
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ ఎయిర్‌టెల్ భారత్‌లో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. గృహ వినియోగదారులకు ఫైబర్, డీటీహెచ్, మొబైల్ సర్వీసులను ఒకే గొడుకు కిందకు తెచ్చింది. రెండు లేదా అన్ని కనెక్షన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. నచ్చిన విధంగా ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. ఫైబర్ రూ.499, డీటీహెచ్ రూ.153, మొబైల్ రూ.499 నుంచి నెలవారీ ప్లాన్స్ మొదలవుతాయి. లేదా కంపెనీ ప్రవేశపెట్టిన నాలుగు రకాల ప్లాన్స్‌లో దేనినైనా ఎంచుకోవచ్చు. రూ.998 ప్లాన్‌లో రెండు మొబైల్, ఒక డీటీహెచ్ కనెక్షన్ పొందవచ్చు.
రూ.1,598 ప్లాన్ కింద రెండు మొబైల్, ఒక ఫైబర్, రూ.1,349 ప్లాన్‌లో మూడు మొబైల్, ఒక డీటీహెచ్, రూ.2,099 ప్లాన్ కింద మూడు మొబైల్, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్ కనెక్షన్ ఇస్తారు. జీఎస్టీ అదనం. ఎటువంటి అదనపు భారం లేకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. ఇన్‌స్టాలేషన్, సర్వీస్ చార్జీలు లేవు. ఎయిర్‌టెల్ బ్లాక్ వినియోగదారులు కస్టమర్ కేర్ ప్రతినిధిని 60 సెకన్లలోపే ఫోన్‌లో సంప్రదించవచ్చని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment