![Broadcast Tariff Hike Might Lead To Customer Churn From TV To OTT - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/21/dth-services-hike_0.jpg.webp?itok=883lmtYa)
టీవీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్..! ఈ ఏడాది డిసెంబరు నుంచి డీటీహెచ్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు నెట్‌వర్క్ కంపెనీలు టీవీ ఛానళ్ల రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. న్యూ టారిఫ్ ఆర్డర్ 2.0 (ఎన్‌టీవో)లో భాగంగా జీ, స్టార్, సోనీ, వైకామ్18 వంటి సంస్థలు అందించే ఛానళ్లను ఆయా ప్యాకేజ్ నుంచి తీసివేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీవీ ప్రేక్షకులపై అదనంగా 35 నుంచి 50 శాతం మేర ఛార్జీల మోత మోగనుంది.
2017లో ట్రాయ్ ఎన్‌టీఓ పాలసీను తీసుకువచ్చింది. ఎన్‌టీఓ 2.0 తో టీవీ ప్రేక్షకులకు నచ్చిన ఛానల్‌కు మాత్రమే ఛార్జీలను చెల్లించే సదుపాయాలను కల్పించింది. ట్రాయ్ తెచ్చిన ఎన్‌టీవో 2.0 పాలసీ మేరకు పలు నెట్‌వర్క్ కంపెనీలకు భారీగా గండి పడుతోంది.దీంతో అత్యధిక ప్రాచుర్యం పొందిన ఛానళ్లను బండిల్ ఆఫర్ల నుంచి తీసివేయాలని నెట్‌వర్కింగ్ కంపెనీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వారికి మాత్రం పండగే..!
డీటీహెచ్ సేవల పెంపు నిర్ణయం ఓటీటీ సేవలకు కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 రాకతో దేశవ్యాప్తంగా ఓటీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డీటీహెచ్ సేవలకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఎందుకు డబుల్ చెల్లించాలనే భావనతో ప్రేక్షకులు ఉండగా....వీటీలో ఎదో ఒక దానికి మాత్రమే సబ్‌స్రైబ్ చేసుకునే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, సోనీ లివ్, వూట్ సెలక్ట్, జీ5, సన్‌నెక్ట్స్ వంటి ఓటీటీలు ఏడాదికి రూ.3645 ఖర్చు అవుతోంది. అదే డీటీహెచ్ బేస్ సేవలకు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Revolt Motors: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు రివోల్ట్ శుభవార్త..!
Comments
Please login to add a commentAdd a comment