fibre net
-
ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి
-
ఎయిర్టెల్ బ్లాక్ ... సరికొత్త ప్లాన్ !
ముంబై: వినియోగదారులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఎయిర్టెల్ రెడీ అయ్యింది. మొబైల్ రీఛార్జీ, డైరెక్ట్ టూ హోం, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మూడు సర్వీసులకు ఒకే బోకేగా అందిస్తూ ఎయిర్టెల్ బ్లాక్ పేరుతో సరికొత్త ప్లాన్ అమల్లోకి తేనుంది. ఎయిర్టెల్ బ్లాక్ ఎయిర్ టెల్ అందిస్తున్న మొబైల్, డీటీహెచ్, ఫైబర్ సర్వీసుల్లో ఏవైనా రెండు సర్వీసులు పొందుతున్న వారు ‘ఎయిర్ బ్లాక్’ పొందేందుకు అర్హులు. ఎయిర్ టెల్బ్లాక్ పథకంలో సింగిల్ బిల్, సింగిల్ కస్టమర్ కేర్ సెంటర్, ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్, కస్టమైజ్డ్ ప్లాన్స్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. అంతేకాదు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎయిర్టెల్ ఎక్స్ట్రీం బాక్స్ సర్వీసులు పొందవచ్చు. ఈ పథకం వల్ల కస్టమైజ్డ్ ప్లాన్స్ లభించడంతో పాటు ఎయిర్ టెల్ సర్వీసులకు వేర్వేరుగా బిల్లులు చెల్లించే ఇబ్బంది తొలగి పోతుందని కంపెనీ చెబుతోంది. ఉపయోగాలు వేర్వేరు బిల్లలు కట్టే శ్రమ తప్పుతుంది. సమయం ఎక్కువగా పట్టే ఐవీఆర్ పద్దతిలో కాకుండా ఒక నిమిషం వ్యవధిలోనే కస్టమర్ కేర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడవచ్చు. రెండు వేర్వేరు సేవలకు సంబంధించి ప్లాన్స్‌ను ఒకే బండిల్లో పొందవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్‌ను డౌన్లోడు చేసుకుంటే అందులో ఎయిర్టెల్ బ్లాక్‌కి సంబంధించిన పూర్తి సమాచారం , ప్లాన్ వివరాలు ఉంటాయి. చదవండి : వోడాఫోన్ ఐడియా మూతపడనుందా? -
ఇంటింటికి ఇంటర్నెట్ ఎక్కడ..?
విజయనగరం గంటస్తంభం: ఇంటింటికి తక్కువ ధరకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా ప్రజలకు మాత్రం చేరువ కావడం లేదు. అనుకున్న సమయం సమీపిస్తున్నా ఇంకా చాలా గ్రామాలకు కనెక్టవీటీ సౌకర్యమే లేదు. ఇక ఇళ్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు చేరలేదు. దీంతో చాలా కుటుంబాలకు ఫైబర్ గ్రిడ్ సేవలు ఇప్పట్లో అందేటట్లు కనిపించడం లేదు. టెక్నాలజీ కోసం ఎక్కువగా మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కేవలం రూ.145 టీవీ, ఇంటర్నెట్, సెల్‌ఫోన్ వినియోగించే విధంగా చేస్తామన్నారు. ఈ మాటలని మూడేళ్లు దాటిపోయింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం ప్రారంభమైనా జిల్లాలో అన్ని గ్రామాలు, అన్ని ఇళ్లకు మాత్రం సేవలందలేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి ప్రభుత్వం చెప్పినట్లు ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా కనెక్షను ఇవ్వాల్సి ఉంది. అంటే ఇందుకు ముందు అన్ని మండలాలకు, అక్కడ నుంచి గ్రామాలకు, తద్వారా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలి. ఇందులో భాగంగా ఫైబర్ గ్రిడ్ సంస్థ అధికారులు జిల్లాలో అన్ని మండలాలకు కనెక్షన్లు మాత్రం ఇవ్వగలిగారు. జిల్లా కేంద్రం విద్యుత్ సబ్ స్టేషన్లకు కనెక్షన్లు ఇచ్చారు. అక్కడ నుంచి గ్రామాలకు ఇచ్చేందుకు కేబుల్ అపరేటర్లను ప్రోత్సహించారు. దీనిలో భాగంగా ఇప్పటికే వారిపై ఒత్తిడి పెంచి సేవలందించేలా చూడాలని కోరారు. కానీ జిల్లాలో అనుకున్న మేరకు సేవలు అందలేదు. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటివరకు 280 పంచాయతీలకు మాత్రమే సేవలందించారు. ఇక ప్రభుత్వపరంగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాలన్నింటికీ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా 95 పంచాయతీలకు మాత్రమే ఇచ్చారు. జిల్లాలో వేలాది పాఠశాలలు ఉండగా 70 స్కూళ్లకు మాత్రమే ఇచ్చారు. 2011 జనాభా లెక్కలు ప్రకారం చూస్తే 5.85 లక్షలు, రేషన్‌కార్డులు ప్రకారం చూస్తే 7.50 లక్షల కుటుంబాలు జిల్లాలో ఉండగా ఇప్పటివరకు 30,700 కనెక్షన్లు ఇచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం డిసెంబర్ నాటికి అన్ని ఇళ్లకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 5 శాతం ఇళ్లకు ఇవ్వకపోవడం గమనార్హం. కనెక్షన్‌కు నిరాసక్తత.. జిల్లాలో ఫైబర్ గ్రిడ్ కనెక్షన్‌కు జనం ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కేవలం నెలకు రూ.145కే కనెక్షను ఇస్తామని చెప్పినా ఎవరైనా తీసుకోవాలంటే తడిపిమోపుడవుతుంది. పేరుకు రూ.145 అయినా దానిపై ఏకంగా 18శాతం జీఎస్టీ పడుతుంది. అంటే దాదాపుగా 25 అదనంగా పడుతుంది. నెలనెలా పరిస్థితి ఇదైతే కనెక్షను వేసుకునేటప్పుడు మరింత భారం పడుతుంది. గ్రామానికి కనెక్షన్ కావాలంటే కేబుల్ అపరేటరు విద్యుత్ సబ్‌స్టేషను నుంచి ఎంత కేబుల్ వైరు కావాలంటే అంత వేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా భారంతో కూడుకున్న పని. వాస్తవానికి వారికి ఇప్పటికే గ్రామాల్లో ఇతర కేబుల్ కనెక్షన్లు ఉన్నందున ఫైబర్‌గ్రిడ్‌పై ఆసక్తి చూపడం లేదు. సరే ఏదోలా గ్రామాలకు తీసుకెళ్లినా జనం తీసుకోవడం లేదు. ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్ అడిగితే కేబుల్ అపరేటర్లు వైరు రూపంలో భారీగా బాదుతున్నారు. దీంతో ఇప్పటికే టీవీకి కనెక్షన్, సెల్‌ఫోన్ వినియోగం చేస్తున్నందున కొత్తగా ఈ సేవలు లేకపోయినా ఏమవుతుందన్న దోరణిలో చాలా మంది ఉన్నారు. ఇక నెట్ స్పీడ్ కూడా తక్కువగా ఉండడంతో సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిని అధిమిస్తే అందరికి ఫైబర్ సేవలందేది. కానీ ప్రభుత్వం ధర విషయంలో వెనక్కి తగ్గకపోవడం, కేబుల్ అపరేటర్లు, జనం ముందుకు రాకపోవడం, విస్తరించాలన్న ఉద్దేశంతో సంబంధిత అధికారులు పని చేయకపోవడంతో ఇప్పటికైతే అన్ని గ్రామాలకు సేవలందలేదు. మరో ఏడాది లోపల అందుతాయన్న నమ్మకం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి. క్రమేపీ విస్తరిస్తాం.. ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీని క్రమేపీ జిల్లాలోని అన్ని గ్రామాలకు విస్తరిస్తాం. డిసెంబర్ నాటికి ఇవ్వడం సాధ్యం కాదు. ప్రత్యేకంగా లక్ష్యం అంటూ ఏదీ లేదు. దశల వారీగా విస్తరిస్తాం. మార్కెటింగ్ అధికారులు కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడి కనెక్షన్లు ఇస్తాం.– సీతారాం, ఫైబర్ గ్రిడ్ మేనేజర్. -
అక్టోబర్ నుంచి ఫైబర్ నెట్ సేవలు
* 90 శాతం సాంకేతిక పనులు పూర్తి * విద్యుత్ సబ్ స్టేషన్ల నుంచే ఫైబర్ నెట్ సిగ్నల్ * రూ.149 కే కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం గుంటూరు (నగరంపాలెం): జిల్లాలో అతి తక్కువ ఖర్చుతో కేబుల్ టీవీ ప్రసారాలు, ఫోన్, ఇంటర్ నెట్ సౌకర్యం మరో నెలరోజుల్లోనే రానుంది. ప్రస్తుతం సగటు వినియోగదారుడు కేబుల్‌టీవీకి రూ.200, ఇంటర్నెట్ కమ్ ఫోన్‌కు రూ.800 కలిపి మొత్తం రూ.1000 ఖర్చు అవుతుండగా,ఈ సేవలన్నీ కలిపి కేవలం రూ.149కే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఫైబర్‌నెట్ వర్క్ సేవలు అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. అంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ విద్యుత్ డిస్కంలు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ నెట్ పనులు ప్రారంభించారు. దీని కోసం విద్యుత్‌శాఖకు సంబంధించిన స్తంభాల మీదుగా ఆప్టికల్ ఫైబర్ వైరు ఏర్పాటు చేయడంతో పాటు సబ్స్టేషన్లలో సిగ్నల్ బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఒక మాస్టర్ నోడ్ (కంట్రోల్ రూం), నాలుగు జోనల్ నోడ్లు, 52 మండలనోడ్లు,155 సిగ్నల్ స్టేషన్ (ఎస్ఎస్) నోడ్లు మొత్తం 211 విద్యుత్ సబ్స్టేషన్లలో ఇప్పటికే సిగ్నల్ సర్వర్ నోడ్ ఏర్పాటు చేశారు. వీటిని కలుపుతూ నెట్వర్కింగ్ సిగ్నల్ కోసం 24 కోర్ సామర్ధ్యం ఉన్న ఆప్టికల్ ఫైబర్ వైరు 2073 కి.మీ ఏర్పాటు చేశారు. స్టేట్ రింగ్ నుంచి తీసుకున్న సిగ్నల్ గుంటూరు నగరంలో ఏర్పాటుచేసిన మాస్టర్ నోడ్కి, తెనాలి, బాపట్ల, పిడుగురాళ్ళ, నరసరావుపేట సబ్‌స్టేషన్‌లోని జోనల్ నోడ్కి వెళుతుంది. జోనల్ నోడ్ నుంచి వచ్చిన సిగ్నల్ మండల నోడ్ల ద్వారా ఎస్ఎస్ నోడ్లకు చేరుతుంది. ఇక్కడి నుంచే ఏపీఎస్ఎఫ్ఎల్ తో అగ్రిమెంట్ చేసుకున్న కేబుల్ ఆపరేటర్లు ద్వారా ఇళ్లకు కనెక్షన్లు అందిస్తారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో 100 కి.మీ మినహా 90 శాతం ఆప్టికల్ఫైబర్ పనులు పూర్తయ్యాయి. బేసిక్ ప్యాకేజీ నెలకు రూ.149.. ఫైబర్ నెట్ వర్క్ ద్వారా బేసిక్ ప్యాకేజీ కింద నెలకు రూ. 149కే కేబుల్‌టీవీ, ఫోన్, నెట్ సౌకర్యం రానుంది. టీవీలో 100 ఫ్రీ చానల్స్‌తో పాటు, 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5 జీబీ ఇంటర్నెట్ డేటా, రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ నెట్ వర్క్ ద్వారా ఫోన్ సౌకర్యం ఉన్న వారితో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇంట్లోకి వచ్చిన ఆప్టికల్ ఫైబర్ వైరుకు ఐపీటీవీ బాక్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా టీవీ, ఫోను, ఇంటర్నెట్ కోసం వైఫై సౌకర్యం పొందవచ్చు. పే చానల్స్ కోసం, ఎక్కువ డేటా, ఇతర ఫోన్లకు మాట్లాడుకోవడానికి త్వరలో ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. ఫైబర్ నెట్ ద్వారా వచ్చే ఫోన్‌కు ప్రారంభంలో 797 నంబరును కేటాయించారు. ప్రభుత్వకార్యాలయాలకు, వాణిజ్య అవసరాల కోసం 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ వర్క్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 1350 ఎంఎస్‌వోలు (కేబుల్ ఆపరేటర్లు) సిగ్నల్ కోసం ఏపీఎస్ఎఫ్ఎల్కు దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు నగరం బ్రాడీపేటలో పది రోజుల్లో జిల్లా కార్యాలయం ప్రారంభం కానుంది.