ముంబై: వినియోగదారులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ రెడీ అయ్యింది. మొబైల్ రీఛార్జీ, డైరెక్ట్ టూ హోం, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మూడు సర్వీసులకు ఒకే బోకేగా అందిస్తూ ఎయిర్‌టెల్ బ్లాక్ పేరుతో సరికొత్త ప్లాన్ అమల్లోకి తేనుంది.
ఎయిర్‌టెల్ బ్లాక్
ఎయిర్ టెల్ అందిస్తున్న మొబైల్, డీటీహెచ్, ఫైబర్ సర్వీసుల్లో ఏవైనా రెండు సర్వీసులు పొందుతున్న వారు ‘ఎయిర్ బ్లాక్’ పొందేందుకు అర్హులు. ఎయిర్ టెల్‌బ్లాక్ పథకంలో సింగిల్ బిల్, సింగిల్ కస్టమర్ కేర్ సెంటర్, ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్, కస్టమైజ్డ్ ప్లాన్స్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. అంతేకాదు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం బాక్స్ సర్వీసులు పొందవచ్చు. ఈ పథకం వల్ల కస్టమైజ్డ్ ప్లాన్స్ లభించడంతో పాటు ఎయిర్ టెల్ సర్వీసులకు వేర్వేరుగా బిల్లులు చెల్లించే ఇబ్బంది తొలగి పోతుందని కంపెనీ చెబుతోంది.
ఉపయోగాలు
వేర్వేరు బిల్లలు కట్టే శ్రమ తప్పుతుంది. సమయం ఎక్కువగా పట్టే ఐవీఆర్ పద్దతిలో కాకుండా ఒక నిమిషం వ్యవధిలోనే కస్టమర్ కేర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడవచ్చు. రెండు వేర్వేరు సేవలకు సంబంధించి ప్లాన్స్‌ను ఒకే బండిల్‌లో పొందవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ అప్లికేషన్‌ను డౌన్‌లోడు చేసుకుంటే అందులో ఎయిర్‌టెల్ బ్లాక్‌కి సంబంధించిన పూర్తి సమాచారం , ప్లాన్ వివరాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment