మాటలకు ఛార్జీల్లేవ్...! | Airtel introduces unlimited voice-calling plans for postpaid | Sakshi
Sakshi News home page

మాటలకు ఛార్జీల్లేవ్...!

Published Sat, Aug 6 2016 2:16 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

మాటలకు ఛార్జీల్లేవ్...!

మాటలకు ఛార్జీల్లేవ్...!

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ఆఫర్లు

న్యూఢిల్లీ : పోస్ట్‌పెయిడ్ విభాగంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎయిర్‌టెల్ అపరిమిత కాలింగ్, ఇతర ప్రయోజనాలతో ‘మై ప్లాన్ ఇన్‌ఫినిటీ’ పేరుతో పలు బండిల్ ఆఫర్లను ప్రకటించింది.

 కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు
రూ.1,199 ప్లాన్ కింద దేశవ్యాప్తంగా ఎక్కడికైనా అపరిమితంగా లోకల్, ఎస్టీడీ మొబైల్ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్  కూడా ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి. దీనికితోడు 1జీబీ 3జీ/4జీ డేటా ఉచితం. వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితమే.

రూ.1,599 ప్లాన్ కింద అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 5జీబీ 3జీ/4జీ డేటాతోపాటు వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే, వింక్ సేవల వినియోగానికి డేటా చార్జీలు వర్తిస్తాయి. ఉచిత డేటా తర్వాత ప్రతి ఎంబీ డేటాకి 50పైసల చార్జీ ఉంటుంది.

 కాల్ కట్ అయితే 10 నిమిషాలు ఫ్రీ: వొడాఫోన్
మాట్లాడుతున్న సమయంలో నెట్‌వర్క్ వైపు నుంచి కాల్ మధ్యలో కట్ అయిపోతే పది నిమిషాల టాక్‌టైమ్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. దీనికి కొన్ని షరత్తులను కూడా పెట్టింది. కాల్ కట్ అయితే కస్టమర్లు ’ఆఉఖీఖీఉఖ’ అని టైప్ చేసి 199కు ఎస్‌ఎంఎస్ చేయాలి. అప్పుడే వొడాఫోన్ ఉచిత టాక్‌టైమ్‌ను జమచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement