మొబైల్‌ లోనే పాస్ వర్డ్ చేంజ్ | Every business is a digital business with a mobile app | Sakshi
Sakshi News home page

మొబైల్‌ లోనే పాస్ వర్డ్ చేంజ్

Published Sat, Apr 23 2016 8:23 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

మొబైల్‌ లోనే పాస్ వర్డ్ చేంజ్

మొబైల్‌ లోనే పాస్ వర్డ్ చేంజ్

ఏది కావాలన్నా క్షణాల్లో మన ముందుంటుంది. మొబైల్ ఫోన్‌లో ఒక క్లిక్ నొక్కితే చాలు ఆర్డర్ చేసిన వస్తువు మన ముగింట్లోకి వచ్చేస్తుంది. ఇలా వినియోగదారులకు చేరువ అవుతున్న ఈ-కామర్స్ రంగం నానాటికీ పుంజుకుంటోంది. అయితే డిజిటలైజేషన్ ద్వారా మొబైల్ లో షాపింగ్ చేసే వినియోగదారుల సెక్యురిటీ, ప్రైవసీ కంపెనీల బాధ్యతగా మారింది. దీనికోసమే నెవర్ పాయింట్ టెక్నాలజీస్ ద్వారా మన ముందుకు వచ్చింది ఆక్సస్ మేనేజర్ మొబైల్ యాప్. కంప్యూటర్ వద్దకు వెళ్లి పాస్ వర్డ్ లు మార్చకొనే తీరిక లేని వారికి మొబైల్ లోనే మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది.

ఈ మొబైల్ యాప్ ద్వారా పాస్ వర్డ్ లను రీసెట్ చేసుకోవడం, అకౌంట్ ను అన్ లాక్ చేసుకోవడం సులభతరం అవుతుంది. మొబైల్ ఫోన్ ద్వారానే అకౌంట్ ను అప్ డేట్ చేసుకోవడం, పాస్ వర్డ్ రీసెట్, అకౌంట్లు అన్ లాక్ చేసుకోవడం, పాస్ వర్డ్ లు మార్చుకోవడం వీలవుతుంది. ప్రతి బిజినెస్ ల్లో సెక్యురిటీ కోసం ఈ యాప్ ఎంతో సహకరిస్తుంది. ఈ యాప్ ను ఆండ్రాయిడ్ పోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐపోన్ యాప్ లో యాపిల్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement