Hike charges
-
ఎవరెస్ట్ అధిరోహకులకు షాక్
కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్టు అధిరోహించాలనుకునే వారికి నేపాల్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. హిమాలయ శిఖరాన్ని దక్షిణం దిశ నుంచి మార్చి– మే మధ్య వసంత రుతువులో అధిరోహించాలనుకునే విదేశీయులు ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తున్న ఫీజు మొత్తాన్ని రూ.9.50 లక్షల నుంచి ఏకంగా రూ.13 లక్షలకు పెంచేసింది. సెప్టెంబర్–నవంబర్ మధ్యన ఫీజును రూ.4.75 లక్షల నుంచి రూ.6.48 లక్షలకు పెంచింది. శీతాకాలంలో డిసెంబర్–ఫిబ్రవరి మధ్య, వర్షాకాలం జూన్–ఆగస్టు సీజన్లలో ఒక్కో వ్యక్తి చెల్లించే ఫీజును రూ.2.37 లక్షల నుంచి రూ.3.24 లక్షలకు పెంచామని గురువారం ప్రకటించింది. నేపాలీ వ్యక్తులైతే వసంత రుతువులో చెల్లిస్తున్న రూ.75 వేల ఫీజును రూ.1.50 లక్షలకు పెంచినట్లు తెలిపింది. నూతన షరతులు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. పర్వతారోహణ పూర్తయిన వారు తమ వెంట తీసుకెళ్లిన మల విసర్జన బ్యాగ్‌ను తిరిగి బేస్ క్యాంపునకు వచ్చి, సక్రమంగా వదిలివేయాల్సి ఉంటుంది. 8 వేల మీటర్లకు పైగా శిఖరాలను అధిరోహించే వారు వ్యర్థాలను సేకరించేందుకు బయో డీగ్రేడబుల్ బ్యాగ్‌లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపింది. అంతేకాదు, పర్యాటక శాఖ అనుమతించిన వస్తువులనే వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
ఇంటి రుణం.. భారం దింపుకుందాం
గృహ రుణం.. రెండేళ్ల క్రితం వరకు ఇల్లు కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా కనిపించిన సాధనం. కేవలం 6.7 శాతం వార్షిక రేటుపై ఇంటి కొనుగోలుకు రుణం లభించింది. కానీ, స్థూల ఆరి్థక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆర్బీఐ కీలక రేటును 2022 మే నుంచి 2.5 శాతం మేర పెంచింది. ఫలితంగా గృహ రుణం రేట్లు 9.5–10 శాతానికి చేరాయి. దీంతో అప్పటికే ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ భారంగా మారింది. 15 ఏళ్ల కనిష్టాలకు చేరిన గృహ రుణ రేట్లు ఒక్కసారిగా భారంగా మారాయి. ఆ తర్వాత ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి కొంత మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా కఠినతర ద్రవ్య విధానం దాదాపు చివరి దశకు చేరింది. దీంతో వడ్డీ రేట్ల పెంపు సైతం ముగింపునకు వచ్చేసిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్బీఐ సైతం రేట్ల యథాతథ స్థితినే కొనసాగిస్తోంది. అయినా కానీ, వడ్డీ రేట్ల తగ్గింపునకు మరికొన్ని త్రైమాసికాలు వేచి చూడాల్సి రావచ్చని భావిస్తున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్ల పెంపు భారాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. ఈ తరుణంలో ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో బ్యాలన్స్‌ను మరో రుణదాతకు బదిలీ చేసుకోవడం ఒకటి. దాని గురించి వివరించే కథనం ఇది... ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి ప్రస్తుత ఈఎంఐ భారంగా అనిపిస్తే, అప్పుడు ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను ఒక్కసారి పరిశీలించాలి. ఇతర సంస్థలతో పోలిస్తే మీ బ్యాంక్ అధిక రేటు వసూలు చేస్తున్నట్టు గుర్తిస్తే కనుక, అప్పుడు దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఇలా మిగిలి ఉన్న రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకునే ముందు, ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ, ఇందుకు అయ్యే చార్జీలు, అసలు బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంత మేర? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. ఫ్లోటింగ్ రేటు విధానంలో రేట్లను ఎలా నిర్ణయిస్తారనేది కూడా తెలుసుకోవాలి. రేట్ల విధానాలు.. గృహ రుణంపై ఫిక్స్డ్ (స్థిర), ఫ్లోటింగ్ (అస్థిర) రేట్ల విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్ రేటు రుణాలు ఆర్బీఐ కీలక రేట్ల సవరణకు అనుగుణంగా మార్పులకు లోనవుతుంటాయి. ఫిక్స్డ్ రేట్ విధానంలో నిరీ్ణత కాలం పాటు రుణంపై ఒకటే రేటు కొనసాగుతుంది. కనుక ఫ్లోటింగ్ రేట్ రుణాలతో పోలిస్తే ఫిక్స్డ్ రేట్ రుణాలపై వడ్డీ రేటు 1.5–2 శాతం వరకు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక శాతం గృహ రుణాలు ఫ్లోటింగ్ రేట్ విధానంలోనే ఉంటున్నాయి. ఆర్బీఐ 2016లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులపై అయ్యే వ్యయంతోపాటు, జీ–సెక్ ఈల్డ్స్, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ తదితర అంశాలు ఈ విధానంలో రేట్లను ప్రభావితం చేస్తాయి. బ్యాంక్ సొంతంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంసీఎల్ఆర్ విధానంలో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ అంటే క్లుప్తంగా నిధులపై బ్యాంక్‌లకు అయ్యే వ్యయం. దీనికి అదనంగా తనకు కావాల్సిన మార్జిన్‌ను బ్యాంక్ జోడించి రుణాలపై రేటును నిర్ణయిస్తుంది. ఆర్బీఐ రేట్లను మార్చినప్పుడు ఎంసీఎల్ఆర్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ, వెంటనే కాదు. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది సమయం తీసుకుంటుంది. ఎంసీఎల్ఆర్లో ఒక్క రెపో రేటు కాకుండా, ఇతర అంశాలు కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. నిజానికి ఎంసీఎల్ఆర్ విధానం అంత పారదర్శకమైనది కాదు. రిటైల్ రుణ గ్రహీతలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఈ లోపాలను అధిగమించేందుకు వీలుగా ఆర్బీఐ 2019లో రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)ను ప్రవేశపెట్టింది. రుణం బదిలీతో ఆదా ఎంత? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు సాధారణంగా బ్యాంక్‌లు గృహ రుణాలపై ఈఎంఐని పెంచడానికి బదులు, రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. దాంతో ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో ఇబ్బందేమీ లేదన్నట్టు వ్యవహరించరాదు. ప్రస్తుత బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో మెరుగైన డీల్ కోసం సంప్రదించాలి. సానుకూల స్పందన రానప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని మరో బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి. బ్యాలన్స్ బదిలీకి సంబంధించి అర్హత ఉందా? అన్నది తెలుసుకోవాలి. బ్యాలన్స్ బదిలీకి అనుమతించే విషయంలో కొన్ని బ్యాంక్‌లు, పూర్వపు సంస్థ వద్ద కనీసం 24 నెలల పాటు అయినా క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించిన చరిత్రను అడుగుతున్నాయి. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, లేదా స్వా«దీనం చేసిన ఇళ్లకు సంబంధించి రుణం బ్యాలన్స్ బదిలీకే బ్యాంక్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటికి అదనంగా వేతనం, క్రెడిట్ స్కోర్ కూడా కీలకమవుతాయి. ముఖ్యంగా మిగిలిన రుణాన్ని, తక్కువ వడ్డీ రేటుకు ఆఫర్ చేస్తున్న మరో సంస్థకు బదిలీ చేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకుందామని భావించే వారు.. అసలు ఎంత ఆదా అవుతుందన్న దానిపై అంచనాకు రావాలి. ఉదాహరణకు రూ.75 లక్షల రుణం, 20 ఏళ్ల కాలానికి మిగిలి ఉందని అనుకుందాం. 9.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా దీని ఈఎంఐ రూ.69,910 అవుతుంది. ఈ రుణాన్ని బదిలీ చేసుకుంటే, కొత్త సంస్థ 9.1 శాతం రేటుకు ఆఫర్ చేసిందనుకుంటే, అప్పుడు ఎంతో ఆదా అవుతుంది. కొత్త సంస్థ వద్ద 9.1 శాతం రేటు ప్రకారం ఇదే రుణంపై ఈఎంఐ రూ.67,963 అవుతుంది. 20 ఏళ్ల కాలంలో రూ.4,67,280 ఆదా అవుతుంది. ఇది ఏడు నెలల ఈఎంఐకి సమానం. అంటే రుణం ఏడు నెలల ముందే తీరిపోతుంది. మరో సంస్థకు రుణాన్ని బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఇలా ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత పెరిగిన ఆదాయం, మెరుగుపడిన క్రెడిట్ స్కోర్, మెరుగైన చెల్లింపుల చరిత్ర ఆధారంగా కొత్త సంస్థ తక్కువ రేటుకు ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. వడ్డీ రేటు ఎంత తగ్గితే ఆదా అయ్యే మొత్తం అధికంగా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తక్కువ రేట్లకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. 0.25–0.50 శాతం మేర వడ్డీ తక్కువగా ఉండి, రుణ చెల్లింపుల కాలం మరో 15 ఏళ్లు అయినా ఉంటే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. 2024 మధ్య నుంచి వడ్డీ రేట్లు తగ్గితే, అప్పుడు ఈఎంఐ భారం మరింత దిగొస్తుంది. రూ. 20,000 వరకు చార్జీలు రుణ బదిలీలకు సంబంధించి న్యాయపరమైన, సాంకేతిక మదింపు చార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇవి రూ.5,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటాయి. కొన్ని బ్యాంక్‌లు విడిగా పేర్కొనకుండా, ఈ మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజులో కలిపేస్తున్నాయి. కనుక చార్జీల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకోవాలి. ఇక మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ (ఎంవోడీటీ) గురించి కూడా తెలుసుకోవాలి. రుణ గ్రహీత తన ఇంటి డాక్యుమెంట్లను రుణదాతకు స్వా«దీనం చేయడం. రుణం ఇచ్చే సంస్థ తన పేరిట ఆ ప్రాపరీ్టని రిజి్రస్టేషన్ చేయించుకుంటుంది. ఇందుకు అయ్యే చార్జీలను రుణ గ్రహీత భరించాల్సి వస్తుంది. ఈ చార్జీలు రుణంలో 0.1–0.2 శాతంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి తగ్గింపు రాదు. సుమారు రూ.75 లక్షల గృహ రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేసుకుంటున్నారని అనుకుంటే, ఇందుకోసం పలు రకాల చార్జీల రూపంలో రూ.62,500 వరకు కోల్పోవాల్సి వస్తుంది. లీగల్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజుల్లో తగ్గింపు పొందడం ద్వారా ఈ భారాన్ని వీలైనంత తగ్గించుకోవచ్చు. పారదర్శక.. రెపో లింక్డ్ లెండింగ్ రేట్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఎంతో పారదర్శకమైనది. రెపో రేట్‌కు బ్యాంక్‌లు తమకు కావాల్సిన మార్జిన్‌ను కలిపి రుణాలపై రేట్లను నిర్ణయిస్తాయి. దీంతో రుణ గ్రహీతలు సైతం సులభంగా అర్థం చేసుకోగలరు. రెపో రేటు పెరిగి, తగ్గినప్పుడు తమపై పడే భారం ఎంతన్నది సులభంగా తెలుసుకోగలరు. అంతేకాదు రేట్ల విధానం సులభంగా ఉండడంతో, ఆర్బీఐ రెపో రేటును సవరించిన వెంటనే బ్యాంక్‌లు రుణ గ్రహీతలకు దాన్ని బదలాయిస్తాయి. సాధారణంగా ఆర్బీఐ రెపో రేటు సవరణ అనంతరం వారం నుంచి నెల రోజుల వ్యవధిలో ఆర్ఎల్ఎల్ఆర్ రుణాల రేట్లు మార్పులకు లోనవుతాయి. రెపో రేటు విధానంలో.. వడ్డీ రేట్లు తగ్గించడం, పెంచడం వేగంగా జరుగుతుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఆ భారం వెంటనే రుణ గ్రహీతలకు బదలాయింపు అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఈ విధానంలో బ్యాంక్‌లు సాధారణంగా రెపో రేటుపై 2.5–3 శాతాన్ని తమ మార్జిన్ కింద చార్జ్ చేస్తుంటాయి. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంక్‌లు 9.5–10 శాతం వసూలు చేస్తున్నాయి. రెపో రేటు 6.5 శాతంపై 3–3.5 శాతం మార్జిన్‌గా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్బీఎఫ్సీలు అయితే 10.5 శాతం వరకు చార్జ్ చేస్తున్నాయి. అయితే, ఇదే రేటు అందరికీ ప్రామాణికంగా అమలవుతుందని చెప్పలేం. రుణం మొత్తం, కాల వ్యవధి, క్రెడిట్ స్కోర్ తదితర అంశాలు కూడా రేటుపై ప్రభావం చూపిస్తాయి. రేట్ల అస్థిరతలు పెద్ద పట్టింపు కాదంటే, రిటైల్ రుణ గ్రహీతలకు ఎంసీఎల్ఆర్ కంటే ఆర్ఎల్ఎల్ఆర్ రేటు అనుకూలంగా ఉంటుంది. చార్జీల పట్ల అవగాహన ఫిక్స్డ్ వడ్డీ రేటు విధానంలో రుణం తీసుకున్న వారు, మరో సంస్థకు దాన్ని బదిలీ చేసుకోవడం ఖరీదైన వ్యవహారమే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రుణం ఇచి్చన సంస్థ మిగిలి ఉన్న రుణాన్ని బదిలీ చేసేందుకు గాను, ఆ మొత్తంపై 2–4 శాతం వరకు చార్జ్ వసూలు చేయవచ్చు. అదే ఫ్లోటింగ్ రేట్ విధానంలో రుణం తీసుకుని ఉంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపుల రుసుములు లేకుండా మిగిలి ఉన్న రుణాన్ని మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీకి బదిలీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపుల చార్జీలను ఆర్బీఐ నిషేధించింది. అయితే రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకోవాలంటే రుణ గ్రహీత కొన్ని రకాల చార్జీలు భరించాల్సి వస్తుంది. అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. రుణంపై (బదిలీ చేసుకునే మొత్తం) 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు కింద చాలా బ్యాంక్‌లు తీసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. నూతన తరం బ్యాంక్‌లు, కొన్ని ఎన్బీఎఫ్సీలు 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నాయి. కాకపోతే అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీల్లో ఒకే మాదిరి చార్జీలు ఉంటాయని అనుకోవద్దు. కనుక ఆయా సంస్థల వెబ్సైట్లకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నేరుగా సంప్రదింపులు చేయడం ద్వారా చార్జీల భారం లేకుండా చూసుకోవచ్చు. బదిలీ చేస్తే అయ్యే వ్యయాలు బదిలీ రుణం :రూ.75 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు రుణంపై: 0.3–3% వరకు లీగల్ ఫీజు :రూ.5,000–20,000 ఎంవోటీడీ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం ఫ్రాంకింగ్ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం -
HYD Metro: మెట్రో ఛార్జీలు పెంపు!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో ప్రాజెక్టులో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ నిర్వహణ, భద్రత.. ఇలా అతి కీలకమైన విధులన్నీ ప్రైవేటు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల చేతుల్లోనే ఉన్నాయి. ఈ విధానం తప్పు కాకపోయినా.. మెట్రో నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న అతిపెద్ద కియోలిస్ సంస్థ ప్రతీ పనిని తిరిగి పలు ప్రైవేటు ఏజెన్సీలకు సబ్‌కాంట్రాక్టు పేరిట అప్పజెప్పింది. సుమారు పదికిపైగా ప్రైవేటు ఏజెన్సీలు మెట్రో జర్నీలో పాలుపంచుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఈ ఏజెన్సీలు చేపట్టే ఉద్యోగుల నియామకాలు, వారికి నెలవారీగా ఇచ్చే జీత భత్యాలు, కారి్మకులు, ఉద్యోగుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు.. చివరకు ఏ ఏజెన్సీ.. ఏ విధులు నిర్వహిస్తోందన్న విషయాల్లోనూ అంతులేని గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. టికెటింగ్ సిబ్బంది సమ్మెతో.. తాజాగా స్టేషన్లలో టికెటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అమీర్‌పేట్ స్టేషన్ వద్ద మెరుపు సమ్మెకు దిగడంతో ఆయా ఏజెన్సీల నిర్వాకం వెలుగుచూసింది. ప్రైవేటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప్పల్ మెట్రో డిపోలో జరిపిన చర్చలు, అరకొరగా పెంచిన వేతనాలు ఉద్యోగుల అసంతృప్తిని పూర్తిస్థాయిలో చల్లార్చకపోవడం గమనార్హం. మూడు కారిడార్లలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉండడం, పని గంటలు, ఇతర భత్యాల విషయంలో తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. నగర ప్రజారవాణా వ్యవస్థలో కొత్త శకం ఆవిష్కరించిన మెట్రో ప్రాజెక్టులో ఇలాంటి విపరిణామాలు చోటు చేసుకోవడం ఆక్షేపణీయమని ప్రజారవాణా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ విషయంలో పారదర్శకత ఉండాలని, ఉద్యోగులకు కనీస వేతనాలు మంజూరు చేయాలని స్పష్టంచేస్తున్నారు. - ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు రూట్లలో నిత్యం 4 నుంచి 4.5 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ నష్టాల నుంచి ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడంలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు, రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ భారంగా పరిణమించింది. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాఫ్ట్‌లోన్ అందకపోవడం మెట్రోకు శాపంగా మారింది. - ఈ నేపథ్యంలో తాజాగా చార్జీల పెంపునకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ప్రస్తుతం ఉన్న కనీస చార్జీని రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీని రూ.60 నుంచి రూ.80 లేదా రూ.100 వరకు పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చార్జీల పెంపుతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండవన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు రవాణా సదుపాయం కలి్పంచకపోవడం, అన్ని స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ వసతుల లేమి కారణంగా ఆశించిన స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదన్నది సుస్పష్టం. -
Hyderabad: మెట్రో జర్నీ మరింత ప్రియం.. సామాన్యుడిపై చార్జీల పిడుగు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీజన్లపై త్వరలో మెట్రో చార్జీల పిడుగు పడనుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి విముక్తి కల్పించేందుకు ఏర్పాటు చేసిన కలల మెట్రోలో జర్నీ సామాన్యుడికి మరింత ప్రియం కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మహానగర పరిధిలో నాలుగేళ్ల క్రితం నుంచి మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. తాజాగా చార్జీల సవరణ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆర్డర్ నెం. కె–14011/29/2018–ఎంఆర్టీఎస్–2 ప్రకారం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేంద్రకుమార్ బగ్డె, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యామ్ప్రసాద్ల ఆధ్వర్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నగర వాసులు, మెట్రో ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని హెచ్ఎంఆర్ బహిరంగంగా ప్రకటించింది. నవంబరు 15 వరకు గడువు ఇచ్చింది. నగరవాసులు ‘ఎఫ్ఎఫ్సీహెచ్ఎంఆర్ఎల్ ఎట్రేట్జీమెయిల్.కామ్’కు సలహాలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని కోరింది. చార్జీల వడ్డింపుతో నిరాదరణే.. నగరంలో తొలిదశ మెట్రో ప్రాజెక్టు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు రూట్లలో 57 రైళ్లను నడుపుతున్నారు. నిత్యం సుమారు 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రోలో కనీస చార్జీ రూ.10 గరిష్టంగా రూ.60 వసూలు చేస్తున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం, తమ ఇళ్ల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు ప్రత్యేకంగా షటిల్ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మెట్రో అధికారుల ముందస్తు అంచనాల మేరకు ఈ మూడు రూట్లలో 16 లక్షల మంది జర్నీ చేస్తారని అంచనా వేసినప్పటికీ.. పలు కారణాల రీత్యా మెట్రోకు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా చార్జీలు మరింత పెంచితే ప్రయాణికుల నిరాదరణ తప్పదని ప్రజారవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణం అంచనాలు, వినియోగ వ్యయాలు, మెట్రో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మెట్రో చార్జీలను సవరించనున్నట్లు తెలిసింది. నగర మెట్రోలో కనీస చార్జీ ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీ రూ.60 నుంచి రూ.100కి పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం..త్వరలోనే ఆర్టీసీ చార్జీల పెంపు..!
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. చార్జీలు పెంచుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు సానుకూలత వ్యక్తం చేయటంతో, గత డిసెంబర్లోనే ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన సర్కారుకు సమర్పించింది. సీఎం ఓకే అంటే ఆ మేరకు చార్జీలు పెరిగేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. తాజాగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీని పునరాలోచనలో పడేశాయి. దీంతో గత ప్రతిపాదనను సవరించి కొత్త ప్రతిపాదన సమర్పిస్తోంది. తాజా ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే చార్జీలు అనూహ్యంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. పాత ప్రతిపాదన ప్రకారం ప్రజలపై సాలీనా రూ.850 కోట్ల భారం పడనుండగా, కొత్త ప్రతిపాదన ప్రకారం అది రూ.1,200 కోట్ల వరకు ఉండనుందని ఆర్టీసీ వర్గాల సమాచారం. కిలోమీటరుకు 40 పైసల నుంచి 50 పైసల వరకు పెంచేలా తాజా ప్రతిపాదన రూపొందిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తున్న దానిపై ప్రయాణికుల జేబుపై పడే భారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ అధికారులు మాత్రం పూర్తి గోప్యత పాటిస్తున్నారు. అసలే నష్టాలు..ఆపై కోలుకోలేని దెబ్బ ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఆ నష్టం విలువ రూ.2 వేల కోట్లకు చేరుకునేలా ఉంది. దీంతో గత డిసెంబర్లోనే కి.మీ.కు ఆర్డినరీ బస్సులపై 25 పైసలు, మిగతా కేటగిరీ బస్సులపై 30 పైసలు పెంచాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి సంస్థ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది. కాగా మూలిగే నక్కపై తాడిపండు పడిన చందాన.. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో ఆర్టీసీపై కోలుకోలేని దెబ్బ పడుతోంది. నెలకు 18 కోట్ల నుంచి 20 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్న ఆర్టీసీ చమురు కంపెనీల నుంచి బల్క్‌గా కొంటోంది. ఈ ఒప్పందం మేరకు రిటైల్ కంటే లీటరుపై రూ.4 వరకు తగ్గింపు పొందుతోంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టీసీకి అందే డీజిల్ లీటరు ధర రూ.91 వరకు ఉంది. 17న అది ఒక్కసారిగా పెరిగి రూ.97కు చేరుకుంది. దీంతో సంస్థ బల్క్ కొనుగోలు ఆపి రిటైల్‌గా కొనటం ప్రారంభించింది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర లీటరుకు దాదాపుగా రూ.104కు చేరుకుంది. యుద్ధం కొనసాగితే వచ్చే వారం రోజుల్లో అది రూ.112ను దాటుతుందని అంటున్నారు. ప్రస్తుతం బంకుల్లో డీజిల్ ధర రూ.94.62గా ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే ఈ ధర కూడా భగ్గుమనే ప్రమాదం ఉంది. బల్క్ సరఫరా ధరలను మించిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ కచ్చితంగా మళ్లీ బల్క్‌గా కొనాల్సిందే. అయితే చమురు కంపెనీలు ఒప్పందానికి కట్టుబడి అప్పటి ధరపై రూ.4 డిస్కౌంట్ ఇస్తాయా. లేదా? అన్నది చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీపై ఏటా సుమారు రూ.340 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లోపే ప్రభుత్వానికి.. లీటరు ధర రూ.91 ఉన్న సమయంలో నష్టాలను అధిగమించేందుకు సాలీనా రూ.850 కోట్ల అదనపు రాబడి లక్ష్యంగా చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆర్టీసీ ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు అదనంగా రూ.340 కోట్ల వార్షిక భారం పెరిగితే, ఆ భారాన్ని కూడా ఆర్టీసీ ప్రజలపైనే మోపే అవకాశం ఉంది. అంటే తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలు వార్షికంగా రూ.1,200 కోట్లకు చేరతాయి. చార్జీలు కి.మీ.కు 40 పైసలను మించి పెరుగుతాయి. ఈ మేరకు అధికారులు రెండు, మూడురకాల కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే ప్రభుత్వానికి అందించి, వీలైనంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
టీవీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్...!
టీవీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్..! ఈ ఏడాది డిసెంబరు నుంచి డీటీహెచ్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు నెట్వర్క్ కంపెనీలు టీవీ ఛానళ్ల రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. న్యూ టారిఫ్ ఆర్డర్ 2.0 (ఎన్టీవో)లో భాగంగా జీ, స్టార్, సోనీ, వైకామ్18 వంటి సంస్థలు అందించే ఛానళ్లను ఆయా ప్యాకేజ్ నుంచి తీసివేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీవీ ప్రేక్షకులపై అదనంగా 35 నుంచి 50 శాతం మేర ఛార్జీల మోత మోగనుంది. 2017లో ట్రాయ్ ఎన్టీఓ పాలసీను తీసుకువచ్చింది. ఎన్టీఓ 2.0 తో టీవీ ప్రేక్షకులకు నచ్చిన ఛానల్‌కు మాత్రమే ఛార్జీలను చెల్లించే సదుపాయాలను కల్పించింది. ట్రాయ్ తెచ్చిన ఎన్టీవో 2.0 పాలసీ మేరకు పలు నెట్వర్క్ కంపెనీలకు భారీగా గండి పడుతోంది.దీంతో అత్యధిక ప్రాచుర్యం పొందిన ఛానళ్లను బండిల్ ఆఫర్ల నుంచి తీసివేయాలని నెట్వర్కింగ్ కంపెనీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి మాత్రం పండగే..! డీటీహెచ్ సేవల పెంపు నిర్ణయం ఓటీటీ సేవలకు కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 రాకతో దేశవ్యాప్తంగా ఓటీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డీటీహెచ్ సేవలకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఎందుకు డబుల్ చెల్లించాలనే భావనతో ప్రేక్షకులు ఉండగా....వీటీలో ఎదో ఒక దానికి మాత్రమే సబ్‌స్రైబ్ చేసుకునే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, సోనీ లివ్, వూట్ సెలక్ట్, జీ5, సన్‌నెక్ట్స్ వంటి ఓటీటీలు ఏడాదికి రూ.3645 ఖర్చు అవుతోంది. అదే డీటీహెచ్ బేస్ సేవలకు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Revolt Motors: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు రివోల్ట్ శుభవార్త..! -
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50
►పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే అన్ని పెద్ద స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేంరుకు ఆ నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణికులు లేని కారణంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 1 మధ్య ప్రయాణించాల్సిన 23 రైళ్లను సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. చెన్నైలోనూ ప్లాట్ ఫాం టికెట్ ధరను దక్షిణ రైల్వే రూ. 50 చేసింది. ►అఫ్గానిస్తాన్, ఫిలిప్పైన్స్, మలేసియాల నుంచి మార్చి 31 వరకు భారత్‌కు ఎవరూ రాకూడదని నిషేధం విధించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు, టర్కీ, బ్రిటన్ల నుంచి ప్రయాణికులను భారత్ ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. ►రాష్ట్రంలో ఏ నగరాన్నీ లాక్డౌన్ చేయాలని అనుకోవడం లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకో వాలని, లేదంటే, అన్ని రైలు, బస్సు ప్రయాణాలను నిషేధిస్తామని హెచ్చరించారు. కరోనా ముప్పు నేపథ్యంలో అన్ని పరీక్షలను వాయిదా వేశామన్నారు. ►కరోనా కట్టడికి రూ. 200 కోట్లతో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమత ప్రకటించారు. మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా హాల్స్, స్టేడియంలు, ఆడిటోరియంలను, ఏప్రిల్ 15 వరకు అన్ని విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశించారు. ►విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ముందుజాగ్రత్తగా తన ఇంట్లో ఏకాంతవాసంలోకి వెళ్లారు. ఆయన మార్చి 14న కేరళలో ఒక ఆసుపత్రి(ఎస్సీటీఐఎంఎస్టీ)ని సందర్శించారు. ఇటీవల స్పెయిన్ వెళ్లివచ్చిన ఆ ఆసుపత్రి వైద్యుడికి వైరస్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఆ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ►ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయాలు, ఇతర ప్రైవేటు పాఠశాలలు పరీక్షల ఫలితాలు ఆన్లైన్లోనే ప్రకటించాలని, పేరెంట్–టీచర్ మీటింగ్స్‌ను జరపకూడదని నిర్ణయించాయి. ►ప్రస్తుతం కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు 72 ఐసీఎంఆర్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని, త్వరలో ఎన్ఏబీఎల్ అక్రెడిటేషన్ పొందిన ప్రైవేటు ల్యాబ్స్ అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. ►మార్చి 31 వరకు ముఖ్యమైన కేసులను మాత్రమే, అదీ ఆడియో– వీడియో కాన్ఫెరెన్స్ ద్వారానే విచారించాలని కేంద్ర సమాచార కమిషన్ నిర్ణయించింది. ►కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మంగళవారం తొలికేసు నమోదైంది. దాంతో ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, సినిమా హాల్స్ మొదలైన వాటిని మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
నేటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు
-
భారీ చార్జీల బాదుడు
టెలికాం సంస్థల మధ్య కొన్నేళ్లుగా హోరాహోరీగా సాగుతున్న టారిఫ్‌ల పోరు చల్లారింది. అవన్నీ ఏకమై ఇప్పుడు వినియోగదారుల పనిపట్టడానికి సిద్ధమయ్యాయి. వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు కాల్, డేటా చార్జీలను సోమవారం అర్థరాత్రి నుంచి దాదాపు 50 శాతం పెంచబోతు న్నట్టు ఆదివారం ప్రకటించాయి. రిలయన్స్ జియో మరో మూడు రోజులు గడిచాక కొత్త రేట్లు అమలు చేస్తానంటూనే ఈ పెరుగుదల 40 శాతంవరకూ ఉండొచ్చునని తెలిపింది. 4జీ ఇప్పటికే పాతబడి 5జీ ఎప్పుడెప్పుడా అని వినియోగదారులంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఊహించని రీతిలో వారికి ఈ ధరల షాక్ తగిలింది. ధరల బాదుడు విషయంలో ఇప్పటికే టెలికాం కంపెనీలు ఓదార్పు వచనాలు పలుకుతున్నాయి. ఈ పెరుగుదల వారంరోజులపాటు టీ కోసం పెట్టే ఖర్చంత కూడా ఉండదని నచ్చజెబుతున్నాయి. మార్కెట్లో రకరకాల కంపెనీలొచ్చాక స్మార్ట్ ఫోన్లు చవగ్గా లభించడం, కాల్ చార్జీలు, డేటా చార్జీలు అందుబాటులోకి రావడం, ఉచిత కాల్స్ లభ్యత తదితరాలన్నీ వినియోగదారుల సంఖ్యను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా 2016లో రిలయన్స్ జియో దూకుడుగా రంగ ప్రవేశం చేయడం ఆ రంగంలో అప్పటికే ఉన్న సంస్థలన్నిటినీ వణికించింది. అపరిమిత వాయిస్ కాల్స్, డేటా టారిఫ్ అత్యంత చవగ్గా ఉండటంతో ఇతర సంస్థలు కూడా ఆ తోవన వెళ్లక తప్పలేదు. ఒకసారంటూ వినియోగదారులను కోల్పోతే మళ్లీ పెంచుకోవడం అసాధ్యమని ఆ సంస్థలు ఆందోళన పడ్డాయి. అప్పటినుంచే పోటాపోటీగా టారి ఫ్ల తగ్గింపు, వాయిస్ కాల్స్, డేటా వినియోగం వంటివాటిపై పరిమితి పెంపు మొదలయ్యాయి. కేంద్రానికి వివిధ టెలికాం సంస్థలు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రం వినియోగ చార్జీల బకా యిల విషయంలో ఈమధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసలే టారిఫ్ పోటీతో నష్టాలు మూట గట్టుకుంటున్న సంస్థల్ని మరింత కుంగదీశాయి. ఆ సంస్థలన్నీ చెల్లించాల్సిన బకాయిలు లక్షా నాలుగువేల కోట్లని లెక్కతేలింది. మొన్న సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి వోడాఫోన్ ఐడియా రూ. 50,921 కోట్లు, ఎయిర్టెల్ 23,045 కోట్లు నష్టాలు ప్రకటించాయి. ఆర్థిక మాంద్యం పర్యవసానంగా ఉపాధి లేమి, నిరుద్యోగితవంటివి పెరిగి, అందరినీ భయ పెడుతున్న వర్తమానంలో ఫోన్ చార్జీలే కాస్త చవగ్గా ఉన్నాయి. ఎవరికి వారు కావలసినప్పుడు, కావలసినంతసేపు మాట్లాడుకోవడానికి వీలుండేది. కాస్త ఖాళీ దొరికిందంటే వాట్సాప్, ఫేస్బుక్ వగైరా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫొటోలు, వీడియోలు వీక్షించడానికి, పంపడానికి, ఛాటిం గ్‌కు అందరూ తహతహలాడేవారు. ఈ మాధ్యమాలు భావ వ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాది మందికి గొంతునివ్వడంతోపాటు ఎందరో ఎదగడానికి తోడ్పడుతున్నాయి. చవగ్గా మొబైల్, కాల్ డేటా లభించడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. కానీ అన్నింటిలో మంచీ చెడు ఉన్నట్టే ఇందులోనూ ఉన్నాయి. ఫోన్ ఒక సామాజిక రుగ్మతగా మారుతోందని, స్థలకాలాదులు కూడా చూసుకోకుండా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దానికి అతుక్కుపోతున్నారని... కుటుంబ బాంధవ్యాలపై కూడా దీని దుష్ప్రభావం పడుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల కరింపులన్నీ గుడ్ మార్నింగ్లకూ, గుడ్నైట్లకూ పరిమితమయ్యాయి. స్వప్రయోజనపరులు, అసాంఘిక శక్తులు ఈ పరిస్థితిని చక్కగా వినియోగించుకుని వదంతులు వ్యాప్తి చేయడం, తప్పుడు సమాచారం ప్రచారంలో పెట్టడం, మార్ఫింగ్‌లు చేయడం ఎక్కువైంది. ఇప్పుడు పెరిగిన టారిఫ్‌లు అలాంటివారందరికీ కళ్లెం వేస్తాయి. కాకపోతే ఈ చెడుతో పాటు మంచిని కూడా కత్తిరిస్తాయి. యూపీఏ హయాంలో ఒకసారి ఎయిర్టెల్ , ఐడియా సంస్థలు చార్జీలు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు టెలికాం మంత్రిగా ఉన్న కపిల్ సిబల్ ఇది సరికాదని హితవు చెప్పారు. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో మాట్లాడి ధరల పెంపు విషయంలో ఏదో ఒకటి చేయమని కోరతామని ప్రభుత్వం తెలిపింది. రోజులు మారాయి. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ప్రపంచం మొత్తం మీద మన దేశంలో మాత్రమే కాల్, డేటా చార్జీలు తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా టారిఫ్‌ల పెంపుదలకు ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు కూడా ఇలాంటి షాకులుం టాయంటున్నారు. ఇది నిజమే కావొచ్చు. కానీ అత్యంత చవకైన చార్జీలతో ఆకర్షించి, కోట్లాదిమంది వినియోగదారుల్ని పెంచుకుంటూపోయి తీరా అందరూ అలవాటు పడ్డాక అదును చూసి భారీ టారిఫ్‌లతో మొత్తడం వ్యాపార సంస్థలకు కొత్తగా అబ్బిన విద్య కాదు. టారిఫ్ పెంపును వారం రోజులకయ్యే టీ ఖర్చుతో ఒక కంపెనీ ప్రతినిధి పోల్చారు. తాను ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఒక విధంగా అది సరైన పోలికే. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు విపరీతంగా పెరిగిన టీ అలవా టుకు మూలం కూడా ఈ వ్యాపార సూత్రంలోనే ఉంది. ఈస్టిండియా కంపెనీ వ్యాపారులు మొదట దాన్ని ఉచితంగా ఇచ్చి అలవాటు చేసి ఆ తర్వాత దానికొక మార్కెట్‌ను సృష్టించు కోగలిగారు. దేశంలో వందకోట్ల మొబైల్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయని ఒక అంచనా. ఇకపై వీరంతా అదనంగా సగటున 50 శాతం వరకూ చెల్లించకతప్పదు. మొబైల్ కనెక్షన్‌కు ఆమధ్య తప్పనిసరి చేసిన కనీస నెల చార్జి కూడా రూ. 35 నుంచి రూ. 49కి పెరిగింది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై కొంత పరిమితి దాటాక నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సివస్తుంది. తాజా నిర్ణయంతో వినియోగ దారులు జారిపోకుండా ఉండటానికి వివిధ సంస్థలు రకరకాల పథకాలతో సిద్ధమవుతున్నాయి. ఏ పేరు పెట్టుకున్నా, ఎన్ని వెసులుబాట్లు కల్పిస్తామంటున్నా దాదాపు గత మూడేళ్లుగా వినియోగ దారులకు దొరికిన స్థాయిలో అవేమీ ఉండవు. స్వర్ణయుగం అనదగ్గ ఆ దశ దాటిపోయింది. అయితే వెనక్కి వెళ్లలేనంతగా వినియోగదారులంతా అలవాటు పడిపోయారు గనుక వారి సంఖ్య తగ్గదని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని పలువురు నిపుణులు వేస్తున్న అంచనాలు ఏమేరకు సరైనవో చూడాల్సి ఉంది. -
సిటీ, పల్లె వెలుగు కనీస చార్జీ రూ.10
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిటీ సర్వీసులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లె వెలుగు బస్సు సర్వీసుల కనిష్ట టికెట్ ధరను రూ. 10గా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ చార్జీ రూ. 5గా ఉంది. టికెట్ చార్జీ పెంచితే తప్ప ఆర్టీసీ మనుగడ అసాధ్యంగా మారడంతో కి.మీ.కి 20 పైసల చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఈ మేరకు అధికారులు శుక్రవారం కసరత్తు చేసి కొత్త టికెట్ ధరలను ప్రాథమికంగా నిర్ణయించారు. సిటీ ఆవల తిరిగే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల లాంటి సాధారణ సర్వీసులకు ప్రస్తుత చార్జీపై కి.మీ.కి 20 పైసలు చొప్పున పెంచనున్నారు. చిల్లర సమస్య రాకుండా దాన్ని తదుపరి మొత్తానికి పెంచుతారు. కానీ తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతున్న సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల విషయంలో కనిష్ట మొత్తాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. అయితే కి.మీ.కి 20 పైసల చొప్పున పెంపునకే సీఎం అనుమతించినందున కనిష్ట మొత్తాన్ని రెట్టింపు చేసే అంశాన్ని శనివారం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆయన అనుమతిస్తే శనివారం సాయంత్రానికి తుది టికెట్ ధరలను ప్రకటించి సోమవారం నుంచి పెంచిన చార్జీలు అమలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ మార్గాలకు చార్జీలు ఇలా... చార్జీల పెంపుతో హైదరాబాద్ నుంచి విజయవాడకు అన్ని కేటగిరీ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు దాదాపు రూ. 55 మేర పెరుగుతాయి. అలాగే కరీంనగర్‌కు రూ. 32, వరంగల్‌కు రూ. 30, నిజామాబాద్‌కు రూ. 35, ఖమ్మంకు రూ. 45, ఆదిలాబాద్‌కు రూ. 60 మేర పెరుగుతాయి. ఉదాహరణకు ప్రస్తుతం నగరం నుంచి విజయవాడకు సూపర్ లగ్జరీ చార్జీ రూ. 315గా ఉంది. దీన్ని రూ. 370కి పెంచుతారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ. 140 ఉంది. దాన్ని రూ. 175కు పెంచుతారు. కి.మీ.కి 20 పైసల చొప్పున పెంచుతూ చిల్లర సమస్య రాకుండా ఆ మొత్తాన్ని సర్దుతారు. రోడ్డు సెస్, టోల్ వ్యయాల వల్ల చార్జీల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. శనివారం సాయంత్రానికి అన్ని డిపోలకు తుది చార్జీల పట్టికను అధికారులు పంపనున్నారు. -
సిటీకి చక్రాలు కావాలి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలవుతోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు దాదాపుగా 30 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్తారని అంచనా. తెలంగాణ నుంచి సంక్రాంతి, దసరా సమయాల్లో రద్దీ అధి కంగా ఉంటుంది. అందులోనూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలు సంక్రాంతికి తప్పకుండా స్వగ్రామాలకు వెళ్తారు. నగరం విస్తరిస్తోన్న దరిమిలా వీరి సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లడం ఓ ప్రహసనంగా మారింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా సంస్థలే కీలకం. అయితే.. పండుగల సమయంలో ఉండే రద్దీని నియంత్రిం చడం సాధ్యంకాకపోవడంతో.. ఈ వ్యవస్థలు అదనపు చార్జీల రూపంలో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇది సామాన్యుడిని ఆవేదనకు గురిచేస్తోంది. రైలు, బస్సుల టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పండుగపూట సొంతూరికి వెళ్లే భాగ్యం తమకు లేదా? అని వాపోతున్నాడు. ‘పంచాయతీ’ నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఊరికి రావాలంటూ పిలుపులు వస్తున్నందున.. ఈసారి తెలంగాణ పల్లెలకూ ప్రయాణికులు పోటెత్తుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో సహజంగానే రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొన్నటి దసరా సమయంలోనూ తెలంగాణ జిల్లాలకు ప్రజలు పోటెత్తారు. 50% అదనపు చార్జీలు చెల్లించి బస్సుల్లో వేలాడుతూ మరీ వెళ్లారు. ఒక్క నగరం నుంచే దాదాపుగా 10 లక్షల మందికిపైగా తెలంగాణ ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో సంక్రాంతి ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు సంక్రాంతికి తప్పకుండా వెళతారు. ఇలాంటి వెళ్లే వారి సంఖ్య దాదాపు 20 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. దీంతో ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు, రైళ్లపై అపుడే చర్చ మొదలైంది. ముందస్తుగా రైళ్లల్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి అదనపు ఛార్జీలు గండం తప్పినా.. అలాంటివారు చాలా తక్కువ. ఏపీ నుంచి వచ్చి నగరంలో స్ధిరపడిన వారిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి ముందస్తుగా సెలవులు వచ్చే అవకాశం తక్కువ. ఇలాంటి వారంతా జనవరి 7 తర్వాత ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. కాగా ఎప్పటిలాగే.. రైల్వే, ఆర్టీసీలు టికెట్లపై అదనపు ఛార్జీల పేరిట బాదుడుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే అదనపుగా ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.300 ఉండే టికెట్ ఛార్జీని రూ.3000 వరకు పెంచేస్తున్నాయి. వీరి చార్జీల పెంపునకు ఒక విధానమంటూ లేకపోవడంతో ఒకే గమ్యస్థానానికి రకరకాల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో నలుగురు సభ్యులున్న కుటుంబ ప్రయాణమంటే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రజారవాణానే కీలకం జనవరి మొదటివారం నుంచే సంక్రాంతి రద్దీ మొదలవుతుంది. ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ 2వ తేదీన ప్రకటించనుంది. దాదాపు 4,500 బస్సులను తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు నడపొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జనవరి 7 నుంచే రద్దీ ఊపందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ కూడా హైదరాబాద్‌కు 1000 బస్సుల వరకు నడపనుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల ద్వారా దాదాపుగా 20 లక్షలకు పైగా ప్రయాణం చేస్తారని అంచనా. సాధారణంగా తెలంగాణ, ఆంధ్రకు కలిపి రోజుకు 40 రైళ్లలో రాకపోకలు జరుగుతాయి. వీటిలో రోజుకు 56వేల మంది ప్రయాణిస్తారు. పండగ వేళ రోజుకు 3 ప్రత్యేక రైళ్లు తోడవడంతో ఈ సంఖ్య 60 వేలు దాట నుంది. 7వ తేదీ నుంచి 13 వరకు దాదాపు 4.5 లక్షల మంది రైళ్ల ద్వారా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు దందా.. ఇవి కాకుండా తెలంగాణ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో దాదాపు 7,800కు పైగా వివిధ కంపెనీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో ఛార్జీల గురించి తెలుసుకుంటేనే భయమేస్తోంది. సాధారణ రోజుల్లో రూ.300–500 రూపాయలుండే టికెట్‌ను తత్కాల్, ఇతర ఛార్జీల రూపంలో రూ.2,500 నుంచి 3,000 వరకు పెంచేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏకంగా ఒక్కో టికెట్‌కు రూ.4000కుపైగా వసూలు చేస్తున్నాయి. వీటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ట్రావెన్స్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రైవేటు ఆపరేట్ల బస్సుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు సొంతూళ్లకు వెళ్లనున్నారు. ఇక సొంత వాహనాల ద్వారా రెండు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లేవారు 1–2 లక్షల మంది ఉంటారని అంచనా. ఏ మార్గాల ద్వారా ఎంతమంది? రెండు ఆర్టీసీలు: 20 లక్షల మందికిపైగా రైలు మార్గాలు: సుమారు 5 లక్షలు ప్రైవేటు బస్సులు: దాదాపుగా 5లక్షల మంది సొంత, ఇతర వాహనాలు: సుమారుగా 2 లక్షలు మొత్తం : దాదాపు 30–35 లక్షలకుపైగా ప్రయాణం చేయనున్నారు. రైలు ఛార్జీలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు.. రైలు చార్జీల పెంపు వ్యవహారం కేంద్రమంత్రి వరకూ వెళ్లినట్లు సమాచారం. నగరానికి చెందిన జాతీయపార్టీ నేతలు అధిక ఛార్జీలపై పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు దీనిపై మంత్రికి నివేదిక కూడా ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం 9 ప్రత్యేక రైళ్లే వేసామని, పూర్తిస్థాయిలో రైళ్లు వేయలేదని, త్వరలోనే మరిన్ని రైళ్లు వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సంక్రాంతి సీజన్లో ఈ రైళ్లన్ని తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయని అందుకే ఎక్కువ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామని గోయల్‌కు వివరించారు. త్వరలోనే జనసాధారణ్ రైళ్లు సామాన్యుల కోసం త్వరలోనే జనసాధారణ్ పేరుతో రైళ్లను వేయనున్నట్లు తెలిపారు. 14–15 జనరల్ బోగీలతో ఉండే ఈ రైళ్లలో సాధారణ చార్జీలే ఉండనున్నాయని సమాచారం. -
కాసుల గలగల !
స్టేషన్ మహబూబ్‌నగర్ : ఆర్టీసీకి దసరా పండగ కలిసొచ్చింది. పండగ సందర్భంగా ముందు నుంచి సెలవులు ముగిసే వరకు అదనపు బస్సు సర్వీసులు నడపడంతో మంచి ఆదాయాన్ని ఆర్జించింది. మహబూబ్‌నగర్ రీజియన్ వ్యాప్తంగా తొమ్మిది డిపోల నుంచి ప్రయాణికుల కోసం అధికారులు అదనంగా 299 బస్సులు నడపడంతో ఆర్టీసీ గల్లా పెట్టె కళకళలాడింది. సాధారణ రోజుల్లో కంటే రీజియన్ పరిధిలోని ప్రతీ డిపోకు రోజుకు సాధారణంగా కంటే రూ.లక్ష నుంచి రూ.2లక్షల అదనపు ఆదాయం నమోదు కావడం విశేషం . అదనపు సర్వీసులు దసరా సెలవులను పురస్కరించుకుని హైదరాబాద్‌తో పాటు ఇతరత్రా ప్రాంతాలకు స్థానికులు వచ్చి వెళ్లడం ఆనవాయితీ. దీంతో ముందుగానే ఆర్టీసీ అధికారులు ప్రణాళికాప్రకారం ముందుకు సాగారు. ఈ మేరకు 10 నుంచి అదనపు సర్వీసులు నడిపించారు. డిపోల వారీగా గద్వాల నుంచి 24, మహబూబ్‌నగర్ నుంచి 48, వనపర్తి నుంచి 33, షాద్‌నగర్ నుంచి 38, అచ్చంపేట నుంచి 29, కల్వకుర్తి నుంచి 26, కొల్లాపూర్ నుంచి 19 అదనపు సర్వీసులతో పాటు నాగర్‌కర్నూల్ డిపో నుంచి 30 అదనపు బస్సులను నడిపించారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకపోగా.. ఆర్టీసీకి భారీగా ఆదాయం నమోదైంది. అయితే, ఆదివారంతో సెలవులు ముగిసినా ప్రయాణికుల రద్దీని బట్టీ మరో రెండు రోజుల వరకు అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆర్టీసీకి పండుగ పండుగ సమయంలో రెండు రోజులు మినహా ప్రతి రోజు రీజియన్‌కు అదనపు ఆదాయం లభిం చింది. సాధారణ రోజుల్లో ఆదాయం కంటే పండు గ రోజుల్లో ప్రతి డిపోకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు అదనపు వచ్చింది. రీజియన్‌లోని డిపోల్లో మహబూబ్‌నగర్ డిపో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తుంది. హైదరాబాద్ రూట్లో నడిపే బస్సుల ద్వారా మహబూబ్‌నగర్ డిపో అధిక ఆదాయాన్ని పొందుతుంది. పండుగ ముగియడంతో ప్రజలు తిరుగుప్రయాణం పట్టారు. దీంతో రీజియన్‌లోని బస్టాండ్లలో ప్రయాణీకులు కిక్కిరిసిపోతున్నారు. రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో శనివారం రూ.97,94,306, ఆదివారం రూ.1,09,76,806 ఆదాయం నమోదైంది. సాధారణ రోజుల్లో పోలిస్తే ఆదివారం రీజియన్‌కు రూ.17లక్షలకుపైగా అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. రీజియన్ వ్యాప్తంగా సాధారణ రోజుల్లో 3,28,897 కిలోమీటర్లు నడిచే బస్సులు శనివారం ఆర్టీసీ బస్సులు 3,34,441 కిలోమీటర్లు, ఆదివారం 3,48,096 కిలోమీటర్లు నడిచాయి. -
చార్జీల పెంపునకు ఇదా సమయం!
సాక్షి బెంగళూరు: కేరళ, కర్ణాటకల్లో వరద సమయాల్లోనూ ప్రైవేట్ విమానయాన సంస్థలు వ్యాపార దృష్టితో ఉండటం శోచనీయమని కేంద్ర మంత్రి సదానంద మండిపడ్డారు. సాధారణ వేళల్లో బెంగళూరు–మంగళూరు మధ్య విమాన ప్రయాణ చార్జీలు రూ. 4 వేలుంటే, ఇప్పుడు రూ.18 వేలకు తాకాయని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు, రైళ్లు సహా మంగళూరు, కేరళకు వెళ్లే అన్ని రవాణా మార్గాలు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో విమానయానం ఒక్కటే ప్రజలకు ముందున్న ప్రయాణ మార్గమని, దీన్ని ఆసరాగా చేసుకుని చాలా ప్రైవేటు సంస్థలు చార్జీలను అమాంతం పెంచేశాయి. -
చార్జీల మోత
♦ చార్జీల మోత.. కరెంటు వాత ♦ బస్సు భారం ఏటా రూ.12.15 కోట్లు ♦ ప్రతినెలా విద్యుత్ వడ్డింపు రూ.5 కోట్లు! ♦ కుదేలైన సామాన్య జనం సర్కారు తీరుపై విమర్శలు సర్కార్ ఒకే రోజు రెండు షాకులిచ్చింది. చార్జీల వడ్డింపుతో సామాన్యులను ఎడాపెడా బాదేసింది. ఓ వైపు విద్యుత్, మరోవైపు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. వంద యూనిట్లు దాటితే చాలు పెంపు భారం తప్పదు. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తోన్న దశలో సామాన్యుడు సైతం వంద యూనిట్ల స్లాబ్ దాటేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా పెంపు భారాన్ని మోయక తప్పని పరిస్థితి. మెదక్: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు భారం సామాన్యుడిపై పడింది. ఆర్డినరీ బస్సుతోపాటు అన్ని రకాల బస్సుల్లోనూ ప్రభుత్వం చార్జీల మోత మోగించింది. 30కిలో మీటర్లకుపైగా ప్రయాణించే ప్రతి ప్రయాణికుడిపై అదనపు భారం మోపింది. జిల్లాలో ఏడు బస్సు డిపోలు ఉండగా మొత్తం 618 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో 269 ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుండగా, 349 ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్‌లగ్జరీ బస్సులున్నాయి. నిత్యం ఈ బస్సులు 2.25 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇందులో 1,12,500 కిలో మీటర్ల ప్రయాణం 30కిలో మీటర్లపైనే కొనసాగుతుంది. 30 కిలో మీటర్ల లోపు రూపాయి చొప్పున పెరుగుతుండటంతో ఏడాదికి రూ.4.05 కోట్ల భారం పడగా, 30 కిలోమీటర్ల ఆపైనా.. 8.10 కోట్ల భారం పడుతుంది. మొత్తం రూ.12.15 కోట్లు భారం ప్రయాణికుడిపై పడనుంది.ఇప్పటికే కరువు, కాటకాలతో నిండా మునిగిన పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరింత భారం కానుంది. ఇప్పటికే కరువుతో ప్రజలు వలసలు వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. అలాంటిది కరువు, కాటకాలతో విలవిలలాడుతున్న ప్రజలపై ఆర్టీసీ చార్జీలను వడ్డించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చార్జీల పెంపుపై మండిపాటు... చార్జీల పెంపు సరికాదని ఇప్పటికే కమ్యూనిస్టులు, ఇతర పార్టీల నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏడాదికి 27శాతం ఆదాయం అధికంగా వస్తుందని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలుపుతామంటూ చెప్పిన మరుసటి రోజే చార్జీలు పెంచడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. ♦ ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముచేసినట్లే అవుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ వడ్డనకు రంగం సిద్ధం
-
ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ట్రావెల్స్