునే సదుపాయం. ► ఆన్లైన్లో రుణాలకు తనఖా పెట్టొచ్చు. ► లావాదేవీలన్నీ 24 క్యారట్‡ స్వచ్ఛత కలిగినవి. సేఫ్ గోల్డ్ అయితే 99.5 శాతం స్వచ్ఛత బంగారాన్ని ఆఫర్ చేస్తుండగా, ఎమ్ఎమ్టీసీ పీఏఎమ్‌పీ అయితే 99.9 స్వచ్ఛతతో అందిస్తున్నాయి. ► కొన్న పసిడికి బీమా ఉంటుంది. ► డిజిటల్ గోల్డ్‌ను ఆభరణాలు, కాయిన్లు, బులియన్‌తో మార్పిడి చేసుకోవచ్చు. ► పెట్టుబడి కాల వ్యవధి తర్వాత బంగారాన్ని భౌతిక రూపంలో డెలివరీ అందుకోవచ్చు. ప్రతికూలతలు ► చాలా ప్లాట్ఫామ్ల్లో డిజిటల్ గోల్డ్ కొను గోలు ఒక కస్టమర్‌కు రూ.2లక్షల పరిమితిగా అమల్లో ఉంది. మరింత అధికంగా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే పూర్తి కేవైసీ తప్పనిసరి. ► నిర్ణీత కాలం వరకే బంగారం నిల్వ సదుపాయాన్ని ఆఫర్ చేస్తూ, ఆ తర్వాత డెలివరీ తీసుకోవాలని సంస్థలు కోరుతున్నాయి. లేదంటే విక్రయించాల్సి రావచ్చు. కొనసాగిస్తే అదనపు చార్జీలు ఉంటాయి. ► డిజిటల్ గోల్డ్ కొనుగోలుపైనా 3% జీఎస్టీని చెల్లించాలి. ఉదాహరణకు రూ.1,000తో డిజిటల్ గోల్డ్‌కు ఆర్డర్ చేస్తే రూ.970విలువకే బంగారం పొందగలరు. దీనికితోడు ఇతర చార్జీలు కూడా ఉంటాయి. ► స్టోరేజీ చార్జీలు, బీమా, ట్రస్టీ ఫీజుల రూపంలో సంస్థలు 2–3 శాతం మేర చార్జీల కింద రాబట్టుకుంటున్నాయి. ► బంగారం డెలివరీ తీసుకోవాలంటే డెలివరీ చార్జీలు, కాయిన్లుగా అందుకోవాలంటే తయారీ చార్జీలను భరించాల్సి ఉంటుంది. నియంత్రణ ఎవరిది? డిజిటల్ గోల్డ్ కొనుగోలు, అమ్మకం ఎంతో సులభంగా ఉన్నప్పటికీ దీనిపై నియంత్రణ ఎవరిది? అన్న ప్రశ్న కచ్చితంగా ఇన్వెస్టర్లకు వస్తుంది. కొనుగోలు చేసిన విలువకు సరిపడా బంగారాన్ని మూడో పక్షానికి చెందిన ఖజానాల్లో భద్రపరుస్తారు. ఈ బాధ్యతలను చూసేందుకు ట్రస్టీలు ఉంటారు. కానీ, ఆచరణలో ఇలా నిల్వ చేస్తున్నారా? లేదా? అని చూసే యంత్రాంగం ఇప్పటికైతే లేదు. స్టాట్యుటరీ ఆడిట్లు నిర్వహించినప్పటికీ.. డిజిటల్‌గోల్డ్‌ను అందిస్తున్న సంస్థలకే నివేదికలను సమర్పించడం జరుగుతుంది. కానీ, ఇతర బంగారం డిజిటల్ సాధనాలు పలు నియంత్రణ సంస్థల కింద పనిచేస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లపై సెబీ పర్యవేక్షణ ఉంటుంది. అదే సౌర్వభౌమ బంగారం బాండ్లపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉంటుంది. నియంత్రణ సంస్థ ఉంటే తగిన తనిఖీలు, పర్యవేక్షణ ఉంటుందని.. నియంత్రణ సంస్థ లేని పక్షంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల విషయంలో రాజీకి అవకాశం లేకపోలేదని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. కనుక డిజిటల్‌గోల్డ్‌ను కొనుగోలు చేసుకునే వారు బీమా సదుపాయం ఉందో, లేదో విచారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. -
2021: ముకేశ్ ఏం చేయనున్నారు?
ముంబై, సాక్షి: బిలియనీర్ ముకేశ్ అంబానీ 2020లో పలు ఘనతలను సాధించారు. ప్రణాళికలకు అనుగుణంగా అడుగులు వేయడం ద్వారా గ్రూప్ కంపెనీలకు జోష్‌నిచ్చారు. ఫలితంగా ముకేశ్ సంపద పుంజుకోవడంతోపాటు.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణరహిత కంపెనీగా ఆవిర్భవించింది. ప్రధానంగా డిజిటల్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్.. గ్లోబల్ టెక్ కంపెనీలు, పీఈ దిగ్గజాలను భారీగా ఆకట్టుకోగలిగింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో సుమారు 33 శాతం వాటా విక్రయం ద్వారా ముకేశ్ 1.5 లక్షల కోట్లను సమీకరించగలిగారు. అంతేకాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు రైట్స్ ఇష్యూని జారీ చేసింది. మరోపక్క రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్లోనూ వాటా విక్రయం ద్వారా ముకేశ్ నిధులను సమకూర్చుకున్నారు. వెరసి 27 బిలియన్ డాలర్లను సమీకరించారు. ఒక దశలో ప్రపంచ కుబేరుల జాబితాలోనూ టాప్-5లోకి దూసుకెళ్లారు. దీంతో 2021లో ముకేశ్ ప్రణాళికలపట్ల కార్పొరేట్ ప్రపంచం అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆశలు, అంచనాలపట్ల విశ్లేషకులు ఏమంటున్నారంటే.. అంచనాలు అధికం ఇంధనం, టెక్స్టైల్స్, కెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 2020లో ప్రధానంగా రిలయన్స్ జియో ద్వారా అటు వ్యవస్థలోనూ, ఇటు గ్రూప్ వ్యాపారాలలోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ టెక్నాలజీ, ఈకామర్స్ తదితర విభాగాలలో భారీ అడుగులు వేసింది. మీడియాలోనూ పట్టు సాధించే ప్రయత్నాలు చేపట్టింది. దీంతో 2021లో 5జీ టెక్నాలజీని అందుకోవడంలోనూ ఆర్ఐఎల్ గ్రూప్ ముందుంటుందన్న అంచనాలు పెరిగాయి. ముకేశ్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లలో డిజిటల్ ఆవిష్కరణలకు తెరతీశారు. తద్వారా టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్‌తోపాటు.. కేకేఆర్, సిల్వర్‌లేక్ పార్టనర్స్ తదితర పలు పీఈ సంస్థలనూ ఆకట్టుకున్నారు. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) డిజిటల్ అడుగులు 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రొడక్టులు, సర్వీసుల అభివృద్ధిపై దృష్టిసారించవలసి ఉంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ పేమెంట్ సర్వీసులను రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించడం ద్వారా ఈకామర్స్ బిజినెస్‌కు మద్దతివ్వవలసి ఉంది. దేశవ్యాప్తంగా రిలయన్స్ రిటైల్ పలు స్టోర్లను ఏర్పాటు చేసింది. వీటిని ఈకామర్స్‌లో భాగం చేయవలసి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను ఈకామర్స్‌లో భాగం చేసేందుకు వీలుగా టెక్నాలజీ సొల్యూషన్స్, యాప్ప్ తదితరాలను అభివృద్ధి చేయవలసి ఉంది. ఇదే సమయంలో దేశీ రిటైల్ రంగంపై కన్నేసిన గ్లోబల్ దిగ్గజాలు వాల్‌మార్ట్, అమెజాన్ వంటి సంస్థల నుంచి ఎదురయ్యే పోటీలో ముందుండాల్సి ఉంటుంది. కాగా.. కొన్ని నెలలుగా ఆర్ఐఎల్కు చెందిన ఆయిల్, పెట్రోకెమికల్స్ బిజినెస్‌లో వాటాను సౌదీ కంపెనీ అరామ్కోకు విక్రయించే ప్రణాళికలు వేసినప్పటికీ మార్కెట్ పరిస్థితుల రీత్యా ముందుకుసాగలేదు. పెట్రోకెమికల్ బిజినెస్‌లో వాటా విక్రయ డీల్‌కు సైతం ప్రాధాన్యత ఉంది. -
టాటా.. ఆన్ లైన్ బాట!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా ఈ–కామర్స్ విభాగంలో అమెజాన్, రిలయ¯Œ ్సకు గట్టి పోటీనిచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రకాల వినియోగ ఉత్పత్తులు, సర్వీసులను డిజిటల్ మాధ్యమం ద్వారా కస్టమర్లకు చేరువ చేసే దిశగా ప్రత్యేక ఈ–కామర్స్ యాప్‌ను రూపొందించుకుంటోంది. ఇప్పటికే దీని నమూనా సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఆవిష్కరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆల్–ఇన్ –వన్ ..: టాటా గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం.. కార్లు, ఎయిర్‌కండీషనర్లు, స్మార్ట్ వాచీలు, టీ మొదలైన అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. అలాగే లగ్జరీ హోటల్స్, ఎయిర్‌లై¯Œ్స, బీమా వ్యాపారం, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్‌మార్కెట్ చెయిన్ మొదలైనవి నిర్వహిస్తున్నాయి. టెట్లీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లు టాటా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. రిటైల్ వినియోగదారులతో నేరుగా సంబంధాలు నెరపే ఈ వ్యాపార విభాగాల ఉత్పత్తులు, సర్వీసులన్నింటికీ ఈ ఆల్–ఇన్–వన్‌యాప్ ఉపయోగపడనుంది. టా టా డిజిటల్ విభాగం సీఈవో ప్రతీక్ పాల్ ఈ యాప్ రూపకల్పనకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాల్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో 3 దశాబ్దాల అనుభవం ఉంది. రిటైల్ విభాగం గ్లోబల్ హెడ్‌గా వ్య వహరించిన సమయంలో వాల్‌మార్ట్, టెస్కో, ఆల్డి, టార్గెట్, బెస్ట్ బై, మార్క్స్ అండ్ స్పెన్సర్ గ్రూప్ వంటి అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు డిజిటల్ బాట పట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. -
ప్రత్యర్థులకు షాక్ : త్వరలో టాటా సూపర్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ విభాగంలోకి దేశీయ అతిపెద్ద వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు మరింత వేగంగా దూసుకు వస్తోంది. ఇందుకు ఒక సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా ప్రతిదీ ఆర్డర్ చేసేలా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో “సూపర్ యాప్” ను ఆవిష్కరించనుంది. తద్వారా బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ లాంటి ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా సాల్ట్ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వరకు విస్తరించి టాటా గ్రూపు గత ఏడాది టాటా డిజిటల్ పేరుతో డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో ప్రాచుర్యం పొందిన టెన్సెంట్, అలీబాబా తరహాలో ఇక్కడ కూడా సూపర్ యాప్‌ను తీసుకు రానుంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని లాంచ్ చేయనుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నట్లు పలు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే సూపర్ యాప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ఫ్యాషన్ షాపింగ్ యాప్ టాటా క్లిక్, కిరాణా ఇ-స్టోర్ స్టార్‌క్విక్ ఆన్లైన్, ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫాం క్రోమా ద్వారా ఇప్పటికే సేవలను అందిస్తున్న టాటా గ్రూప్, వీటన్నింటి సమ్మితంగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త సూపర్ యాప్ ను రూపొందించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్ యాప్ ద్వారా ఫుడ్, కిరాణా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ లాంటి వాటితో పాటు ఇతర పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. ఇదొక సూపర్ యాప్. ఇందులో పలు యాప్స్ ఉంటాయి. డిజిటల్ సేవల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని చంద్రశేఖరన్ వెల్లడించారు. భారతదేశంలోఅనేక కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సరళమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించనున్నామని పేర్కొన్నారు. కాగా గోల్డ్‌మన్ సాచ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతాన్ని డిజిటల్ వ్యాపారం ఆక్రమించనుంది. సుమారు15 రెట్లు పుంజుకుని 300 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు తాజా వ్యూహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
కరోనా: డిజిటల్ వినియోగదారుల్లో మార్పులు
కరోనా : డిజిటల్ వినియోగదారులలో మార్పులు: కోవిడ్-19 కారణంగా ప్రపంచం మొత్తం మారిపోయింది. తాజా పరిస్థితుల్లో ప్రజలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రిటైలర్ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కరోనా వైరస్ కారణంగా కొన్ని వారాల వ్యవధిలోనే అనేక వ్యవస్థలు దారుణంగా నష్టపోయాయి. వినియోగదారుల అవసరాలు, ఆలోచనలు కూడా మారాయి. తమ అవసరాలకు సంబంధించి ఎక్కడ నుంచి కొనాలి? ఏం కొనాలి అన్న అంశాల్లో వినియోగదారుల ప్రాధాన్యతలు మారినట్లు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సంక్షోభంలో వినియోగదారులకు తగ్గట్టుగా మారడం: కోవిడ్-19 కారణంగా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా వినియోగదారుల వైఖరుల్లో అనేక మార్పులు వచ్చాయి. వినియోగదారులు వారు కొనుగొలు చేయాల్సిన వస్తువుల విషయంలో రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఎప్పటిలా జీవితం కొనసాగాలని ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందరి మనస్సులో కరోనా భయం లోతుగా నాటుకుపోయింది. కోవిడ్-19 - భారతీయ వినియోగదారులపై ప్రభావం: కోవిడ్-19 కారణంగా భారతీయ వినియోగదారుల ప్రవర్తనలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 60 శాతం మంది వినియోగదారులు తాము సాధారణంగా కొనుగోలు చేసే వస్తు సామగ్రి జాబితాను చేర్చాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాల ఆధారంగా ఈవై ఫ్యూచర్ కన్యూమర్ ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం వినియోగదారులు ఐదు రకాలుగా మారారు. (అడ్వర్టోరియల్) 1. మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లాలి (38% మంది అనుకుంటున్నారు) 2. పొదుపుగా ఉందామనుకునే వారు (29% మంది భావిస్తున్నారు) 3. ఖర్చులు తగ్గించుకోవాలని అనుకునేవారు (19% మంది భావిస్తున్నారు) 4. చాలా జాగ్రత్తగా ఉంటున్నవారు (11% మంది భావిస్తున్నారు) 5. అంతకు ముందులా ఉండేవారు (2% మంది భావిస్తున్నారు) ఈ పరిస్థితుల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో ఎప్పటిదాని కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. రెండో కేటగిరి పొదుపుగా ఉండమనుకునే వారు తమ ఖర్చులను కొద్దిగా తగ్గించుకున్నారు. ఖర్చులు తగ్గించుకోవాలి అనుకునే వారు ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఖర్చుచేయాలి అనుకునే కేటగిరి వారు కొన్ని వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. అంతకముందులానే ఉండి వారిలో ఎటువంటి మార్పులు లేవు. ఇంటర్నెట్ - ప్రతి విషయానికి ఒక కొత్త మార్గం: కోవిడ్-19 కారణంగా లాక్డౌన్లో, దాని తరువాత కూడా చాలా మంది వినియోగదారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటర్నెట్ ద్వారానే వారు బయట ప్రపంచంతో కలుస్తున్నారు. పనిచేయడం, వినోదం, ప్రపంచానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంటర్నెట్ ద్వారానే తెలుసుకుంటున్నారు. కోవిడ్-19 కారణంగా ఇంతలా డిజిటల్ వినియోగం పెరగడం వల్ల కూడా ఆన్లైన్ కస్టమర్ల ప్రవర్తనలో కూడా మార్పులు వస్తున్నాయి. సాధారణంగా సమయంలో కన్నా లాక్డౌన్లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. అదే విధంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న సమయం కూడా బాగా పెరిగింది. ఇండియాలో లాక్డౌన్ సమయంలో ప్రతి ఇంటర్నెట్ వినియోగదారుడు సగటుగా రోజుకు 21/2 గంటల సమయం గడిపాడు. సగటున వినియోగదారుడు ఏఏ విషయాలపై ఎంత సమయం వెచ్చిస్తున్నాడంటే: కేటగిరి వివరణ సగటు సమయం(నిమిషాలలో) వినోదం సినిమాలు,పాటలు, వీడియోలు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ మొదలైన అన్ని వెబ్సైట్లు చూస్తూ 28 సోషల్ నెట్వర్కింగ్ మీరు వేరే వాళ్లతో మాట్లాడటానికి వీలుగాఉండే సోషల్ మీడియా అప్లికేషన్లు అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డిన్ లాంటివి 25 సర్వీస్‌లు జీ-మెయిల్, మెసేజ్బోర్డ్లు, కోరాలాంటి వినియోగం 23 మెసెంజర్స్ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ లాంటివి 19 గేమ్స్ ఆన్లైన్లో ఆడే డిజిటల్ గేమ్స్ 12 సమాచారం/వార్తల కోసం వార్త ఛానెళ్లు చూడటం, ఒక ప్రత్యేకమైన విషయం గురించి గూగుల్‌లో వెతకడం 7 రిటైల్/ఈ- కామర్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మొదలైన ఆన్లైన్ రిటైల్ సంస్థలు, ఆన్లైన్ షాపింగ్ 4 ప్రస్తుతం వినియోగదారులు పాటిస్తున్న దినచర్యలు: కోవిడ్-19 ప్రతి ఒక్కరూ జీవించే మార్గాన్ని మార్చివేసింది. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వారి సౌకర్యానలను పక్కన పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో వినియోగదారులు కొత్త విషయాలను అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇవి కేవలం కరోనా సమయంలోనే కాకుండా చాలా రోజుల వరకు కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఎక్కువ కాలం కొనసాగేలా మూడు అలవాట్లు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే 1. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం: వినియోగదారులకు సంబంధించిన వస్తువులను తయారు చేసే సంస్థలన్ని అన్ని వస్తువులను ఆరోగ్యకరంగా తయారుచేయాలి. అలా ఆరోగ్యవంతమైన వాతావరణంలో వస్తువులు తయారుచేయాడానికి ఒక ప్రణాళిక రూపొంచుకోవాలి. 2. ఆచితూచి కొనుగోలు చేయడం: వినియోగదారులందరూ వారు ఏం కొనాలి అనే విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆహారాన్ని వృధా చేయడం తగ్గిస్తున్నారు. చాలా జాగ్రత్తగా షాపింగ్ చేస్తూ అవసరమైన వాటినే కొనుగోలు చేస్తున్నారు. సీపీజీ బ్రాండ్ వీటిని దృష్టిలో పెట్టుకొని తమ ఆఫర్లను ప్రకటించాలి. 3. స్థానిక వస్తువుల కొనుగోలు: ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం లోకల్‌గా ఉండే వస్తువులను కొనడానికే వినియోగదారులు ఆసక్తిని చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సీపీజీ బ్రాండ్లు లోకల్‌గా వినియోగదారులకు దగ్గర కావడానికి ప్రయత్నించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నప్పుడే మీ ఇష్టాలను, నైపుణ్యాలను తెలుసుకొని వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ వెరో (MeVero) ఈ విషయలో మీకు సాయంగా ఉంటుంది. మీ వెరో (MeVero) వరల్డ్ ఫస్ట్ డిజిటల్ పాషన్ బేస్డ్ ఇంకుబేటర్. MeVero refferal game (అడ్డ్వర్టోరియల్) మీలాంటి ఆసక్తులే ఉన్న మీ ఫ్రెండ్స్‌కు షేర్ చెయ్యొచ్చు. ప్రతి రిఫరెల్ ద్వారా మీరు 1500 డాలర్లు గెలుచుకొనే అవకాశం ఉంది. మీలాంటి ఆసక్తులు ఉన్నవారితోనే మీరు సమయాన్ని గడపవచ్చు. కరోనా వైరస్ మనతో పాటే ఉంటుంది. సీపీజీ బ్రాడ్లు దాంతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. వినియోగదారులలో ఈ మార్పులు తాత్కాలికమా? శాశ్వతమా? మీ పెట్టుబడులకు సరైన రిటర్న్ రావాలంటే వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేసుకోవాలి. (అడ్వర్టోరియల్) MeVero Referral Game - https://mevero.app.link/5FhMTkcd07 -
ఫేస్‌బుక్‌కు దిగ్గజ కంపెనీల దెబ్బ
వివాదాస్పద సందేశాలు, రాతల(హేట్ స్పీచ్)ను కట్టడి చేయడంలో తగిన విధంగా స్పందించడంలేదంటూ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్, టెలికం దిగ్గజం వెరిజాన్ ధ్వజమెత్తాయి. ఇందుకు అనుగుణంగా ఫేస్బుక్లో ప్రకటనలను నిలిపివేసేందుకు నిర్ణయించాయి. ఇదే అంశంపై పానీయాల దిగ్గజం కోక కోలా సైతం నెల రోజులపాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్ ఇవ్వడం నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. హోండా మోటార్ కంపెనీ(యూఎస్ యూనిట్), చాకొలెట్ల సంస్థ హెర్షీ కో సైతం ఇదే స్థాయిలో స్పందించనున్నట్లు పేర్కొన్నాయి. పలు ఇతర కంపెనీలు సైతం ఈ బాటలో నడిచే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. హేట్ స్పీచ్‌లను సమర్ధవంతంగా నియంత్రించడంలేదంటూ కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై అమెరికాలో విమర్శలు అధికమైనట్లు పేర్కొన్నారు. షేరు పతనం యూనిలీవర్, వెరిజాన్ ప్రకటనలతో వారాంతాన ఫేస్బుక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా సోషల్ మీడియా దిగ్గజం షేరు 8.5 శాతం పడిపోయి రూ. 216 డాలర్ల వద్ద ముగిసింది. వెరసి కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్(విలువ)లో 56 బిలియన్ డాలర్లమేర(సుమారు రూ. 4,20,000 కోట్లు) ఆవిరైంది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 616 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రకటనలు, కంటెంట్ విధానాలలో ఇటీవల స్వల్ప మార్పులను చేపట్టినట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత వారం తమ కంపెనీ ఉద్యోగులకు తెలియజేశారు. అయితే ఈ మార్పులు విమర్శకులను మెప్పించలేకపోయినట్లు పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ మార్పులు చెప్పుకోదగ్గవి కాదంటూ పౌరహక్కుల సంఘాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీపై ఇప్పటికే కొన్ని అంశాలపై యాంటీట్రస్ట్ దర్యాప్తులు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. 23 శాతం వాటా మొత్తం యూఎస్‌లోని డిజిటల్ ప్రకటనల మార్కెట్లో ఫేస్బుక్ సుమారు 23 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు ఈమార్కెటర్ నిపుణులు పేర్కొంటున్నారు. అన్ని ప్రాపర్టీస్ ద్వారా ఫేస్బుక్ 3 బిలియన్లమంది యూజర్లను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. 2019లో కంపెనీ డిజిటల్ ప్రకటనల ఆదాయం 27 శాతం పుంజుకుని దాదాపు 70 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. కాగా.. హేట్ స్పీచ్‌లను గుర్తించి, తొలగించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసినట్లు కంపెనీ అధికారి కరోలిన్ ఎవర్సన్ వివరించారు.ఈ అంశాన్ని ప్రకటనల భాగస్వామ్య సంస్థలకు ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. -
జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ
రిలయన్స్ జియో (ఆర్‌జియో) లిస్టింగ్ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిలయన్స్ జియో సహా డిజిటల్ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు) తన పేరిట బదలాయించుకోనుంది. ప్రతిగా అను బంధ సంస్థలో పూర్తి వాటాలను దక్కించుకోనుంది. దీనితో ఆర్ఐఎల్కు రిలయన్స్ జియో 100%అనుబంధ సంస్థగా (డబ్ల్యూవోఎస్) మారుతుంది. ఈ ప్రతిపాదనకు జియో పేరిట రుణాలిచి్చన బ్యాంకులు, డిబెంచర్ హోల్డర్లు అనుమతి వచ్చినట్లు ఆర్ఐఎల్ తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే 2020 మార్చి 31 నాటికి స్పెక్ట్రం పరంగా చెల్లించాల్సిన చెల్లింపులు తప్పితే.. రిలయన్స్ జియో పూర్తి రుణ రహిత సంస్థగా మారుతుందని పేర్కొంది. -
డిజిటల్ గోల్డ్.. జిగేల్!
న్యూఢిల్లీ: బంగారం డిజిటల్ రూపంలోనూ తళుక్కుమంటోంది. ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరుగుదలే దీన్ని తెలియజేస్తోంది. 2012–13లో బంగారం డిజిటల్ ఖాతాల ఆరంభం నుంచి చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్లకు పైగా ఖాతాలు ఆరంభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ రూపంలో బంగారాన్ని ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి అగ్రగామి సంస్థలు ఉన్నాయి. కొనుగోలు చేసిన బంగారాన్ని ఆయా సంస్థల వద్దే స్టోర్ చేసుకునే అవకాశం లేదంటే భౌతిక రూపంలో డెలివరీ తీసుకునే సదుపాయాలు కూడా వినియోగదారులను ఆకర్షింపజేస్తున్నాయి. సేఫ్గోల్డ్, డిజిటల్ గోల్డ్ వంటి సంస్థలూ ఈ సేవలను అందిస్తున్నాయి. ఆగ్మంట్ అనే సంస్థ రిఫైనరీల వద్ద స్వచ్ఛమైన బంగారం నుంచి దాన్ని మార్కెటింగ్ వరకు సమగ్ర సేవల్లో ఉన్న కంపెనీ. ఈ సంస్థ ‘డిజిగోల్డ్’ పేరుతో 2012 నుంచి డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక మోతీలాల్ ఓస్వాల్ సైతం ఈ సేవల్లోకి ప్రవేశించింది. ఇటీవలే ఈ సేవల్లోకి గూగుల్‌పే సైతం అడుగు పెట్టడం ఈ మార్కెట్ భారీగా విస్తరించేందుకు చేయూతనివ్వగలదని పరిశ్రమకు చెందిన ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్... వివిధ రకాల వేదికలుగా వార్షికంగా తొమ్మిది టన్నుల వరకు డిజిటల్ గోల్డ్ విక్రయాలు జరుగుతున్నాయని పరిశ్రమ అంచనా. ఇందులో సుమారు మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు దారులు ప్రత్యక్ష రూపంలో డెలివరీ తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఆన్లైన్ వేదికల్లో బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్ల విక్రయాలు కూడా జోరుగా కొనసాగుతుండడం గమనార్హం. డిజిటల్ గోల్డ్ కొనే వారు పెరిగిపోతుండడం, దీనికి తోడు ఆన్లైన్లోనే ఆభరణాలు కొనే ధోరణి విస్తరిస్తుండడం సంప్రదాయ జ్యుయలరీ వర్తకులను ఆందోళనకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్‌కు ఆసక్తి చూపించడానికి నాణ్యమైన, పారదర్శక సేవల ప్రాముఖ్యాన్నీ అర్థం చేసుకోవాల్సి ఉంది. కొన్న డిజిటల్ బంగారాన్ని ఉచితంగా స్టోర్ చేసుకునే సదుపాయం, కోరినప్పుడు బంగారం రూపంలోనే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే సేవలను అవి ఆఫర్ చేస్తున్నాయి. దీనికితోడు డిజిటల్ గోల్డ్‌ను బంగారు ఆభరణాల కొనుగోలుతో మార్చుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆభరణాలుగా డిజిటల్ గోల్డ్ ఆగ్మంట్ సంస్థకు సొంతంగా గోల్డ్ రిఫైనరీ (బంగారం శుద్ధి కర్మాగారం) కూడా ఉంది. డెలివరీ కోరుకుంటే బంగారాన్ని ఇంటికే తీసుకొచ్చి ఇస్తోంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలు కొనుగోలు చేసిన బంగారాన్ని తమ వేదికలుగానే స్టోర్ చేసుకునేందుకు గాను ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియాతో ఒప్పందం చేసుకుని ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. సేఫ్ గోల్డ్, ఆగ్మంట్ సంస్థలు ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌తో ఇందుకోసం టై అప్ అయ్యాయి. డిజిటల్ ఖాతాల్లోని బంగారాన్ని ఆభరణాలుగా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని క్యారట్‌లేన్, క్యాండిర్ (కల్యాణ్ జ్యుయలర్స్ ఆన్లైన్ సబ్సిడరీలు) సౌజన్యంతో అందిస్తున్నట్టు డిజిటల్ గోల్డ్ ఇండియా ఎండీ గౌరవ్ మాథుర్ తెలిపారు. సేఫ్గోల్డ్ మాతృ సంస్థే డిజిటల్‌గోల్డ్. వినియోగదారులకు మరిన్ని ఎంపికల అవకాశాలను అందించేందుకు జ్యుయలర్స్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టినట్టు మాథుర్ చెప్పారు. పేటీఎం, గూగుల్ పే లేదా ఫోన్‌పే సంస్థల వేదికలపై కొనుగోలు చేసిన మొత్తాన్ని బంగారం రూపంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా సంస్థ తమ వోల్ట్‌లలో భద్రంగా ఉంచేస్తుంది. కోరితే డెలివరీ కూడా చేస్తుంది. గూగుల్ పే రాకతో డిజిటల్ ఖాతాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నామని ఓ కంపెనీ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం. ఆగ్మంట్ సంస్థ బంగారం కాయిన్లను సైతం డెలివరీ చేస్తోంది. ‘‘వేల సంఖ్యలో జ్యూయలర్లను మా ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలన్నది ప్రణాళిక. దీంతో ఆగ్మంట్ కస్టమర్లు తమ బంగారాన్ని ఆభరణాలతో మార్పిడి చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్, వ్యాలెట్ ప్లాట్‌ఫామ్‌లపై ఆగ్మంట్ గోల్డ్ కొనే అవకాశం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం’’ అని ఆగ్మంట్ డైరెక్టర్ సచిన్ కొఠారి తెలిపారు. ► వ్యాలెట్ల నుంచి యాప్స్ నుంచి బంగారం కొనుగోలు చేసుకోవడాన్నే డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటారు. ► జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మంది డెలివరీ తీసుకోవడం లేదు. ► డెలివరీ తీసుకుంటున్న వారిలోనూ ఎక్కువ మంది కాయిన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఈ ధోరణి కాస్తా భవిష్యత్తులో బంగారం ఆభరణాలను డెలివరీ తీసుకోవడానికి మారనుందని అంచనా. ► కనీసం రూ.100 నుంచి కూడా పేటీఎం, సేఫ్గోల్డ్ వేదికల్లో బంగారం కొనుక్కోవచ్చు. ► ప్రస్తుతం రోజువారీగా జరుగుతున్న డిజిటల్ గోల్డ్ లావాదేవీల పరిమాణం 8–9 కిలోలు. గూగుల్ పే ద్వారా పసిడి కొనుగోళ్లు ఎంఎంటీసీ–పీఏఎంపీతో జట్టు న్యూఢిల్లీ: చెల్లింపుల యాప్ గూగుల్ పే ద్వారా బంగారం కొనుగోలు, అమ్మకం లావాదేవీలు కూడా జరిపే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇందుకోసం బులియన్ రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. గూగుల్ పే ద్వారా కొనుగోలు చేసే బంగారాన్ని యూజర్ల సూచనల మేరకు ఎంఎంటీసీ–పీఏఎంపీ సురక్షితమైన వోల్ట్‌లలో భద్రపరుస్తుందని గూగుల్ తెలిపింది. ఈ బంగారాన్ని లేటెస్ట్ ధర ప్రకారం ఎప్పుడైనా యూజర్లు కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేయొచ్చని వివరించింది. గూగుల్ పే యాప్‌లో ఎప్పటికప్పుడు తాజా ధరలు చూసుకోవచ్చని గూగుల్ తెలిపింది. అసలు గూగుల్ పే యాప్.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు తగిన అనుమతులు తీసుకుందా, లేదా అన్న విషయంపై వివరణనివ్వాలంటూ నియంత్రణ సంస్థ ఆర్బీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ కొత్తగా మరో ఫీచర్ ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ సంస్థ కేవలం చెల్లింపులకు సంబంధించి టెక్నాలజీపరమైన సేవలు మాత్రమే అందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా లైసెన్సు అవసరం లేదని గూగుల్ వివరణనిచ్చింది. -
టీసీఎస్ రికార్డు లాభాలు..
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) బంపర్ లాభాలతో క్యూ3 సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 8,000 కోట్ల మైలురాయి దాటడం ఇదే ప్రథమం. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నికర లాభం రూ.6,531 కోట్లు. మరోవైపు, ఆదాయం కూడా 20.8 శాతం వృద్ధితో రూ. 30,904 కోట్ల నుంచి రూ. 37,338 కోట్లకు ఎగిసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే ఆదాయ వృద్ధి 12.1 శాతంగా నమోదైందని కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 7,901 కోట్లతో పోలిస్తే లాభం 2.6 శాతం పెరిగింది. ఆదాయం 1.3 శాతం వృద్ధి నమోదు చేసింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన సీక్వెన్షియల్‌గా ఆదాయం 1.8 శాతం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఆదాయాల వృద్ధికి ఉత్తర అమెరికా మార్కెట్ ఊతంగా నిలవగా, అటు కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం పనితీరు కూడా దోహదపడింది. మూడో మధ్యంతర డివిడెండ్ కింద షేరు ఒక్కింటికి రూ. 4 చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. డివిడెండ్‌కు సంబంధించి రికార్డు తేదీ జనవరి 18 కాగా, చెల్లింపు తేదీ జనవరి 24గా ఉంటుందని పేర్కొంది. డిజిటల్ 52 శాతం వృద్ధి.. డిసెంబర్ క్వార్టర్లో టీసీఎస్ మొత్తం ఆదాయాల్లో డిజిటల్ వ్యాపార విభాగం వాటా అత్యధికంగా 30.1 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.7 శాతం వృద్ధి నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం 8.6 శాతం, ఎనర్జీ యుటిలిటీస్ 18 శాతం వృద్ధి సాధించాయి. అటు ప్రాంతాల వారీగా చూస్తే బ్రిటన్‌లో ఆదాయాలు 25.1%, మిగతా యూరప్ దేశాల్లో ఆదాయాలు 17.6% మేర పెరిగాయి. ఆసియా పసిఫిక్ వ్యాపార విభాగం 12.6%, ఉత్తర అమెరికా 8.2%, భారత్ 9.7%, లాటిన్ అమెరికా వ్యాపార విభాగం 7.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. 5.9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు.. టీసీఎస్ క్యూ3లో 5.9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు దక్కించుకుంది. ఇందులో బీఎఫ్ఎస్ విభాగం వాటా 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, రిటైల్ విభాగం వాటా 800 మిలియన్ డాలర్లుగా ఉంది. మూడో త్రైమాసికంలో కొత్తగా 100 మిలియన్ డాలర్ల పైచిలుకు కాంట్రాక్టు ఒకటి దక్కించుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. వివిధ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడంతో పాటు కొన్ని ప్రధాన మార్కెట్లలో నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగినప్పటికీ నిర్వహణ మార్జిన్లను కాపాడుకోగలిగామని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.రామకృష్ణన్ తెలిపారు. ఆదాయాలను పెంచుకునే దిశగా కార్యకలాపాలను విస్తరించడం, భవిష్యత్ వృద్ధి సాధనాలపై పెట్టుబడిపైనే టీసీఎస్ ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. కొత్త ఆర్డర్ల డిమాండ్‌కి తగ్గట్లుగా మరింత మంది ఉద్యోగులను నియమించుకోవాల్సి రావడంతో.. మార్జిన్లపై కొంత ప్రభావం పడిందని రామకృష్ణన్ చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ క్యూ3లో 90 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 25.6%కి చేరింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, సబ్–కాంట్రాక్టుల వ్యయాలు పెరగడం ఇందుకు కారణం. ఆశావహంగా కొత్త ఏడాది.. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కీలకమైన విభాగాలన్నీ మెరుగైన పనితీరు కనపర్చడంతో 2018లో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన వృద్ధి.. 14 త్రైమాసికాల గరిష్టం‘ అని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. పటిష్టమైన ఆర్డర్ బుక్, క్లయింట్స్, డిజిటల్ సేవల వృద్ధి, భారీ కొత్త ఆర్డర్లు వంటివి టీసీఎస్ సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారాయన. దీంతో కొత్త ఏడాదిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని రాజేష్ గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. ‘డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద సంఖ్యలో ఆర్డర్లు సాధించాం. మరిన్ని కాంట్రాక్టులు కుదుర్చుకోబోతున్నాం. వీటి ఊతంతో కొత్త సంవత్సరం ఆశావహంగా ఉండబోతోంది‘ అని ఆయన తెలిపారు. తమ క్లయింట్లు.. ఐటీ వ్యయాల్లో కోత విధించే సూచనలేమీ కనిపించలేదని, అయితే మార్చి క్వార్టర్ మధ్యలో మాత్రమే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రెండంకెల స్థాయిలో వృద్ధి రేటు సాధించేంతగా టీసీఎస్ పటిష్టమైన స్థితిలో ఉందని గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, యూరప్ దేశాలు, బ్రిటన్‌లో ఆర్థిక సేవల విభాగం కొంత మందగించవచ్చని, రిటైల్ విభాగం ఫలితాలు మిశ్రమంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. క్యూ3 ముగిసేనాటికి కంపెనీ చేతిలో రూ. 43,000 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉన్నాయని గోపీనాథన్ చెప్పారు. తమ వ్యూహాలకు అనువైన సంస్థల కొనుగోలు అవకాశాల అన్వేషణ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. 6వేల పైచిలుకు నియామకాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ నికరంగా 6,827 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,17,929కి చేరింది. వార్షికంగా చూస్తే ఉద్యోగుల సంఖ్య 27,049 మేర పెరిగినట్లయింది. గడిచిన పన్నెండు నెలల్లో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) ఐటీ పరిశ్రమతో పోలిస్తే అత్యల్పంగా 11.2 శాతంగా ఉంది. 2,92,000 మందికి డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణనిచ్చినట్లు టీసీఎస్ పేర్కొంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. టీసీఎస్ షేరు గురువారం బీఎస్ఈలో 0.02 శాతం పెరిగి రూ. 1,888.15 వద్ద క్లోజయ్యింది. -
50లక్షలమందికి ఫేస్బుక్ ట్రైనింగ్
సాక్షి, డిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ దేశంలో 5మిలియన్లు( 50లక్షలమంది) మందికి డిజిటల్ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు మెరుగు పరుచుకునేలా, బిజినెస్ చేసే విధంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్బుక్ ప్రతినిథి శనివారం తెలిపారు. తమ మార్కెట్ షేర్ ఇండియాలో ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇప్పటికే దాదాపు 10లక్షల మందికి ఈ తరహా శిక్షణ పూర్తి చేశామన్నారు. దక్షిణ, మధ్య ఆసియా, ఇండియా ఫేస్బుక్ ప్రతినిథి అంఖి దాస్ మాట్లాడుతూ.. ‘చిన్న స్థాయి బిజినెస్‌లను అంతర్జాతీయ స్థాయి ఎకానమీ తాకేలా మార్చడానికి ఫేస్బుక్ కట్టుబడి ఉంది. దీనికై పలు సంస్థలతో కలసి ప్రజలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 2021 కల్లా 5 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము.’ అని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలతో దేశీయ చిన్న వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా ఈ శిక్షణ ఉపయోగపడనుందని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె చెప్పారు. 50 మంది భాగస్వాములతో కలిసి సుమారు 150 నగరాలు, 48వేల గ్రామాలలో పది సంస్థల ద్వారా 10లక్షలమందికి శిక్షణ ఇచ్చామని ఆమె తెలిపారు. ఫేస్‌బుక్‌తో అనుసంధానమై ఉంటే కలిగే లాభాలను ప్రతీ ఒక్కరికీ తెలియజేయాలనుకుంటున్నాము. కొత్తగా సంస్థలు ప్రారంభించే వారికి ఈ ట్రైనింగ్ ద్వారా బిజినెస్‌లో ఎదిగేలా చేయాలనేది మా కల అని అన్నారు. ఈ ట్రైనింగ్‌ని విస్తృతం చేసేందుకు ఫేస్బుక్ 14 స్థానిక భాషల్లో విధివిధానాలను రూపొందించిందని, ఈ పద్దతిని ఇండియాలోని 29 రాష్ట్రాల్లో ప్రారంభించామని తెలిపారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. ఫేస్బుక్లో అప్లోడ్ అవుతున్న విద్వేషపూరిత వీడియోలు, అసాంఘిక పోస్ట్‌లపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విలేకరులు ప్రశ్నించారు. ఇప్పటివరకూ 1.5 బిలియన్ పోస్ట్‌లను ఫేస్బుక్ తొలగించిందని, ఇలాంటి వాటిని ఫేస్బుక్ సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. తమ పాలసీకి భిన్నంగా ఉన్న పోస్ట్‌లు అన్నింటినీ తొలగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఫేస్బుక్లో పొలిటికల్ యాడ్స్ గురించిన డెవలప్మెంట్ జరుగుతోందని తెలిపారు. 2019 ఎన్నికల్లోపు ఆ ఫీచర్ తీసుకొస్తామని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ ఆలన్ అక్టోబర్‌లో చెప్పిన సంగతి తెలిసిందే... -
ఉద్యోగాలు 40 లక్షలు .. పెట్టుబడులు 100 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనతో పాటు భారీగా పెట్టుబడులను రప్పించటమే లక్ష్యంగా కొత్త టెలికం విధానం (ఎన్టీపీ) ముసాయిదా రూపొందింది. 2022 నాటికల్లా ఈ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు కొత్తగా కల్పించాలని, 5జీ సర్వీసులు ప్రవేశపెట్టడంతో పాటు 50 ఎంబీపీఎస్ వేగంతో అందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ ఇందులో ప్రతిపాదించింది. అలాగే నియంత్రణపరమైన సంస్కరణలతో డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో 2022 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్దేశించుకుంది. ‘జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం 2018’ పేరిట ఆవిష్కరించిన ముసాయిదా పాలసీలో ఈ మేరకు పలు ప్రతిపాదనలున్నాయి. దాదాపు రూ. 7.8 లక్షల కోట్ల రుణభారంతో కుంగుతున్న టెల్కోలకు ఊరటనిచ్చే దిశగా స్పెక్ట్రం చార్జీలు సహా పలు లెవీలను క్రమబద్ధీకరించేలా హామీలున్నాయి. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీ మొదలైన వాటన్నింటినీ సమీక్షించేలా పాలసీలో ప్రతిపాదించారు. దీని ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతంగా ఉన్న టెలికం రంగం వాటాను 8 శాతానికి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. నియంత్రణపరమైన ప్రతిబంధకాల తొలగింపు.. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడుల రాకకు, కొత్త ఆవిష్కరణలకు నియంత్రణపరమైన ప్రతిబంధకాలను తొలగించేలా టెలికం విధానం ముసాయిదాలో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా తీసుకోనున్న చర్యలను ప్రస్తావిస్తూ.. ‘డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో సముచిత పోటీ ఉండేలా చూడటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు నియంత్రణ విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ఉండాలన్న విషయం దృష్టిలో ఉంచుకుని పాలసీ రూపొందించడం జరిగింది. ఈ రంగంలో పెట్టుబడులు భారీగా అవసరమవుతాయి. ఇది దృష్టిలో ఉంచుకునే దీర్ఘకాలికమైన, మెరుగైన, నిలకడగా కొనసాగే పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు ఉండాలన్నది పాలసీ లక్ష్యం’ అని టెలికం విధానం ముసాయిదాలో పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ పరికరాలు, ఇన్ఫ్రా, సర్వీసులపై విధిస్తున్న పన్నులు, సుంకాలను క్రమబద్ధీకరించనున్నారు. అలాగే, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను నిర్మించే క్రమంలో నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీపీ సత్వర అమలు కీలకం: సీవోఏఐ ఎన్టీపీలో నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించాలంటే.. సుంకాలను 10%కన్నా తక్కువకి తగ్గించడంతో పాటు ప్రతిపాదిత విధానాన్ని వేగవంతంగా అమల్లోకి తేవాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) అభిప్రాయపడింది. ‘ప్రస్తుతం మొత్తం పన్నులు, సుంకాలు కలిపి సుమారు 30% దాకా ఉంటున్నాయి. ముసాయిదా విధానంలో నిర్దేశించుకున్న పెట్టుబడుల లక్ష్యాలను సాధించాలంటే వీటిని పది శాతం కన్నా తక్కువకి పరిమితం చేయడం కీలకం’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పేర్కొన్నారు. జులై ఆఖరు నాటికల్లా టెలికం విధానం పూర్తిగా ఖరారై, అమల్లోకి రావాలని తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికం పరిశ్రమ కోరుకుంటోందని ఆయన చెప్పారు. ఎన్టీపీ ముసాయిదాకు మొబైల్ పరిశ్రమ నుంచి పూర్తి మద్దతు ఉందన్నారు. ల్యాండ్‌లైన్ పోర్టబిలిటీ.. దాదాపు 50 శాతం కుటుంబాలకు ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తేవాలని, ల్యాండ్‌లైన్ పోర్టబిలిటీ సేవలు కూడా ప్రవేశపెట్టాలని టెలికం శాఖ ఎన్టీపీలో ప్రతిపాదించింది. 2020 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు 1 జీబీపీఎస్ స్పీడ్‌తోనూ, 2022 నాటికి 10 జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించాలని పాలసీలో సిఫార్సులు ఉన్నాయి. టెలికం సంస్థలు.. కమ్యూనికేషన్స్ సేవలను చౌకగా, నిలకడగా అందించేందుకు వెసులుబాటు కల్పించేలా స్పెక్ట్రం ధరలను సముచిత స్థాయిలో ఉండే విధానాన్ని అమలు చేయాలని టెలికం శాఖ భావిస్తోంది. -
మొబైల్ లోనే పాస్ వర్డ్ చేంజ్
ఏది కావాలన్నా క్షణాల్లో మన ముందుంటుంది. మొబైల్ ఫోన్లో ఒక క్లిక్ నొక్కితే చాలు ఆర్డర్ చేసిన వస్తువు మన ముగింట్లోకి వచ్చేస్తుంది. ఇలా వినియోగదారులకు చేరువ అవుతున్న ఈ-కామర్స్ రంగం నానాటికీ పుంజుకుంటోంది. అయితే డిజిటలైజేషన్ ద్వారా మొబైల్ లో షాపింగ్ చేసే వినియోగదారుల సెక్యురిటీ, ప్రైవసీ కంపెనీల బాధ్యతగా మారింది. దీనికోసమే నెవర్ పాయింట్ టెక్నాలజీస్ ద్వారా మన ముందుకు వచ్చింది ఆక్సస్ మేనేజర్ మొబైల్ యాప్. కంప్యూటర్ వద్దకు వెళ్లి పాస్ వర్డ్ లు మార్చకొనే తీరిక లేని వారికి మొబైల్ లోనే మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ మొబైల్ యాప్ ద్వారా పాస్ వర్డ్ లను రీసెట్ చేసుకోవడం, అకౌంట్ ను అన్ లాక్ చేసుకోవడం సులభతరం అవుతుంది. మొబైల్ ఫోన్ ద్వారానే అకౌంట్ ను అప్ డేట్ చేసుకోవడం, పాస్ వర్డ్ రీసెట్, అకౌంట్లు అన్ లాక్ చేసుకోవడం, పాస్ వర్డ్ లు మార్చుకోవడం వీలవుతుంది. ప్రతి బిజినెస్ ల్లో సెక్యురిటీ కోసం ఈ యాప్ ఎంతో సహకరిస్తుంది. ఈ యాప్ ను ఆండ్రాయిడ్ పోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐపోన్ యాప్ లో యాపిల్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
టీసీఎస్ లాభం జూమ్
క్యూ4లో రూ. 6,413 కోట్లు; 73% అప్ * ఆదాయం 17.5 శాతం వృద్ధి; రూ. 28,449 కోట్లు * షేరుకి రూ.27 చొప్పున తుది డివిడెండ్ ముంబై: దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 6,413 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.3,713 కోట్లతో పోల్చితే.. 73 శాతం దూసుకెళ్లింది. ఇక మొత్తం ఆదాయం సైతం 17.5 శాతం వృద్ధి చెంది రూ.28,449 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఆదాయం రూ.24,220 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గానూ జోరు... డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్(క్యూ3)లో నికర లాభం రూ. 6,083 కోట్లతో పోల్చితే క్యూ4లో(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) 5.4 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా క్యూ3లో రూ.27,364 కోట్లతో పోల్చిచూస్తే 4% వృద్ధి చెందింది. పరిశ్రమ వర్గాలు సగటున క్యూ4లో నికర లాభం సీక్వెన్షియల్‌గా 2.5% మేర, ఆదాయం 3.6 శాతం చొప్పున వృద్ధి చెందవచ్చని అంచనావేశారు. దీనికి మించిన మెరుగైన పనితీరునే టీసీఎస్ నమోదు చేయడం గమనార్హం. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఆకర్షణీయమైన ఫలితాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పూర్తి ఏడాది చూస్తే... 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.24,292 కోట్లుగా నమోదైంది. 2014-15 ఏడాదిలో లాభం రూ. 19,852 కోట్లతో పోల్చితే 22.4% వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 14.8 శాతం పెరుగుదలతో రూ.94,648 కోట్ల నుంచి రూ.1,08,646 కోట్లకు ఎగబాకింది. ఫలితాల్లో ముఖ్యాంశాలివీ... * 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను టీసీఎస్ రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.27 చొప్పున(2,700%) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో పూర్తి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.43.5కు చేరింది. * కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి వ్యాపారంలో నాలుగో త్రైమాసికానికి 2.6 శాతం వృద్ధిని టీసీఎస్ నమోదు చేసింది. యూరప్ మార్కెట్ వ్యాపారంలో 3.6 శాతం వృద్ధి నమోదైంది. * పూర్తి ఏడాది ఆదాయాల్లో తొలిసారిగా భారత్ మార్కెట్ నుంచి బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించామని, కొత్త విదేశీ మార్కెట్ల నుంచి 3.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు టీసీఎస్ వెల్లడించింది. * కంపెనీ 2015-16 ఆదాయాల్లో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ వాటా 15.5 శాతంగా నమోదైంది. * సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపు స్థాయిలోనే రూ.2,522 వద్ద ముగిసింది. కాగా, వ్యాపారా రహస్యాల చోరీ కేసుకు సంబంధించి అమెరికా ఫెడరల్ కోర్టు టీసీఎస్, టాటా అమెరికా ఇంటర్నేషన్లపై 94 కోట్ల డాలర్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇవన్నీ నిరాధార ఆరోపణలని, ఉన్నత న్యాయస్థానాల్లో ఈ తీర్పును సవాలు చేస్తామని టీసీఎస్ ఇప్పటికే పేర్కొంది. ఈ వార్తల ప్రభావంతో సోమవారం ఆరంభంలో షేరు ధర 3 శాతం పైగా పడింది. ‘సీజనల్‌గా నాలుగో క్వార్టర్లో ఉండే బలహీన ధోరణిని అధిగమించి పటిష్టమైన ఫలితాలను ప్రకటించాం. కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు; రిటైల్, తయారీ రంగాలకు చెందిన ఆదాయాలు పుంజుకోవడం దీనికి ప్రధానంగా దోహదం చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు ఈ ఫలితాలు తోడ్పాటునందించనున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆటోమేషన్ వంటి సరికొత్త విభాగాల్లో కొత్త ఉత్పత్తులతోపాటు ‘డిజిటల్’ నైపుణ్యాలను పెంచడంలో మా పెట్టుబడుల జోరును కొనసాగిస్తాం. ఐదేళ్లలో డిజిటల్ బిజినెస్ ఆదాయాన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయి పైకి చేర్చాలన్న లక్ష్యాన్ని అందుకోగలం’. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ ఎండీ, సీఈఓ నియామకాల్లో రికార్డు... గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నడూలేనంత స్థాయిలో(ఆల్‌టైమ్ హై) స్థూలంగా 90,182 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ఇక నాలుగో త్రైమాసికం విషయానికొస్తే స్థూలంగా 22,576 నియామకాలు జరిగాయి. ఇదే కాలంలో 13,424 మంది సిబ్బంది వలసపోవడంతో నికరంగా 9,152 మంది ఉద్యోగులు జతయ్యారు. దీంతో మార్చి చివరినాటికి టీసీఎస్ మొత్తం సిబ్బంది సంఖ్య 3,53,843 మందికి చేరింది. కాగా, 2015-16లో దాదాపు 400 కొత్త డిజిటల్ టెక్నాలజీల్లో 1,20,000 మందికిపైగా టీసీఎస్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ అజోయ్ ముఖర్జీ వెల్లడించారు. 8-12 శాతం వేతనాల పెంపు... కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది 8-12 శాతం మేర వేతనాలను పెంచుతున్నట్లు అజోయ్ ముఖర్జీ చెప్పారు. ఈ నెల నుంచి ఈ వేతన పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తుందని తెలిపారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్థూల నియామకాల సంఖ్య తగ్గవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా గత కొద్ది నెలలుగా వలసల రేటు తగ్గుముఖం పట్టడం, అధిక ఉత్పాదకత, ఆటోమేషన్ పెరగడం వంటివి దీనికి కారణమని చెప్పారు. రానున్న నెలల్లో దాదాపు 30,000-32,000 మంది ఫ్రెషర్స్‌ను చేర్చుకోనున్నట్లు ముఖర్జీ వెల్లడించారు. -
టీసీఎస్ లాభం 6,083 కోట్లు..
♦ క్యూ3లో 14 శాతం వృద్ధి.. ♦ ఆదాయం రూ. 27,364 కోట్లు; ♦ 12 శాతం పెరుగుదల... ♦ షేరుపై రూ. 5.50 డివిడెండ్ ముంబై: మార్కెట్ ముందస్తు అంచనాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బలహీనమైన ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 6,083 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 5,328 కోట్లు. ఆదాయం రూ. 24,501 కోట్ల నుంచి రూ. 27,364 కోట్లకు 12 శాతం మేర పెరిగింది. టీసీఎస్ రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 5.50 మేర డివిడెండ్ ప్రకటించింది. సాధారణంగానే మూడో త్రైమాసికంలో కంపెనీల పనితీరు బలహీనంగానే ఉంటుందని, ఈసారి చెన్నై వరదలు కూడా దీనికి తోడయ్యాయని టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అయినప్పటికీ తమ వ్యాపార విభాగాలన్నీ కూడా మెరుగైన పనితీరు కనపర్చాయని ఆయన పేర్కొన్నారు. స్థిరమైన కరెన్సీ మారక విలువపరంగా చూసినప్పుడు సంపన్న దేశాల్లో ఉత్తర అమెరికా .. యూరప్ మార్కెట్లు, వర్ధమాన దేశాల్లో లాటిన్ అమెరికా మార్కెట్లో వ్యాపారం చెప్పుకోతగినంత స్థాయిలో వృద్ధి చెందినట్లు ఆయన వివరించారు. మొత్తం మీద కరెన్సీ మారక విలువపరంగానే కాకుండా ఇతరత్రా అనేక సవాళ్లతో కూడిన త్రైమాసికంలో కూడా కంపెనీ క్రమశిక్షణతో పురోగమించి, గణనీయమైన మార్జిన్లు సాధించగలిగిందని చంద్రశేఖరన్ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే కంపెనీ నికర లాభం రూ. 6,055 కోట్ల నుంచి కేవలం 0.9 శాతం మాత్రమే వృద్ధి చెందింది. అటు ఆదాయం కూడా రూ. 27,165 కోట్ల నుంచి 0.7 శాతం మాత్రమే పెరిగింది. స్థిరమైన కరెన్సీ మారకం ప్రాతిపదికన సీక్వెన్షియల్‌గా చూస్తే వృద్ధి కేవలం 0.5 శాతమేనని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సర ఆదాయాలు క్రితం సంవత్సరం లాగా భారీగా ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. అయితే, రాబోయే ఆర్థిక సంవత్సరం మెరుగ్గా ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా వీసా ఫీజును గణనీయంగా పెంచడం తమకు పెద్దగా సమస్య కాబోదని, వనరుల సమర్ధ వినియోగం ద్వారా ఈ ప్రభావాన్ని కొంత మేర ఎదుర్కొనగలమని చంద్రశేఖరన్ చెప్పారు. 3.44 లక్షలకు ఉద్యోగుల సంఖ్య.. టీసీఎస్ స్థూలంగా 22,118 మందిని, నికరంగా 9,071 మంది ఉద్యోగులను తీసుకుందని, దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,44,691కి చేరిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ చెప్పారు. ఉద్యోగుల వలసలు (అట్రిషన్ రేటు) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో తగ్గిందని వివరించారు. వ్యాపార వృద్ధికి అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని, అలాగే నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ముఖర్జీ పేర్కొన్నారు. దాదాపు 70,000 మంది ఉద్యోగులు కొత్త టెక్నాలజీలపై శిక్షణ పొందుతున్నార చెప్పారు. అటు, 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులు ఇచ్చిన క్లయింట్ల సంఖ్య మరొకటి పెరిగి 34కి చేరిందని, 20 మిలియన్ డాలర్ల క్లయింట్ల సంఖ్య 2 పెరిగి 173కి చేరిందని ముఖర్జీ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ ఫలితాలపై అంచనాలతో మంగళవారం బీఎస్ఈలో టీసీఎస్ షేరు 1.65 శాతం తగ్గి రూ. 2,324 వద్ద ముగిసింది. డిజిటల్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి.. కంపెనీ ఆదాయాల్లో 13.7 శాతం డిజిటల్ వ్యాపార విభాగం నుంచే వచ్చాయని, ఈ విభాగం అత్యధిక వృద్ధి నమోదు చేస్తోందని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ నేపథ్యంలో 2016లో కూడా డిజిటల్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చంద్రశేఖరన్ పేర్కొన్నారు. లైఫ్ సెన్సైస్.. హెల్త్‌కేర్, తయారీ, హై-టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులు తదితర వ్యాపార విభాగాలన్నీ కూడా మెరుగైన పనితీరే కనపర్చాయని ఆయన వివరించారు.